గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చినబాబు లోకేశ్: రైతుపై 9 కేసులు, కావాలనే పిన్నెల్లి వెళ్లారు, అనాలోచిత నిర్ణయమని ధ్వజం..

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి రైతులంటే లెక్కేలేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. అన్నదాతలకు అన్నివిధలా అండగా ఉంటామని చెప్పినా వైసీపీ, ఆ మాటే మరచిపోయిందన్నారు. రాజధాని తరలింపును నిరసిస్తూ రైతులు నిరసన చేపడితే కేసులు పెట్టి వేధిస్తున్నారని చెప్పారు. ప్రజలు మీకు అధికారం ఇచ్చింది రైతులపై కేసులు పెట్టడానికా అని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు.

జాతీయ రహదారుల దిగ్బంధం: నేతల హౌస్ అరెస్ట్ లు: కాసేపట్లో లోకేశ్ సైతం..!జాతీయ రహదారుల దిగ్బంధం: నేతల హౌస్ అరెస్ట్ లు: కాసేపట్లో లోకేశ్ సైతం..!

రైతుపై 9 కేసులు

రైతుపై 9 కేసులు


రాజధాని మార్పును నిరసిస్తూ ఏపీలో సబ్బండ వర్గాలు చేపట్టిన దీక్ష 22వ రోజుకు చేరింది. అయితే రాజధాని మార్పును నిరసిస్తూ రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఒక రైతుపై జగన్ ప్రభుత్వం 9 కేసులు పెట్టిందని లోకేశ్ చెప్పారు. దీంతో ప్రభుత్వానికి రైతుల అంటే ఎంత చిన్నచూపు, చులకన భావమో అర్థమవుతోందన్నారు.

చులకన భావం..

చులకన భావం..


గుంటూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు రైతులను కించపరుస్తున్నారని లోకేశ్ మండిపడ్డారు. చినకాకాని వద్ద ఎమ్మెల్యే పిన్నిళ్లి రామకృష్ణారెడ్డి కావాలనే ఆందోళన చేస్తున్న వద్దకు వెళ్లారని ఆరోపించారు. రాజధాని కోసం రైతులు ఆందోళన చేస్తుంటే ఎందుకు వెళ్లారని నిలదీశారు.

Recommended Video

AP Capital Farmers Protest : Exclusive Video Of Nara Lokesh Arranged Gundas For Protest
అనాలోచిత నిర్ణయం

అనాలోచిత నిర్ణయం

అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో రాజధానులు నిర్మించడం సరికాదని లోకేశ్ సూచించారు. రాజధాని మార్పు అంశం జగన్ ప్రభుత్వం తీసుకోబోతున్న అనాలోచిత నిర్ణయమని విమర్శించారు. విశాఖపట్టణంలో ఉన్న మిలీనియం టవర్స్ నిర్మించింది టీడీపీ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. దానిని సచివాలయం కోసం ఉపయోగిస్తామని ఏపీ ప్రభుత్వం పేర్కొన్న నేపథ్యంలో లోకేశ్ స్పందించడం విశేషం.

జిరాక్స్ షాపులే వెలుస్తాయి..

హైకోర్టు వస్తే ప్రయోజనం ఏమీ ఉండదని లోకేశ్ అభిప్రాయపడ్డారు. హైకోర్టుతో కేవలం జిరాక్స్ షాపులు తప్ప మరేమీ ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. మూడు రాజధానుల పేరుతో ఇతర ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు జగన్ సర్కార్ ప్రయత్నిస్తోందని లోకేశ్ ఆరోపించారు. ప్రభుత్వం చేసే అన్నీ పనులను ప్రజలు గనమిస్తున్నారనే సంగతి గుర్తిుంచుకోవాలని లోకేశ్ సూచించారు.

English summary
ycp govt file 9 cases against farmer nara lokesh said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X