• search
 • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పై GUVI ఉచిత ఆన్‌లైన్ వర్క్ షాప్: ఇలా నమోదు చేసుకోండి..!

|

ఢిల్లీ: ఐఐటీ -ఎం నేతృత్వంలో ప్రారంభమైన స్టార్టప్ గువి(GUVI).ఇప్పటి వరకు దేశంలో ఎప్పుడూ లేనంతగా తొలిసారిగా అతిపెద్ద ఆన్‌లైన్ వర్క్ షాప్‌ AI-For-India పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది గువి. తద్వారా గిన్నిస్ బుక్‌ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. గువి నిర్వహిస్తున్న ఈ ఆన్‌లైన్ వర్క్‌షాప్‌లో దాదాపు 10 లక్షల మంది పాల్గొంటున్నారు. మొత్తం 90 నిమిషాల స్లాట్లలో వీరంతా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 24వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి ఏప్రిల్ 25 సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది.

ఈ కార్యక్రమం ద్వారా కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న 8 ఏళ్ల చిన్నారుల నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు పాల్గొనవచ్చు. ఈ కార్యక్రమంలో పాల్గొని సక్సెస్‌లో భాగాస్వాములు కావాలని కోరుచున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై బిలియన్ మంది భారతీయులకు శిక్షణ ఇచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ రంగంలో ప్రపంచ దేశాల సరసన భారత్‌ను సగర్వంగా నిలపడమే ఏఐ ఫర్ ఇండియా (AI-For-India)లక్ష్యం.

GUVI’s FREE online workshop on coding is all set to create a Guinness World Record on April 24 and 25

ఒక్కరోజు పాటు జరిగే ఈ వర్క్‌షాప్‌లో ఇండస్ట్రీలోని అత్యుత్తమ నిపుణులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై శిక్షణ ఇస్తారు. పైథాన్ లాంగ్వేజ్ ద్వారా ఫేస్ రికగ్నిషన్ అప్లికేషన్ పై తర్ఫీదు ఇస్తారు. గువిలో నమోదైన వారికి పైథాన్ ప్రోగ్రామింగ్ కోసం కోర్సును ఉచితంగా అందిసారు. పైథాన్ ప్రోగ్రామింగ్‌కు మంచి డిమాండ్ ఉంది. గతేడాదితో పోలిస్తే ఈ డిమాండ్ 456శాతం అధికంగా పెరిగింది. ఒక ఫేస్ రికగ్నిషన్ యాప్‌ నిర్మాణం కోసం కావాల్సిన ఇమేజ్ ప్రాసెసింగ్, థంబ్‌నెయిల్ క్రియేషన్, ఫార్మాట్స్, ఫిల్టర్స్‌ను ఈ కార్యక్రమానికి హాజరయ్యేవారికి నేర్పుతారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి సర్టిఫికేట్‌తో పాటు జీఐటీ హబ్‌కు యాక్సెస్ కూడా ఇస్తారు. ఏఐసీటీఈతో సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని గువి నిర్వహిస్తోంది. ఇప్పటికే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు లక్ష మంది పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో పేర్లను నమోదు చేసుకోవాలంటే గువి (GUVI) అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి అక్కడ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

GUVI ఆన్‌లైన్ వర్క్ షాప్‌ కార్యక్రమంలో పాల్గొనాలనుకునేవారు ఈ కింది స్టెప్స్‌ను ఫాలో అవ్వండి:

1. గువి AI for India 1.0 అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి (https://www.guvi.in/AI-for-India)

2. రిజిస్టర్ ఫర్ ఫ్రీ బటన్‌పై క్లిక్ చేయండి

3. గూగుల్‌ఐడీతో సైన్‌ ఇన్ అవ్వండి లేదా సైన్‌ అప్ కోసం మీ వివరాలను పూర్తి చేయండి

4. వర్క్‌షాప్‌ కోసం మీకు అనువైన సమయంను సెలెక్ట్ చేసుకోవడం మర్చి పోకండి.

ఈ కార్యక్రమంను గువి సహవ్యవస్థాపకులు శ్రీదేవి అరుణ్ ప్రకాష్ జ్ఞాపకార్థం నిర్వహిస్తున్నట్లు గువి సీఈఓ అరుణ్ ప్రకాష్ చెప్పారు. ఒక దేశాన్ని ప్రపంచస్థాయిలో ముందుకు తీసుకెళ్లాలంటే అది కేవలం మంచి విద్య వల్లే అవుతుందని అన్నారు. ప్రతి దశాబ్దంలో ఏదో ఒకటి వినూత్న అంశాన్ని కనుగొంటున్నామని చెప్పిన అరుణ్ ప్రకాష్... ఈ సారి కోడింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో దేశం దూసుకెళుతోందని చెప్పారు.

  Remote Voting : 2024 Lok Sabha Elections కి ఇంటర్నెట్ పోలింగ్ బూత్... ఆన్‌లైన్ లో ఓటు !! || Oneindia

  ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్ ఆఫ్ ఇండియా అంశంపై గువి సహ వ్యవస్థాపకుడు, సీఈఓ ఎస్పీ బాల మురుగన్ మాట్లాడుతూ ఈ వర్క్‌షాప్‌లో పాల్గొనే వారి సృజనాత్మకతను వెలికి తీయడంతో పాటు నైపుణ్యాన్ని మరింత మెరుగుపర్చుతామని అన్నారు. తాము నిర్దేశించుకున్న లక్ష్యాన్ని అందుకోవడానికి దోహదపడేలా తమ టీమ్ సహకరిస్తుందని చెప్పారు. లక్ష్యాసాధన దిశగా వారిని తీర్చిదిద్దడమే ఈ వర్క్‌షాప్ ముఖ్య ఉద్దేశమని బాల మురుగన్ వివరించారు.

  English summary
  GUVI, an IIT-M incubated startup, will be coordinating the largest online workshop the country has ever witnessed to form a Guinness world record. An estimated 10 Lakh people will join the online workshop through a series of 90-minutes slots beginning from April 24th, 6 PM to April 25th, 6 PM.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X