గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కోడెలది ఆత్మహత్య..? లేదా గుండెపోటా..?? సమగ్ర దర్యాప్తుకు ఏపీ మంత్రి బొత్స డిమాండ్

|
Google Oneindia TeluguNews

Recommended Video

కోడెలది ఆత్మహత్య..? లేదా గుండెపోటా..?? సమగ్ర దర్యాప్తుకు ఏపీ మంత్రి బొత్స డిమాండ్

అమరావతి : ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మృతిపై వైసీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయనది ఆత్మహత్య లేదా గుండెపోటుతో చనిపోయారా అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. కోడెల మృతిపై తమకు అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. కానీ తిరిగి వారు వైసీపీపై విమర్శలు చేస్తున్నారని తప్పుపట్టారు. ఇది సరికాదని .. అసత్య ఆరోపణలు చేయడం తగదన్నారు.

కోడెలను సీఎం జగన్ హత్య చేసారు : ప్రభుత్వంపై కేసు పెట్టాలి: టీడీపీ నేతల తీవ్ర వ్యాఖ్యలు..!!కోడెలను సీఎం జగన్ హత్య చేసారు : ప్రభుత్వంపై కేసు పెట్టాలి: టీడీపీ నేతల తీవ్ర వ్యాఖ్యలు..!!

కోడెల మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఆయన మృతిపై అనుమానాలు కలుగుుతున్నాయని చెప్పారు. తొలుత కోడెల ఆత్మహత్య చేసుకున్నారని ప్రకటించారు. తర్వాత గుండెపోటు అని చెప్తున్నారు. ఇందులో ఇంతకీ ఏదీ నిజం అని ప్రశ్నిస్తున్నారు. కోడెల ఉరేసుకుంటే వెంటనే అతనిని బసవతారకం ఆస్పత్రికి ఎందుకు తరలించారు అని నిలదీశారు. బసవ తారకం ఆస్పత్రి క్యాన్సర్ స్పెషలిస్ట్ కదా ... ఉరేసుకుంటే లేదా గుండెపోటు వస్తే అక్కడ ఏం వైద్య చికిత్సలు అందిస్తారు అని ప్రశ్నించారు. నిమ్స్ ఆస్పత్రి లేదంటే కేర్ ఆస్పత్రికి తరలిస్తే సరిపోయేది కదా అని చెప్తున్నారు. అలా చేయక బసవతారకం ఆస్పత్రికి తీసుకెళ్లడంలో ఆంతర్యం ఏంటి అని నిలదీశారు.

whether kodela dead suicide or heart stroke..!!

నవ్యాంధ్రప్రదేశ్ తొలి స్పీకర్, మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన ఇంటిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కోడెల శివప్రసాద్ రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా పనిచేసి మన్ననలు పొందారు. ఏపీ తొలి స్పీకర్‌గా పనిచేశారు. కానీ అతని కుమారుడు శివరామకృష్ణ, కూతురు విజయలక్ష్మీ చేసిన అరాచకాలు గత ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణమయ్యాయి. పోలింగ్ సెంటర్ వద్దకెళ్లే సమయంలో దాడికి గురయ్యారు.

English summary
YCP leaders are doubting the death of former speaker of AP Kodela Sivaprasad. It is straightforward to question whether he died of suicide or heart attack. They have doubts about the death of Kodela. But then again they were wrong that the YCP was criticized. This is not correct.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X