హిందూపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కోవిడ్ ఆస్పత్రికి భారీ విరాళం ఇచ్చిన బాలకృష్ణ .. హిందూపురం ప్రజల ఆరోగ్య రక్షణ కోసం బాలయ్య ఔదార్యం

|
Google Oneindia TeluguNews

హిందూపురం ఎమ్మెల్యే,సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కరోనా కష్టకాలంలో ప్రజల కోసం నేను సైతం అంటూ తన గొప్ప మనస్సును చాటుకుంటున్నారు. హిందూపురం ఎమ్మెల్యేగా ప్రజలకు చేరువగా ఉండేందుకు ప్రయత్నిస్తున్న బాలకృష్ణ తన నియోజకవర్గంలోని గవర్నమెంట్ కోవిడ్ ఆసుపత్రిలో ఏర్పాటైన కొవిడ్ కేర్ సెంటర్ కు 55 లక్షల రూపాయల భారీ విరాళం ఇచ్చి తన గొప్ప మనసును చాటుకున్నాడు . గతంలో హిందూపురం ప్రభుత్వాసుపత్రికి వెంటిలేటర్లను డొనేట్ చేశారు బాలకృష్ణ . ఇప్పుడు కోవిడ్ ఆస్పత్రికి ఏకంగా భారీ విరాళమే ఇచ్చారు .

బాలకృష్ణ భారీ డైలాగ్ .. రాజ్యసభ ఎన్నికల పోలింగ్ లో.. మేం అరిచే వాళ్ళం కాదు కరిచే వాళ్ళంబాలకృష్ణ భారీ డైలాగ్ .. రాజ్యసభ ఎన్నికల పోలింగ్ లో.. మేం అరిచే వాళ్ళం కాదు కరిచే వాళ్ళం

 కరోనా కష్ట కాలంలో హిందూపురం ప్రజల కోసం బాలయ్య గొప్ప మనసు

కరోనా కష్ట కాలంలో హిందూపురం ప్రజల కోసం బాలయ్య గొప్ప మనసు

ఏపీలో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అత్యంత ఎక్కువగా కరోనా ప్రభావం ఉన్న జిల్లాలలో అనంతపురం జిల్లా ఒకటి .అనంతపురం జిల్లాలోని హిందూపురంలోనూ కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నా, కరోనా వ్యాప్తి మాత్రం తగ్గడం లేదు. దీంతో ప్రతిపక్ష పార్టీలు కరోనా నియంత్రణలో అధికార పార్టీ విఫలమైందని ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఇదే సమయంలో టిడిపి ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తోడు నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం తన వంతు సహాయం చేశారు.

 కరోనా వారియర్స్ కు కావాల్సిన మౌలిక వసతుల కల్పనకు బాలయ్య భారీ విరాళం

కరోనా వారియర్స్ కు కావాల్సిన మౌలిక వసతుల కల్పనకు బాలయ్య భారీ విరాళం

హిందూపురం నియోజకవర్గ ప్రజలకు తానున్నానని భరోసా ఇచ్చారు బాలయ్య. కరోనా వైరస్ నివారణ కు కావలసిన మందులను, పిపిఈ కిట్లను, మాస్కులు , ఇతర పరికరాలను అందించడానికి ఆయన భారీ విరాళం ఇచ్చారు. తన నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులను పర్యవేక్షిస్తూ, ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ఎప్పటికప్పుడు వైద్యులకు తగిన సూచనలు చేస్తున్నారు బాలకృష్ణ.

కోవిడ్ పేషెంట్ల విషయంలో వారికి కావలసిన సదుపాయాలను కల్పించడానికి బాలయ్య తన వంతు సహాయం చేస్తూనే ఉన్నారు. తాజాగా కరోనా క్లిష్టసమయంలో బాలయ్య నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటున్నానని తాను చేసిన సహాయం ద్వారా, ఇచ్చిన భారీ విరాళం ద్వారా స్పష్టం చేశారు.

ఇప్పటికే పలుమార్లు కరోనా నియంత్రణ కోసం.. సొంత డబ్బు కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన బాలకృష్ణ

ఇప్పటికే పలుమార్లు కరోనా నియంత్రణ కోసం.. సొంత డబ్బు కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన బాలకృష్ణ

గతంలో బాలకృష్ణ తెలుగు రాష్ట్రాలకు ,అలాగే సినీ పరిశ్రమ కార్మిక వర్గాల కోసం రూ.1.25 కోట్ల విరాళం అందించారు.ఇందులో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధులకు కోటి రూపాయలు, సినీ కార్మికుల కోసం రూ. 25 లక్షలు ఇచ్చిన విషయం తెలిసిందే . ఇప్పుడు మరోమారు 55 లక్షల రూపాయల భారీ విరాళం అందించి కరోనా సమయంలో ఎమ్మెల్యేగానే కాదు , మంచి మనసున్న వ్యక్తిగా ప్రజలకు అండగా నిలిచారు. ఇప్పుడు తన నియోజక వర్గ ప్రజల కోసం తన సొంత డబ్బులను ఖర్చు చేస్తున్నారు .

ప్రజాప్రతినిధిగానే కాకుండా మంచి మనసున్న వ్యక్తిగా బాలకృష్ణ ఔదార్యం

ప్రజాప్రతినిధిగానే కాకుండా మంచి మనసున్న వ్యక్తిగా బాలకృష్ణ ఔదార్యం


ఏపీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు సైతం బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం తమ వంతు బాధ్యతను నిర్వర్తించాల్సిన సమయమిది. ఇక ఇలాంటి సమయంలో ఒక ప్రజా ప్రతినిధిగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యక్తిగత బాధ్యత తీసుకుని సొంత నిధులు సైతం ప్రజల కోసం ఖర్చు చేస్తూ ఉండటం అందరూ ప్రశంసించ వలసిన విషయం . బాలకృష్ణ తరహాలో ఏపీలోని అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కరోనా బాధితులకు సహాయం అందించటానికి ముందుకు వస్తే కరోనా కట్టడికి తమ వంతు సాయం చేసినవారు అవుతారు అని చెప్పడం నిర్వివాదాంశం.

English summary
Hindupuram MLA, movie star Nandamuri Balakrishna is expressing his great mind that I am also for the people in Corona difficult times. Balakrishna, who is trying to reach out to the people as the Hindupuram MLA, expressed his great heart by donating a whopping Rs 55 lakh to the Covid Care Center at the Government Covid Hospital in his constituency. Balakrishna had earlier donated ventilators to Hindupuram govt hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X