హిందూపురం: బాలయ్యకు షాక్ -జగన్ కుటుంబ చరిత్రే అంత -ప్రత్యేక రాష్ట్రం తేస్తానని హామీ
టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చాలా రోజుల గ్యాప్ తర్వాత తన సొంత అసెంబ్లీ నియోజకవర్గం హిందూపురంలో పర్యటించారు. మూడు రోజులపాటు వరుస కార్యక్రమాల్లో పాల్గొనేందుకుగానూ బుధవారం అనంతపురం జిల్లాలోకి అడుగుపెట్టిన ఆయనకు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. తొలిరోజు పర్యటనలోనే బాలయ్యకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రత్యేక హోదాపై తడబాటు వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే..
తండ్రి అక్రమ సంబంధంతో కూతుళ్ల విరక్తి -భర్తను రూ.1.5కోట్లకు అమ్మేసిన భార్య -ప్రేయసికి షాక్

కర్ణాటక సరిహద్దు ద్వారా..
మూడు రోజుల పర్యటనలో భాగంగా హిందూపురం చేరుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణకు కర్ణాటక సరిహద్దు తూముకుంట వద్ద టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి భారీ జనసందోహంతో కదులుతూ హిందూపురం మండలం జి. గుడ్డంపల్లి వద్ద కంది పంటను బాలయ్య పరిశీలించారు. పంట నష్టపోయిన రైతుల్ని పరామర్శించిన ఆయన.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని విత్తనాలు ఇచ్చామని, రైతులకు అన్ని రకాలుగా అండగా నిలిచామని గుర్తుచేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ను ఉద్దేశించి బాలయ్య సంచలన విమర్శలు చేశారు.
అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్ -ఒక్కొక్కరి నెత్తిన రూ.70వేల భారం -కాగ్ సంచలన రిపోర్టు -జగన్ సర్కార్ మౌనం

ఏపీలో ఢిల్లీ తరహా రైతు ఉద్యమం
‘‘వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఎలాంటి రాయితీలు ఇవ్వలేదు. విపత్తులు వచ్చి వేల కోట్ల రూపాయల పంట నష్టపోతే జగన్ ప్రభుత్వం రైతులను ఆదుకునే ప్రయత్నం చేయలేదు. రాష్ట్రంలో రైతులను చిన్నచూపు చూస్తున్నారు. బూటకపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక రైతుల వెన్ను విరుస్తున్నారు. కానీ ఒక్క విషయం అందరూ గుర్తుంచుకోవాలి. రైతులు తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారు. ఆ రైతుల తరపున జగన్ కు నేను హెచ్చరిస్తున్నా.. రైతులు రోడ్డు మీదికి వచ్చి సమాజాన్ని స్తంభింపచేసే రోజులు రాష్ట్రంలో త్వరలోనే రానున్నాయి. వ్యవసాయాన్ని వ్యాపారం చేస్తున్నారు కాబట్టే ఢిల్లీలో రైతులు ఉద్యమం చేస్తున్నారు. ఏపీలో వైసీపీ సర్కారు రైతుల పక్షపాతి అంటూ కబుర్లు చెబుతూ కాలం వెళ్లదీస్తోంది. అసలు..

జగన్ కుటుంబ చరిత్రే అంత..
ఒక్క ఛాన్స్.. ఒక్క ఛాన్స్ అని జగన్ ప్రాధేయపడితే జనం ఓట్లేశారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాక్షసంగా మారింది. ప్రస్తుతం ఏపీలో రాక్షస పాలన కొనసాగుతోంది. వీళ్లకు ఎందుకు ఓటేశామా అని జనం బాధపడుతున్నారు. మరి అలాంటప్పుడు ఎందుకు ఓటేయాలని అని ప్రజలు ఆనాడే ప్రశ్నించుకోవాల్సింది. అసలు జగన్ కు ఛాన్స్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? వాళ్ల కుటుంబ చరిత్ర మనకు తెలియనిదా? గతంలో వాళ్లు ఏమేం చేశారో తెలీదా?'' అని బాలకృష్ణ అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి రైతుల్ని ఆదుకోవాలని, తక్షణమే పంట నష్టపరిహారం చెల్లించి, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి, ఎరువులు విత్తనాలను ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేయాలని, పంట నష్టపోయిన మండలాల జాబితా లో చిలమత్తూరు ను చేర్చాలని బాలయ్య డిమాండ్ చేశారు.

బాలయ్యకు చిన్నారుల షాక్..
నాలుగు నెలల తర్వాత సొంత నియోజకవర్గం హిందూపురంలో పర్యటిస్తోన్న టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు స్థానిక చిన్నారులు అనూహ్య షాకిచ్చారు. కారు బానెట్ పై కూర్చొని బాలకృష్ణ రోడ్ షో నిర్వహిస్తుండగా.. ఆయన ఎదుటే చిన్నపిల్లలంతా ‘జై జగన్.. జైజై జగన్..'' అంటూ నినాదాలు చేశారు. ఈ దృశ్యాన్ని చూసి టీడీపీ నేతలు.. చిన్నారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు మంచి మాటలు నేర్పించండంటూ అక్కడున్న మహిళకు హితవు పలికారు. హిందూపురం నియోజకవర్గంలోని తూముకుంటలో ఈ ఘటన జరిగింది. అంతేకాదు..

ప్రత్యేక రాష్ట్రం తీసుకొస్తానన్న బాలయ్య
ఏపీ రాజకీయాల్లో క్రమంగా మరుగున పడిపోతున్న ప్రత్యేక హోదా అంశాన్ని టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మళ్లీ గుర్తుచేశారు. బుధవారం నాటి హిందూపురం పర్యటనలో ప్రత్యేక హోదాపై స్పందిస్తూ బాలయ్య తడబడ్డారు. ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక రాష్ట్రం అనేశారు. ప్రత్యేక రాష్ట్రం తీసుకొస్తామన్నారు. ఇంతమంది ఎంపీలు ఉన్నారు ఏం సాధించారని ప్రశ్నించారు. బాలయ్య మీడియాతో మాట్లాడుతుండగా నినాదాలు చేయడంతో అటు తెలుగు తమ్ముళ్లపైనా ఫైరయ్యారు. ఏయ్.. ఉష్.. చుప్.. నోర్మూయ్ అంటూ హెచ్చరించారు. గురు, శుక్రవారాల్లోనూ బాలయ్య హిందూపురంలో పర్యటించనున్నారు.