గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కోడెల ఆత్మహత్యకు ముందు ఆమెతో ఏం మాట్లడారు..? అసలేం జరిగిందంటే

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : ఏపి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య మిస్టరీలో అనేక కోణాలు ఉన్నట్టు తెలుస్తోంది. కోడెల ఉరివేసుకోవడం వల్ల మృతిచెందినట్టు పోస్టు మార్టమ్ రిపోర్టు స్పష్టం చేస్తున్నప్పటికి, ఉరివేసుకోవడానికి ముందు కోడెల ఎవరెవరితో సంప్రదింపులు జరిపారు, ఎవరితో ఎంత సేపు మాట్లాడారు, బసవతారకం హెచ్ఆర్ హెడ్ సుమతి తో చివరి సారి కోడెల మాట్లాడినప్పుడు ఆవిడకు ఏం చెప్పారనే అంశంపై ఆసక్తి నెలకొంది. కోడెల మృతిచెందిన సమయానికి ఆయన గృహంలో సెక్యూరిటీ సిబ్బందితో కలిపి ఆరుగురు వ్యక్తులు ఉన్నట్టు తెలుస్తోంది. కోడెల శివప్రసాద్ ఉపయోగించే మొబైల్ ఫోన్ అదృశ్యం కావడం, ఆయన గదిలో ఉన్న బీపి, శుగర్ ట్యాబ్లెట్స్ రేపర్స్ కింద పడి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. కోడెల డ్రైవర్, గన్ మెన్, కూతురు విజయ లక్ష్మి, భార్య ఆ సమయంలో అక్కడే, అదే ఇంట్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఐతే ఎవరి గదుల్లో వారున్నట్టు సమాచారం.

కోడెల మొబైల్ ఎక్కడ..! 24నిమిషాలు మాట్లాడిన అవతలి వ్యక్తి ఎవరు..!!

కోడెల మొబైల్ ఎక్కడ..! 24నిమిషాలు మాట్లాడిన అవతలి వ్యక్తి ఎవరు..!!

ఇక డ్రైవర్, గన్ మెన్ కింద గదిలో ఉండగా, ప్రధాన గేట్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది. కోడెల గది తలుపు తట్టిన కూతురు విజయ లక్ష్మి మూడో ప్రయత్నంగా కిటికి బద్దలుకొట్టి గదిలోకి వెళ్లి ఫ్యాన్ కు వేళాడుతున్న తండ్రిని గన్ మెన్, డ్రైవర్ సాయంతో కిందకు దించి హుటాహుటిన బసవతారకం ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తోంది. అయితే కోడెల మృతి చెందిన తర్వాత మొట్టమొదటగా గదిలోకి వెళ్లిన విజయలక్ష్మికి తండ్రి ఉపయోగించే మొబైల్ ఫోన్, ట్యాబ్లెట్ లకు సంబందించిన కవర్లు, ఉరి వేసుకోవడానికి ఉపయోగించిన పనిముట్లు, సెల్ ఫోన్ లో చివరిసారిగా ఎవరితో మాట్లాడారను, ఎలాంటి మెస్సేజ్ లు వచ్చాయి, వాట్స్ యాప్ స్టేటస్ తదితర ఆసక్తికర అంశాలన్నీ తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అన్నీ సందేహాలే..! ముందుగా గదిలోకి వెళ్లిన కూతురుకు కనిపించిందేంటి..!!

అన్నీ సందేహాలే..! ముందుగా గదిలోకి వెళ్లిన కూతురుకు కనిపించిందేంటి..!!

ఐతే కోడెల శివ ప్రసాద రావు ఉపయోగించే ప్రధాన మైన మొబైల్ ఫోన్ కనిపించడంలేదనే వార్త ఆందోళన కలిగిస్తోంది. చనిపోయే ముందు ఆయన 20నిమిషాల పాటు ఏకధాటిగా మాట్లడారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే 24నిమిషాలు మాట్లాడిన అవతలి వ్యక్తి ఎవరనే అంశం పై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. 24నిమిషాల పాటు అత్యంత సన్నిహితులతో గాని, స్నేహితులతో గాని మాత్రమే మాట్లాడే అవకాశం ఉంది. ఇతర వారితో మాట్లాడితే అంత ఉదయాన్నే అంత మొబైల్ కాలక్షేపం చేసే ఆవశ్యకత ఉండదు. అత్యంత దగ్గరి వ్యక్తులు మాత్రమే అంతసేపు మాట్లాడే వెసులుబాటు ఉంటుందనే చర్చ కూడా జరుగుతోంది.

సెల్ ఫోన్ లో సుధీర్గ సంభాషణ..! హాస్పత్రి కి గన్ మెన్ పాత్ర ఏంటి..?

సెల్ ఫోన్ లో సుధీర్గ సంభాషణ..! హాస్పత్రి కి గన్ మెన్ పాత్ర ఏంటి..?

