గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అజ్ఞాతం వీడిన యరపతినేని ..ఆ భూముల కోసమే నాపై కేసులు అని సంచలనం

|
Google Oneindia TeluguNews

ఏపీలో అజ్ఞాతంలో ఉన్న టీడీపీ నేత యరపతినేని ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు .మంగళవారం నాడు గుంటూరులోని టీడీపీ శిబిరంలో ఒక్కసారిగా ప్రత్యక్షం అయ్యారు యరపతినేని శ్రీనివాసరావు . సరస్వతి సిమెంట్ భూముల కోసమే తనపై కేసులు పెట్టారని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు.

సొంత పార్టీ నేతల ఫ్లెక్సీలు తొలగించిన వైసీపీ ఎమ్మెల్యే ... ఎందుకో తెలుసా !!సొంత పార్టీ నేతల ఫ్లెక్సీలు తొలగించిన వైసీపీ ఎమ్మెల్యే ... ఎందుకో తెలుసా !!

అక్రమ మైనింగ్ కేసు విషయమై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నాటి నుండి యరపతినేని శ్రీనివాసరావు అజ్ఞాతంలోకి వెళ్లాడు. సీబీఐ విచారణ విషయమై న్యాయ నిపుణుల సలహలు తీసుకొంటున్నాడనే ప్రచారం సాగింది. .గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ పై అక్రమ మైనింగ్ కేసులో యరపతినేనిపై సీబీఐ విచారణకు హైకోర్టు అనుమతించింది. దీంతో యరపతినేనికి ఉచ్చు బిగుసుకుంది .వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై సీబీఐ విచారణ నిర్వహించాలని నిర్ణయించింది. కేబినెట్‌లో చర్చించిన తర్వాత సీబీఐ విచారణ జరపాలని మంత్రివర్గం తీర్మానించింది.

yarapathineni srinivasa sensational comments on ycp about the CBI case

ఇక అప్పటి నుండి బయటకు రాని యరపతినేని నేడు టీడీపీ శిబిరంలో అకస్మాత్తుగా ప్రత్యక్షం అయ్యారు. తాను ఎక్కడికి పారిపోలేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన పల్నాడులో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు . కావాలని అక్రమ కేసులు,దాడులతో వేధింపులకు పాల్పడుతున్నారని వైసీపీ ప్రభుత్వంపై ఆయన ఆరోపించారు. అక్రమ మైనింగ్ విషయంలో తనపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణను తాను స్వాగతిస్తున్నట్టుగా చెప్పిన ఆయన ఇక అంబటి రాంబాబు చెప్పినట్టుగా 15 ఏళ్ల నుండి మైనింగ్ విషయంలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.గత ప్రభుత్వ హయాంలో అవినీతికి పాల్పడిన వారి మెడకు ఉచ్చు బిగించే పనిలో బిజీగా ఉన్న వైసీపీ ప్రభుత్వం యరపతినేని విషయంలో సీబీఐ విచారణకు ఆదేశిస్తే తన మీద కక్ష సాధింపు చర్యల్లో భాగంగా సరస్వతీ సిమెంట్ భూముల కోసం కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు యరపతినేని .

English summary
TDP leader Yarapathineni in the AP was finally came out .In one instance, Yarapathineni Srinivasarao appeared on the TDP camp in Guntur on Tuesday. Srinivasarao, a former MLA of Gurajala, alleged that for Saraswati cement lands ycp is harrassing him .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X