అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అరుదైన వ్యాధితో బాధపడుతున్న రెండేళ్ల దేవాన్ష్.. మీరు చేసే సహాయమే ప్రాణాలను కాపాడుతుంది

Google Oneindia TeluguNews

ఇదిగో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న రెండేళ్ల బాలుడి పేరు దేవాన్ష్. 2019లో దేవాన్ష్ నాగరాజన్, రాజేశ్వరి అనే దంపతులకు పుట్టాడు. అనంతపురం జిల్లా గుత్తి మండలంకు చెందిన దేవాన్ష్ ‌తనకు 5 నెలల వయసున్న సమయంలో తీవ్ర అనారోగ్యంకు గురయ్యాడు. జలుబు మరియు కఫంతో చాలా ఇబ్బంది పడ్డాడు. దీంతో తల్లిదండ్రులు నాగరాజన్ రాజేశ్వరిలు ఈ బాలుడిని అనంతపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే బాలుడి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించిన వైద్యులు ఆ చిన్నారి ఛాతీలో ఏదో సమస్య ఉందని కనుగొన్నారు. వెంటనే చెన్నైలోని ఎగ్మోర్‌లో ఉన్న పిల్లల ఆస్పత్రికి తీసుకెళ్లి అక్కడి వైద్యులకు చూపించాలని సూచించారు.

Help 2 years old devansh Recover from heart Problem

అప్పటి వరకు అనంతపురం జిల్లా ఆస్పత్రిలోనే ప్రాథమిక చికిత్స అందించారు. అయితే కొన్ని రోజులు గడిచాక ఎగ్మోర్‌లోని మియాట్ హాస్పిటల్‌కు వెళ్లాల్సిందిగా చెప్పారు. ఇక బాలుడిని అక్కడే ఉంచి చికిత్స అందించేలా చూసుకోవాలని వైద్యులు చెప్పారు. అయితే అక్కడికి తీసుకెళ్లిన తర్వాత ఇప్పటి వరకు ఆ హాస్పిటల్‌లో ఉంచి బాలుడికి చికిత్స అందిస్తూ వస్తున్నారు. అయితే తాజాగా బాలుడి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించిన వైద్యులు వెంటనే బాలుడికి సర్జరీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. చిన్నారి దేవాన్ష్‌ సిమిటార్ సిండ్రోమ్ వ్యాధితో బాధపడుతున్నాడని వైద్యులు తెలిపారు.

దేవాన్ష్‌కు వీలైనంత త్వరగా సర్జరీ చేయాలని వైద్యులు చెప్పారు. అయితే ఈ సర్జరీకి రూ.3 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. సర్జరీ, ఐసీయూ, హాస్పిటల్ ఖర్చులు సర్జరీ తర్వాత అయ్యే ఇన్వెస్టిగేషన్స్ మందులు అన్నీ కలిపి రూ.3లక్షలు అవుతాయని చెప్పారు. అయితే అంత డబ్బు తమ వద్ద లేదని చెబుతున్నారు దేవాన్ష్ తల్లిదండ్రులు. తను సాధారణ ఆటో డ్రైవర్‌ అని చెప్పిన దేవాన్ష్ తండ్రి నాగరాజ్.. ఎవరైనా సహాయం చేసి తన బిడ్డను కాపాడాలని వేడుకుంటున్నాడు. తల్లి రాజేశ్వరి సాధారణ గృహిణి. కొంత కాలంగా సర్జరీ కోసం డబ్బులు దాచుకున్నారు. అయితే కరోనా లాక్‌డౌన్‌తో పరిస్థితులు తలకిందులయ్యాయి. వారి సంపాదనపై కరోనా పెద్ద దెబ్బ వేసింది. ఇక ఈ చిన్నారి దేవాన్ష్‌ను మీ విరాళాలే కాపాడుతాయి. విరాళాలు పంపేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X