వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

IPL 2020 Final:రోహిత్ శర్మ, ధవన్‌ల ముందు ఉన్న రికార్డులు ఇవే..!

|
Google Oneindia TeluguNews

దుబాయ్: కరోనా మహమ్మారి కష్ట కాలంలో ఎన్నో ఒడిదుడుకులను దాటుకొని ప్రారంభమైన ఐపీఎల్‌ 13వ సీజన్‌ ఈ రోజుతో ముగియనుంది. రాత్రి 7:30 గంటలకు ముంబై ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య టైటిల్ పోరు జరుగనుంది. ఇప్పటికే నాలుగు టైటిళ్లు గెలిలిచిన ముంబై మరో కప్పు మీద కన్నేయగా.. మొదటిసారి ఫైనల్‌ చేరిన ఉత్సాహంలో తొలి టైటిల్‌ దక్కించుకోవాలని ఢిల్లీ చూస్తోంది. మరి ఈ బిగ్‌ఫైట్‌లో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. అయితే ఈ మ్యాచ్‌లో ట్రోఫీతో పాటు కొన్ని రికార్డులు ఆటగాళ్లను ఊరిస్తున్నాయి.

2008లో ఐపీఎల్ ప్రారంభం కాగా.. ప్రతి లీప్ సంవత్సరంలో ఓ కొత్త జట్టు ఛాంపియన్ అవుతోంది. 2008లో రాజస్థాన్ రాయల్స్.. 2012లో కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. ఇక 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కప్ కొట్టింది. ఈ ట్రెండ్ ప్రకారం 2020లోనూ కొత్త ఛాంపియన్ వస్తుందని అంచనా వేస్తున్నారు. అంటే.. ఢిల్లీ క్యాపిటల్స్‌ కప్ దక్కించుకుంటుంది.

Here are the IPL records that are waiting in front of Rohit and Dhawan

ముంబై ఇండియన్స్ అత్యధికసార్లు ఐపీఎల్ టైటిల్ నెగ్గిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ ఆ జట్టు నాలుగుసార్లు టైటిల్ నెగ్గితే.. సరి సంఖ్య వచ్చే ఏడాదిలో కప్ గెలవలేదు. ముంబై 2013, 2015, 2017, 2019 సంవత్సరాల్లో విజేతగా నిలిచింది. ఇవన్నీ బేసి సంఖ్యలే ఇక్కడ విశేషం. ఇది ఢిల్లీకి కలిసిరానుంది. ఇక ఆటగాళ్ల రికార్డులు చూస్తే...

# ఈ మ్యాచ్‌తో ముంబై కెప్టెన్ రోహిత్ ‌శర్మ టీ20 లీగ్‌లో 200 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంటాడు.
# ముంబై తరఫున 4,000 పరుగుల మైలురాయికి హిట్‌మ్యాన్ రోహిత్‌ మరో 8 పరుగుల దూరంలో ఉన్నాడు.
# మరో రెండు సిక్సర్లు బాదితే ముంబై ఆల్‌రౌండర్‌ కీరన్‌ పొలార్డ్‌ టీ20 లీగ్‌లో 200 సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కుతాడు.
# ఢిల్లీ ఓపెనర్ శిఖర్ ధావన్‌ టీ20 లీగ్‌లో 1,500 పరుగులకు మరో 36 పరుగుల దూరంలో ఉన్నాడు. ఢిల్లీ తరఫున గబ్బర్‌ ఇప్పటి వరకూ 1,464 పరుగులు చేశాడు.
# ఈ మ్యాచ్‌తో ధావన్‌కు టోర్నీలో టాప్ ‌స్కోరర్‌ అయ్యే అవకాశం ఉంది. మరో 68 పరుగులు చేస్తే.. పంజాబ్‌ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ (670)ను అధిగమిస్తాడు.
# ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ మరో 46 పరుగులు చేస్తే.. ఈ సీజన్‌లో 500 పరుగుల మార్క్ చేరుకుంటాడు.

English summary
IPL 2020 Final, MI vs DC: Rohit Sharma, Shikhar Dhawan and Shreyas Iyer on verge of some IPL records.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X