గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సొంత పార్టీ నేతలతో వైసీపీ ఎమ్మెల్యే యుద్ధం .. వారి అంతు చూస్తా అంటున్న ఎమ్మెల్యే రజని

|
Google Oneindia TeluguNews

చిలకలూరిపేట వైసిపి ఎమ్మెల్యే విడదల రజిని సొంత పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ నేతలే తనను వెన్నుపోటు పొడవాలని ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యేగా గెలిచి నాలుగు నెలలు గడుస్తున్నా ఏ రోజూ సంతోషంగా లేను అని చెప్పిన ఆమె అది ప్రతిపక్షాల వల్ల కాదు, సొంత పార్టీ నేతల వల్లే అంటూ తేల్చి చెప్పారు.

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తికి చికిత్స చేసిన వైసీపీ ఎమ్మెల్యేరోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తికి చికిత్స చేసిన వైసీపీ ఎమ్మెల్యే

కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే రజనీ వ్యాఖ్యలు

కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే రజనీ వ్యాఖ్యలు

చిలకలూరిపేట పట్టణంలోని ఎస్‌ఎంఎస్‌ గార్డెన్స్‌లో వైసీపీ నేతలు కార్యకర్తల ఆత్మీయ సమావేశం లో మాట్లాడిన ఆమె చేసిన వ్యాఖ్యలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అంతర్యుద్ధాన్ని తేటతెల్లం చేస్తుంది. ఎమ్మెల్యేగా గెలిచి నాలుగు నెలలైనా ఆ ఆనందాన్ని మనసారా ఆస్వాదించలేదని చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే రజని అన్నారు. సొంత పార్టీలోని వ్యక్తులే తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని రజనీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 సొంతపార్టీ నేతలే వెన్నుపోటు పొడుస్తున్నారని మండిపడిన ఎమ్మెల్యే రజని

సొంతపార్టీ నేతలే వెన్నుపోటు పొడుస్తున్నారని మండిపడిన ఎమ్మెల్యే రజని

ఇక తన వెంటే ఉంటూ తనను వెన్నుపోటు పొడవాలని చూస్తున్న వారి అంతు చూస్తా అని విడదల రజిని హెచ్చరించారు. చిలకలూరిపేటలో అవినీతిని తరిమేయాలని లక్ష్యంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైసీపీలో చేరానని చెప్పిన విడదల రజిని తనను టార్గెట్ చేస్తున్న వాళ్ళ అంతు చూస్తానని హెచ్చరించారు. ఆడపిల్లనైనప్పటికీ తాను నాలుగు వైపులా శత్రువులతో పోరాడాల్సి వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

 తన జోలికి వస్తే అంతు చూస్తా అని హెచ్చరిక

తన జోలికి వస్తే అంతు చూస్తా అని హెచ్చరిక

తను నిజాయితీగా సేవలందించడానికి ఎమ్మెల్యే అయ్యాను అని చెప్పిన రజిని, తన జోలికి వచ్చిన వారి అంతు చూసేవరకు విడిచిపెట్టేది లేదని ఇదే తన నైజమని స్పష్టంచేశారు. చిలకలూరిపేటలో అవినీతి రహిత పాలన సాగించడానికి తన వంతు ప్రయత్నంగా రాజకీయాల్లోకి వచ్చిన తన కలను నాశనం చేసేందుకు కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నిస్తున్నాయని చెప్పిన రజిని, ఆ దుష్ట శక్తుల ఆటలు చెల్లవని పేర్కొన్నారు.

 ప్రతిపక్షాలతో కాదు యుద్ధం స్వపక్షంతోనే అంటున్న ఎమ్మెల్యే విడదల రజనీ

ప్రతిపక్షాలతో కాదు యుద్ధం స్వపక్షంతోనే అంటున్న ఎమ్మెల్యే విడదల రజనీ

గత ఎన్నికలలో తన గెలుపే నిజాయితీ గెలుస్తుంది అని చెప్పడానికి నిదర్శనమని ఆమె తెలిపారు. గత ఎన్నికల్లో నాటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మీద పోటీ చేసి రజనీ వ్యాజ్యం సాధించారు. ప్రతిపక్ష పార్టీతో, మాజీ మంత్రితో పోరాటానికి తానెప్పుడూ సిద్ధమని కానీ, సొంత పార్టీ నేతలతో కూడా యుద్ధం చేయాల్సి వస్తోందని ఆమె సభాముఖంగా తెలిపారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో ఉన్న అంతర్గత కలహాలు ఒక్కసారిగా బయటకు వచ్చాయి. రజనీ వ్యాఖల నేపధ్యంలో అసలు పార్టీలో ఏం జరుగుతుంది అన్న చర్చ జోరుగా సాగుతుంది.

English summary
Speaking at a meeting of YCP leaders at SMS Gardens in Chilakaluripeta town, her remarks underscore the ongoing civil war in the YSR Congress party. Chilakaluripeta YCP MLA Rajani said that she did not enjoy the victory since four months of winning as an MLA. Rajani is outraged that the people in her own party are embarrassing her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X