• search
  • Live TV
గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కరోనా కంటే డేంజరస్ వైరస్ .. చంద్రబాబు ఫైర్

|

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ను పట్టిపీడిస్తున్న డేంజరస్ వైరస్ జగన్మోహన్ రెడ్డినేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు. టిడిపి సీనియర్ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. 175 నియోజక వర్గాల ఇన్చార్జిలు ,టీడీపీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్న వీడియో కాన్ఫరెన్స్ లో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేశారు .

చంద్రబాబు గణిత మేధావి, లోకేష్ బాలమేధావి.. అమరావతి కథ , స్క్రీన్ ప్లే బాబుదేనట !!

ఫేక్ న్యూస్ ను నిజాలుగా నమ్మింపజేయడంలో వైయస్ జగన్ దిట్ట

ఫేక్ న్యూస్ ను నిజాలుగా నమ్మింపజేయడంలో వైయస్ జగన్ దిట్ట

రాష్ట్రంలో కరోనా ను మించిన వైరస్ వైరస్ జగన్ అని చెప్పారు చంద్రబాబు నాయుడు . ఫేక్ న్యూస్ ను నిజాలుగా నమ్మింపజేయడంలో వైయస్ జగన్మోహన్ రెడ్డిని మించిన వారు లేరని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కుల మత విద్వేషాలు రగల్చటంలో ఆరితేరినవాడు జగన్ అని పేర్కొన్న చంద్రబాబు పేరుమోసిన క్రిమినల్స్ తో కేసులు పెట్టిస్తున్నారని, మంచి వాళ్ళ పై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. పేకాట దందాలుచేసే వారితో ,కేంద్రమంత్రి పేరుతో మోసగించిన వాళ్ళతో కేసులు వేయిస్తూ, క్రిమినల్స్ ను అడ్డం పెట్టుకొని భయానక వాతావరణం సృష్టిస్తున్నారు అంటూ జగన్ పై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పేదల ఇళ్ళ కోసం రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చిన టీడీపీ

పేదల ఇళ్ళ కోసం రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చిన టీడీపీ

పేదల కోసం నిర్మిస్తున్న టిడ్కో గృహాలను నిరుపేదలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న చంద్రబాబు నా ఇల్లు నా సొంతం, నా స్థలం నాకు ఇవ్వాలి అంటూ రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చారు. ప్రజాందోళనలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించాలని చెప్పిన చంద్రబాబు, లబ్ధిదారులైన పేద కుటుంబాలకు టిడిపి నేతలు అండగా ఉండి పోరాటం సాగించాలని పేర్కొన్నారు. వాళ్లకు ఇల్లు ఇచ్చేవరకు బాధితుల పక్షాన పోరాడాల్సిన బాధ్యత టిడిపి నేతలపై ఉందన్నారు.

సంక్రాంతిలోగా ఇళ్ళు ఇవ్వాలని టీడీపీ డిమాండ్

సంక్రాంతిలోగా ఇళ్ళు ఇవ్వాలని టీడీపీ డిమాండ్

పేదల సొంతింటి కల నెరవేరడానికి టిడిపి ప్రభుత్వం కృషి చేసిందని, ఇక ఇళ్లను ఇస్తే టీడీపీకే మంచి పేరు వస్తుందన్న అక్కసుతో వాటిని నాశనం చేయడమే లక్ష్యంగా వైసీపీ సర్కార్ పెట్టుకుందని చంద్రబాబు విమర్శించారు. నిరుపేదల కోసం నిర్మించే టిడ్కో ఇళ్లను సంక్రాంతి లోగా పూర్తి చేసి ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. లేదంటే నిరుపేదల పక్షాన టిడిపి పోరుబాట పడుతుందని చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు.

టీడీపీ శ్రేణులకు చంద్రబాబు దిశా నిర్దేశం

టీడీపీ శ్రేణులకు చంద్రబాబు దిశా నిర్దేశం

వైసీపీ ప్రభుత్వం మాత్రం నిరుపేదలకు ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చి, ఆ తర్వాత నిర్మాణాలపై దృష్టి సారించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏది ఏమైనా చంద్రబాబు మాత్రం ఏపీలో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, ప్రజా సమస్యల కోసం పోరాడాలని, ఎన్ని అవరోధాలు ఎదురైనా టిడిపి అధికార పార్టీ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు వ్యతిరేకించాలని, ప్రజా ఉద్యమాలు నిర్వహించాలని తేల్చి చెప్తున్నారు.

ఈ క్రమంలో నిత్యం టీడీపీ శ్రేణులకు దిశా నిర్దేశం చెయ్యటంతో పాటు ప్రభుత్వ విధానాలపై పోరాటం చేస్తున్నారు.

English summary
Chandrababu Naidu said that the virus beyond the corona in the state is Jagan. Chandrababu commented that YS Jaganmohan Reddy spread fake news . Chandrababu, who claimed that Jagan was the culprit in inciting caste and religious hatred, was incensed that cases were being filed against notorious criminals and that good people were being slandered.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X