• search
  • Live TV
గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

గుంటూరులో వైసీపీ పాగా: మూడు రాజధానులపై చంద్రబాబు మాట మీద నిలబడతారా?

|

అమరావతి: రాష్ట్రంలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు నిర్వహించిన ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జైత్రయాత్ర కొనసాగుతోంది. నాలుగు ఏకగ్రీవాలు పోను.. 71 మున్సిపాలిటీలు, 11 మున్సిపల్ కార్పొరేషన్లలో వైఎస్సార్సీపీ ప్రభంజనాన్ని సృష్టించింది. అధికారంలోకి వచ్చిన ఈ 22 నెలల కాలంలో తమ పట్టు ఏ మాత్రం సడలిపోలేదని నిరూపించుకోగలిగింది. పల్లెలు, పట్టణాలు, నగరాలనే తేడా లేకుండా క్లీన్ స్వీప్ చేస్తోంది. మొన్నటికి మొన్న ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికలకు మించిన స్థాయిలో వైసీపీ పట్టణాల్లో విజయాన్ని అందుకుంటోంది.

అన్నింటికీ మించి..

అన్నింటికీ మించి..

మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం.. ఆ దిశగా కసరత్తు సాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో గ్రేటర్ విశాఖ, విజయవాడ, గుంటూరు.. ఈ మూడు కార్పొరేషన్లు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారాయి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లలో విజయం సాధించడం ద్వారా ప్రజలు మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఉన్నారనే విషయాన్ని చాటి చెప్పాలని తెలుగుదేశం పార్టీ భావించింది. ఈ రెండింటినీ తమ ఖాతాలో వేసుకుని అమరావతి సెంటిమెంట్ లేదనే విషయాన్ని స్పష్టం చేయాలనే పట్టుదలను వైసీపీ ప్రదర్శించింది.

ఫలితాలు.. వైసీపీ వైపే

ఫలితాలు.. వైసీపీ వైపే

మిగిలిన జిల్లాల్లో వైసీపీ ఎలాంటి ఘన విజయాలను అందుకున్నదో.. అవే తరహా ఫలితాలు విజయవాడ, గుంటూరు మున్సిపాలిటీల్లో పునరావృతం అయ్యాయి. దీన్ని బట్టి చూస్తోంటే.. మూడు రాజధానుల ఏర్పాటుకు రాజధాని అమరావతి ప్రాంత ప్రజలు కూడా అంగీకరించారని చెబుతున్నారు వైసీపీ నేతలు. ఇదివరకు పంచాయతీలు.. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్‌ను గెలుచుకోవడం ద్వారా తమ నిర్ణయాన్ని ప్రజలు ఓటుతో అంగీకారం తెలిపారని స్పష్టం చేస్తోన్నారు.

చంద్రబాబు కూడా అంగీకరించినట్టేనా?

చంద్రబాబు కూడా అంగీకరించినట్టేనా?

అమరావతి ఎక్కడికీ తరలిపోదంటూ, మూడు రాజధానులకు వ్యతిరేకంగా సుమారు 450 రోజుల వరకు సాగుతోన్న రైతుల నిరసన ప్రదర్శనలకు సారథ్యాన్ని వహిస్తోన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు గుంటూరు ఫలితం ఏ మాత్రం మింగుడు పడని విషయమే. విజయవాడ, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లలో ఎలాగైనా సరే.. విజయం సాధించి తీరుతామనే బలమైన విశ్వాసం ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయనలో కనిపించింది. ఫలితాలు దానికి ప్రతికూలంగా వెలువడ్డాయి. దీనితో తెలుగుదేశం అగ్ర నాయకత్వం దిక్కు తోచని స్థితిలో పడినట్టయింది.

ఎన్నికల్లో చేసిన హామీకి కట్టుబడి ఉంటారా?

ఎన్నికల్లో చేసిన హామీకి కట్టుబడి ఉంటారా?

ఈ పరిణామాల మధ్య.. చంద్రబాబు గుంటూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచారం సందర్భంగా చేసిన హామీకి కట్టుబడి ఉంటారా? లేదా? అనేది చర్చనీయాంశమౌతోంది. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో గనక వైసీపీ గెలిస్తే.. అమరావతిని ఎక్కడికైనా మార్చుకోవచ్చంటూ తాను రాసిచ్చినట్టేనని చంద్రబాబు ప్రకటించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చంద్రబాబు తన మాటకు కట్టుబడి ఉంటారా? మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఆయన పరోక్షంగా అంగకరించినట్టేనా అనే డిబేట్ సోషల్ మీడియా వేదికగా నడుస్తోంది.

English summary
Will Chandrababu stand by his word to shift AP Capital from Amaravati?.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X