గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో ఆగని దాడులు .. టీడీపీ కార్యకర్తపై కత్తులతో దాడి చేసిన వైసీపీ శ్రేణులు

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామాల్లో పార్టీల శ్రేణులు సంయమనం కోల్పోయి దాడులకు పాల్పడుతున్నారు . గ్రామాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. అసలు కారణమే లేకుండా గొడవలకు దిగుతున్నారు. తన్నుకు చస్తున్నారు. ఎన్నికల నేపధ్యంలో మొదలైన ఘర్షణలు ఎన్నికలు ముగిసాక కూడా రావణ కాష్టంలా రాష్ట్రాన్ని దహిస్తూనే ఉన్నాయి.

గంజాయి దందా చేస్తున్న ఇద్దరిపై పీడీ యాక్ట్ .. ఆ పని చేస్తే కఠిన చర్యలని సీరియస్ వార్నింగ్ గంజాయి దందా చేస్తున్న ఇద్దరిపై పీడీ యాక్ట్ .. ఆ పని చేస్తే కఠిన చర్యలని సీరియస్ వార్నింగ్

 పల్నాడులో ఆగని దాడులు .. టీడీపీ కార్యకర్తపై దాడి చేసిన వైసీపీ శ్రేణులు

పల్నాడులో ఆగని దాడులు .. టీడీపీ కార్యకర్తపై దాడి చేసిన వైసీపీ శ్రేణులు

ఎన్నికల తర్వాత గుంటూరు జిల్లాలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో ఈ దాడులు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ ఘర్షణలను నివారించేందుకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినా కూడ పరిస్థితుల్లో మార్పు రాలేదు. గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో అధికార వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు కొనసాగుతున్న నేపధ్యంలో గురువారం నాడు తురకపాలెంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ ఒక కార్యకర్తను ఆస్పత్రి పాలు చేసింది . ఈ ఘటనలో టీడీపీ కార్యకర్త అల్లాద్దీన్ గాయపడ్డారు.

Recommended Video

భద్రత విషయంలో హై కోర్టును ఆశ్రయించిన చంద్రబాబు
కత్తులతో దాడి చేసిన వైసీపీ శ్రేణులు .. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన టీడీపీ కార్యకర్త

కత్తులతో దాడి చేసిన వైసీపీ శ్రేణులు .. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన టీడీపీ కార్యకర్త

ఓ అంగన్ వాడీ కేంద్రానికి సంబంధించి టీడీపీ, వైసీపీ మద్దతుదారుల మధ్య వాగ్వాదం జరిగింది . దీంతో ఒక్కసారిగా రెచ్చిపోయిన వైసీపీ మద్దతుదారులు టీడీపీ కార్యకర్త షేక్ అల్లావుద్దీన్ పై కత్తులతో దాడిచేశారు. ఈ ఘటనలో ఆయన కుడిచేతికి తీవ్రగాయం అయింది. దీంతో ఆ గాయంతోనే మాచవరం పోలీస్ స్టేషన్ కు వచ్చిన అల్లావుద్దీన్ ఫిర్యాదు చేశాడు. మరోవైపు ఈ దాడికి పాల్పడిన వ్యక్తులు ఘటన అనంతరం అక్కడ నుండి పారిపోయారు . దీంతో కేసు నమోదుచేసిన మాచవరం పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు రోజుల క్రితం టిడిపి నాయకులు తమ పార్టీ వ్యక్తులపై వైసిపి దాడుల గురించి డిజిపికి ఫిర్యాదు చేశారు. కానీ దాడులు మాత్రం ఆగటం లేదు .

ఎన్నికలు ముగిశాక కూడా గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం

ఎన్నికలు ముగిశాక కూడా గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం

ఇప్పటికే అధికారాన్ని కోల్పోయిన టీడీపీ తమ కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయని ఆరోపణలు చేస్తుంది. ప్రభుత్వం అరాచాకత్వాన్ని ప్రోత్సహిస్తుందని మండి పడుతుంది , వైసీపీ శ్రేణుల దాడులను సహించేది లేదని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. కార్యకర్తలకు బాసటగా నిలవాలని ఆయన ఓదార్పు యాత్ర చేపట్టనున్నారు. ఒక పక్క హోం మంత్రి దాడులపై స్పందిస్తూ దాడులను సహించమని , ప్రతీ చోటా కాపలా పెట్టలేమని చెప్తున్నారు. కానీ ఏపీలో దాడులు మాత్రం గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం క్రియేట్ చేస్తున్నాయి. ఈ సంఘటనలు రాబోయే రోజుల్లో రాజకీయ దాడులపై ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి.

English summary
YCP men used hunting sickles to kill TDP activist Sk Allauddin at Kothapalem village in Machavaram mandal in Guntur district limits today. His life was saved by the villagers but he suffered serious injuries. Allauddin belongs to Turakapalem. The attackers escaped from the scene. The incident triggered concerns over the increasing political attacks in the coming days. Home Minister Mekathoti Sucharita has claimed that the attacks were not political in nature as there were real estate, long standing personal rivalries, etc which were immediate reasons. However, the TDP leaders have accused the YCP leadership of masterminding these attacks with the motive to create fear psychosis among the TDP activists. These attacks by ruling party are continuing amid reports of the BJP using the YCP as a pawn to weaken the TDP so as to itself emerge as the main opposition in AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X