వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిన్నారి ప్రాణాలు కాపాడుదాం... విరాళాలతో ఆ కుటుంబానికి సంతోషానిద్దాం..!

Google Oneindia TeluguNews

ఇదిగో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి పేరు ప్రభాకరన్ . ఏడాది క్రితం పుదుచ్చేరిలోని మహాత్మాగాంధీ హాస్పిటల్‌లో జన్మించాడు. పుట్టుకతోనే బొటినవేలు లేకుండా జన్మించాడు. అంతేకాదు ఈ చిన్నారికి ఇతర జబ్బులు కూడా ఉన్నాయని డాక్టర్లు భావించారు. వైద్యులు ఊహించినట్లుగానే చిన్నారి ప్రభాకరన్‌కు పుట్టుకతోనే గుండె సంబంధిత జబ్బు చేసింది. కడలూరు జిల్లాలోని మంళంపెట్టాయ్ తాలూకాలో ప్రభాకరన్ తల్లిదండ్రులు కుమార్ మరియు సమతిలు నివసిస్తున్నారు. కుమార్ హమాలీ పని చేస్తుండగా సుమతి ఇంటిపని చూసుకుంటుంది. ప్రభాకరన్కు ఒక అన్న కూడా ఉన్నాడు.

Help One year old Prabhakaran recover from heart problem

పుట్టినప్పటి నుంచే చిన్నారి ప్రభాకరన్‌ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. తరుచూ దగ్గు జలుబు, శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతున్న ప్రభాకరన్ ఆరోగ్యం మెరుగుపడాలంటే సర్జరీ తప్పనిసరిగా చేయాలని వైద్యులు చెప్పారు. ఆ ఖరీదైన సర్జరీ చేసేందుకు తమ ఆర్థిక స్తోమత చాలదని ఆవేదన వ్యక్తం చేశాడు ప్రభాకరన్ తండ్రి కుమార్. అంతేకాదు తన కొడుకు సర్జరీ కోసం విరాళాలు ఇచ్చేవారు కూడా కనిపించడం లేదు. ఈ క్రమంలోనే కుమార్ స్నేహితుడు చెన్నైలోని మియాట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లాల్సిందిగా సూచించాడు.

Help One year old Prabhakaran recover from heart problem

ప్రభాకరన్‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్లగా అక్కడ పలు పరీక్షలు చేసిన వైద్యులు తపరే టీఏసీవీసీ, రిస్ట్రిక్టివ్ ఏఎస్‌డీ, మల్టిపుల్ మస్క్యులర్ వీఎస్‌డీ, ఎస్/పీ పీే బాండ్ ఉందని చెప్పారు. టీఏపీవీసీ రిపేర్, ఏఎస్‌డీని మూసివేయడం మల్టిపుల్ మస్క్యులర్ వీఎస్‌డీలను కూడా సర్జరీ ద్వారా మూసివేయడం, పీఏ బ్యాండింగ్ శస్త్రచికిత్స ద్వారా తిరిగి నిర్మించడం వంటివి చేయాల్సి ఉందని వైద్యులు చెప్పారు. ఇందుకు రూ.3,60,00 అవుతుందని అంచనా వేశారు. ఇప్పుడు చిన్నారి ప్రభాకరన్ ప్రాణాలు నిలవాలంటే దాతలు సహాయం చేయాల్సి ఉంది. మీకు తోచినంతలో సహాయం చేసి ఈ చిన్నారి ప్రభాకరన్ ప్రాణాలను నిలుపుదాం.

Help One year old Prabhakaran recover from heart problem

ప్రభాకరన్‌కు సహాయం చేయాలనుకుంటున్నవారు ఈ కింది బ్యాంక్ ఖాతాలోకి డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. లేదా పక్కనే ఉన్న QR కోడ్ ఉపయోగించి ఫోన్ పే, గూగుల్‌పే, వాట్సాప్ పే, అమెజాన్, భీమ్ ద్వారా విరాళం ఇవ్వొచ్చు.

మీరు విరాళం ఇచ్చే డబ్బులకు అవసరమైన రశీదు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X