ఇక ఆత్మహత్య చేసుకోవడానికి చాలా సేపు సమాలోచనలు చేసుకున్నట్టు తెలుస్తోంది. చివరికి ఉరివేసుకుని చనిపోవాలనుకున్న కోడెల తన లుంగీ అంచును సన్నగా చించి ప్రయత్నించి నట్టు తెలుస్తోంది. తర్వాత గదిలో ఉన్న కేబుల్ వైర్ ను మెడకు, ఫ్యాన్ కు తగిలించుకుని తుది శ్వాస విడిచినట్టు తెలుస్తోంది. ఐతే మరణించే ముందు 24నిమిషాలు పాటు మాట్లాడిన కోడెల తర్వాత బసవతారకం హెచ్ఆర్ హెడ్ సుమతికి ఫోన్ చేసి మాట్లాడినట్టు తెలుస్తోంది. సుమతి బసవతారకం హాస్పత్రి నెలకొల్పినప్పటినుండి హెచ్ఆర్ విభాగంలో పని చేస్తున్నట్టు బసవతారకం సిబ్బంది చెప్పుకొస్తున్నారు. అంతే కాకుండా బసవతారకంలో ఏంజరుగుతుందో తెలుసుకోవాలంటే బసవ తారకం హాస్పటల్ ఛైర్మన్, హీరో బాలకృష్ణ కూడా సుమతికే ఫోన్ చేసి సమాచారం తెప్పించుకోవడం సర్వసాధారణమైన అంశమని తెలుస్తోంది.

ఫోన్ కాల్ పైనే అసలు దృష్టి

ఫోన్ కాల్ పైనే అసలు దృష్టి

సుమతి బసవతారకం ఆస్పత్రి నెలకొల్పినప్పటి నుండి హెచ్ఆర్ విభాగంలో పని చేస్తున్నట్టు బసవతారకం సిబ్బంది చెప్పుకొస్తున్నారు. అంతే కాకుండా బసవతారకంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే బసవ తారకం ఆస్పత్రి ఛైర్మన్, హీరో బాలకృష్ణ కూడా సుమతికే ఫోన్ చేసి సమాచారం తెప్పించుకోవడం సర్వసాధారణమైన అంశమని తెలుస్తోంది. ఇలాంటి వ్యక్తి తో చివరి క్షణంలో ఏం మాట్లాడారనే విషయంపై పోలీసులు దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.

బసవతారకం సిబ్బంది సుమతి తో చివరి కాల్..! కోడెల ఏం చెప్పారు..?

బసవతారకం సిబ్బంది సుమతి తో చివరి కాల్..! కోడెల ఏం చెప్పారు..?

ఐతే బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి హెచ్ఆర్ హెడ్ సుమతి తో కోడెల శివప్రసాద్ రావు చివరి సారి ఏంమాట్లాడారు..? అసలు ఆమెతో మాట్లాడాల్సిన అవసరం ఏంటి..?అనే అంశాలు దర్యాప్తులో కీలకం కానున్నాయి. కోడెల ఫోన్ లభ్యమైతే ఈ అంశం పై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ కోడెల ఫోన్ లో కాల్ రికార్డర్ ఉంటే అసలు మొత్తం అంశంపై స్పష్టత ఉంటుందనే చర్చ జరుగుతోంది. కోడెల ఆత్మహత్య చేసుకున్న తర్వాత గదిలోకి ముందుగా వెళ్లిన కూతురు విజయ లక్ష్మి కి తండ్రి ఉపయోగించే మొబైల్ ఫోన్ పై అవగాహన ఉండే అవకాశం ఉంది.

కోడెల ఫోన్ స్విచ్ ఆఫ్‌పై..

కోడెల ఫోన్ స్విచ్ ఆఫ్‌పై..

కోడెల చనిపోయిన రోజున సాయంత్రం 5గంటలకు ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్టు తెలుస్తోంది. అంతవరకు ఆయన కాల్ హిస్టరీని ఎవరైనా పరిశీలించారా అన్నది కూడా ఆసక్తిరేపుతోంది. అయితే చివరి సారిగా 24నిమాషాల పాటు మాట్లాడిన అవతలి వ్యక్తి ఎవరో తెలిసినా, తర్వాత హెచ్ ఆర్ సుమతికి కాల్ చేసి కోడెల ఏంచెప్పారో తెలిసినా కోడెల మరణం వెనక ఉన్న మిస్టరీ కొంతవరకైనా వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి.


English summary
The former speaker of the AP, Kodela Shivaprasad, seems to have many angles in the suicide mystery. Even though the post-mortem report was made clear by the execution of the Kodela, the Kodela had been consulted with whom before the execution, how long did he talk to, and what was the last time that had spoken to the HR head Sumati Interest in the topic.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X