• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఈ చిన్నారిని ఆదుకుందాం.. సహాయం కోసం ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు, ఇంతకీ ఏం జరిగింది..?

క్యాన్సర్‌ బారిన మూడోసారి పడిన తమ ఏడేళ్ల కుమారుడికి నివారణ మార్గం కనిపించకపోవడంతో ఆ తల్లిదండ్రులు ఇద్దరూ విరాళాలు సేకరించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం కెట్టోను ఆశ్రయించారు. 2015లో తన కుమారుడు సౌమ్యజిత్‌ క్యాన్సర్ బారిన పడటంతో తల్లి మోనాలిసా జీవితం ఒక్కసారిగా మలుపుతిరిగింది. సౌమ్యజిత్ తరచూ వాంతులు చేసుకునేవాడు. అయితే అది పెద్ద విషయం కాదని భావించారు మోనాలిసా మరియు ఆమె భర్త షిబ్‌నాథ్ .

ఇక ఆ తర్వాత రక్తాన్ని వాంతి చేయడం ప్రారంభించాడు సౌమ్యజిత్. దీంతో పాటు విపరీతమైన జ్వరం వచ్చేది. అయితే తన కొడుకుకు వచ్చిన జబ్బు ఏంటో తెలియక మోనాలిసా సతమతమైంది. వెంటనే స్థానిక హాస్పిటల్‌కు కొడుకును తీసుకెళ్లింది. అన్ని పరీక్షలు చేసిన వైద్యులు కొన్ని రోజుల్లోనే సౌమ్యజిత్‌కు నయం అవుతుందని తిరిగి మామూలు పరిస్థితికి చేరుకుంటాడని చెప్పారు. వైద్యులు చెప్పినట్లుగా జరగలేదు. సౌమ్యజిత్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. కొడుకు పొందుతున్న బాధను చూసి ఈ తల్లిదండ్రులు ప్రతిరోజు ఆవేదన చెందేవారు.

ఇక మరో ఆలోచన చేయకుండా కొడుకు సౌమ్యజిత్‌ను మరో హాస్పిటల్‌లో చేర్చారు. ఇక పరీక్షలు నిర్వహించిన తర్వాత ఒక అరుదైన బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న తెలియడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఇది విన్న వారి గుండె వెయ్యి ముక్కలైంది. తమ కొడుకు ఈ వింత జబ్బు బారిన పడ్డారన్న విషయాన్ని నమ్మలేకపోయారు. మొత్తానికి భగవంతుడి దయతో చికిత్స ఉందని తెలిసింది. కీమో సెషన్లు పలుమార్లు నిర్వహించారు. ఆ తర్వాత వరుసగా నాలుగేళ్ల పాటు రక్తమార్పిడి చేయడం, ప్లాస్మా మార్పిడి చేయడం చేశారు. దీంతో బ్లడ్ క్యాన్సర్ నుంచి సౌమ్యజిత్ కోలుకున్నాడు. కోలుకున్నాడుకునేలోపే విధి చిన్న చూపు చూడటంతో సౌమ్యజిత్ మళ్లీ 2019లో క్యాన్సర్ బారిన పడ్డాడు.

ఇక తన కొడుకు చికిత్స కోసం ఇరుగు పొరుగువారిని అడిగి కొంత మొత్తం డబ్బులు సేకరించారు షిబ్‌నాథ్ మోనాలిసా. అంతేకాదు చికిత్స కోసం వారుంటున్న బెంగాల్ రాష్ట్రం నుంచి చెన్నైకు మకాం మార్చారు. తెలియని నగరంలో ఒక ఏడాది ఉన్నారు. వారి అవసరాలు గడిచేందుకు కూడా చాలా కష్టంగా మారింది. అయితే క్యాన్సర్ వ్యాధి నుంచి సౌమ్యజిత్ కోలుకోవడంతో వారికి కాస్త ఊరట లభించింది. ఈ ఆనందం కూడా ఎంతో కాలం నిలవలేదు. మళ్లీ మూడో సారి సౌమ్యజిత్ క్యాన్సర్ బారిన పడ్డాడు. అయితే ఈ సారి మాత్రం బోన్ మారోను సరైన సమయంలో మార్చితేనే ప్రాణాలు దక్కుతాయని చెప్పారు. అయితే ఇందుకు రూ.25 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పడంతో ఒక్కసారిగా కుదేలయ్యారు.

వెస్ట్‌బెంగాల్‌లో ఒక సామాన్య కూలీగా పనిచేసే షిబ్‌నాథ్ నెల ఆదాయం రూ.3వేలు. ఇక తెలియని నగరమైన చెన్నైలో తనకు ఉద్యోగం కూడా లేదు. డబ్బులు లేవు. అమ్మా మన ఊరికి ఎప్పుడు వెళదాం అని కొడుకు సౌమ్యజిత్ అడిగినప్పుడల్లా బిడ్డను కౌగలించుకుని త్వరలోనే వెళతాం అని సర్ది చెప్పేది మోనాలిసా. ఇప్పుడు సౌమ్యజిత్‌ను మీరు మాత్రమే కాపాడగలరు. మీరు ఇచ్చే విరాళాలు రూ.25 లక్షలు ఈ ఏడేళ్ల బిడ్డ ప్రాణాలు నిలబెడతాయి. మీరు విరాళంగా ఇచ్చే డబ్బులే ఈ తల్లిదండ్రులకు వారి బిడ్డను తిరిగి ప్రాణాలతో అప్పగిస్తుంది.

Help us save our 7-year-old son – Cancer patient’s family appeals to the kindness of strangers

ప్రస్తుతం విరాళాలు సేకరిస్తోంది కెట్టో అనే ఈ ఫండ్ రైసర్ సంస్థ. మోనాలిసా దంపతులు విరాళాలు ఇచ్చే దాతలపైనే నమ్మకం ఉంచారు. ఇక నిధుల సమీకరణకు మీరు సహాయం చేసి ఆ కుటుంబంలోని ఆ చిన్నారిని కాపాడండి. సహాయం ఎలా చేయాలి..?

విరాళం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సౌమ్యజిత్ కథనాన్ని మీరు సోషల్ మీడియాలో షేర్ చేయండి. తద్వారా విరాళాలు త్వరగా సేకరించేందుకు వీలవుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X