హిందూపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దాడులపై మండిపడుతున్న బాలయ్య .. మా వాళ్ళపై దాడులు మంచిది కాదని వార్నింగ్

|
Google Oneindia TeluguNews

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఏపీ సర్కార్ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో దాడులతో వైసీపీ భయభ్రాంతులకు గురి చేస్తుందని ఆయన అన్నారు . టీడీపీ కార్యకర్తలపై దాడులు మంచిది కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు .అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వీరాపురం గ్రామంలో హత్యకు గురైన టీడీపీ కార్యకర్త భాస్కర్ రెడ్డి కుటుంబసభ్యులను బాలకృష్ణ పరామర్శించారు. భాస్కర్ రెడ్డి కుటుంబసభ్యులను బాలయ్య ఓదార్చారు.

లోకేష్... ప్రెస్ మీట్ పెట్టి ఆ మూడు పదాలు సరిగ్గా పలుకు ముందు అంటున్న వైసీపీ ఎమ్మెల్యేలోకేష్... ప్రెస్ మీట్ పెట్టి ఆ మూడు పదాలు సరిగ్గా పలుకు ముందు అంటున్న వైసీపీ ఎమ్మెల్యే

 కచ్చితంగా వారికి ప్రజలే బుద్ధి చెప్తారంటున్న బాలకృష్ణ ...హత్యకు గురైన భాస్కర్ రెడ్డి కుటుంబానికి పరామర్శ

కచ్చితంగా వారికి ప్రజలే బుద్ధి చెప్తారంటున్న బాలకృష్ణ ...హత్యకు గురైన భాస్కర్ రెడ్డి కుటుంబానికి పరామర్శ

ప్రజాస్వామ్యంలో దాడులు కరెక్ట్ కాదని బాలయ్య అన్నారు. ఇక టీడీపీ కోసం ఎంతగానో పని చేసిన భాస్కర్ రెడ్డి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు బాలకృష్ణ . సీఎం జగన్.. కక్ష సాధింపులు మాని రాష్ట్రాభివృద్ధిపై దృష్టి పెట్టాలని బాలకృష్ణ సూచించారు. ఇక టీడీపీ కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదని బాలయ్య అన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని బాలకృష్ణ పేర్కొన్నారు . తప్పు చేసిన వారికి ప్రజలే బుద్ధి చెబుతారని బాలకృష్ణ హెచ్చరించారు.

Recommended Video

నోరు జారిన టీడీపీ నేతలు
సీఎం జగన్ తన పార్టీ కార్యకర్తలను కంట్రోల్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్న టీడీపీ

సీఎం జగన్ తన పార్టీ కార్యకర్తలను కంట్రోల్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్న టీడీపీ


ఒక పక్క రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పార్టీ కార్యక్తలపై వైసీపీ అధికారంలోకి వచ్చాక దాడులు పెరిగాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ నేతలు కక్ష సాధింపు చర్యలు దిగుతున్నారని మండిపడ్డారు. ఇప్పటివరకు ఆరుగురు టీడీపీ కార్యకర్తలను హత్య చేశారని ఆరోపించారు. సీఎం జగన్ తన పార్టీ కార్యకర్తలను కంట్రోల్ చెయ్యాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో దాడుల్లో గాయపడిన , మరణించిన వారి కుటుంబాలను కలసి భరోసా ఇవ్వటానికి చంద్రబాబు సైతం యాత్ర చేస్తున్నారు.

టీడీపీ కార్యకర్తలకు అండగా ఉండేందుకు భరోసా యాత్ర చేపట్టిన చంద్రబాబు .. దాడులపై స్పందించని సీఎం జగన్

టీడీపీ కార్యకర్తలకు అండగా ఉండేందుకు భరోసా యాత్ర చేపట్టిన చంద్రబాబు .. దాడులపై స్పందించని సీఎం జగన్

రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని అసహనం వ్యక్తం చేసిన చంద్రబాబు వైసీపీ అధికారంలోకి వచ్చాక జరిగిన రాజకీయ దాడుల్లో మృతి చెందిన కుటుంబాలను చంద్రబాబు పరామర్శిస్తున్నారు. చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు పార్టీ తరఫున రూ.5లక్షలు ఆర్థికసాయం అందజేస్తున్నారు. టీడీపీ ఆరోపణలను వైసీపీ నేతలు ఖండిస్తున్నారు . తాము ఎవరిపైనా దాడులు చెయ్యడం లేదన్నారు. టీడీపీ వాళ్లే తమను రెచ్చగొడుతున్నారని, దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మొత్తానికి టీడీపీ నేతలు ఎందరు దాడుల గురించి మాట్లాడినా వైసీపీ సర్కార్ మాత్రం దీనిపై నోరు మెదపటం లేదు. సీఎం జగన్ దాడుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం గమనార్హం .

English summary
Hindupuram MLA Balakrishna has made serious remarks about AP Sarkar's behavior. He said the YCP was terrorized by attacks in the state. He was angry that the attacks on TDP activists were not good .Balakrishna console the family members of TDP activist Bhaskar Reddy, who was killed in Veerapuram village of Tadipatri Mandalam in Anantapur district. Balayya said the attacks on democracy were not correct. Balakrishna assured the family of Bhaskar Reddy who worked so much for the TDP, all the way.Balakrishna suggests CM Jagan .. that the party should focus on the achievements of the state not on attacks .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X