• search
 • Live TV
హిందూపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కొడాలి నానికి బాలకృష్ణ వార్నింగ్.. నోరు అదుపులో పెట్టుకో -మాట వినకుంటే ఇక చేతలే..

|

పేకాట క్లబ్బుల వివాదంలో ఏపీ మంత్రి కొడాలి నాని చేసిన కామెంట్లను ప్రస్తావిస్తూ.. వైసీపీ అక్రమాలను ప్రశ్నించిన కారణంగా టీడీపీ శ్రేణుల్ని ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేయడాన్ని తప్పుపట్టారు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. బుధవారం హిందూపురంలో పర్యటించిన ఆయన మీడియాతో, టీడీపీ శ్రేణులతో మాట్లాడిన సందర్భాల్లో మంత్రి కొడాలి నానికి సీరియస్ వార్నింగ్స్ ఇచ్చారు. సీఎం జగన్ పైనా ఫైరయ్యారు.

  AP CM Jagan On latest incidents in andhra pradesh temples
  హిందూపురంలో బాలయ్య సందడి

  హిందూపురంలో బాలయ్య సందడి

  టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ నాలుగు నెలల గ్యాప్ తర్వాత సొంత నియోజకవర్గం హిందూపురంలో పర్యటించారు. కర్ణాటక సరిహద్దులోని తూముకుంట మీదుగా అనంతపురం జిల్లాలోకి అడుగుపెట్టిన బాలయ్యకు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ‘జై బాలయ్య..' నినాదాలు చేస్తూ వందలాది మంది కార్యకర్తలు వెంటరాగా, కారు బ్యానెట్ పై కూర్చొని బాలకృష్ణ రోడ్ షో చేశారు. హిందూపురం మండలం జి. గుడ్డంపల్లి వద్ద కంది పంటను పరిశీలించిన ఆయన.. రైతుల పట్ల జగన్ సర్కారు అనుసరిస్తోన్న తీరును తప్పుపట్టారు.

  హిందూపురం: బాలయ్యకు షాక్ -జగన్ కుటుంబ చరిత్రే అంత -ప్రత్యేక రాష్ట్రం తేస్తానని హామీహిందూపురం: బాలయ్యకు షాక్ -జగన్ కుటుంబ చరిత్రే అంత -ప్రత్యేక రాష్ట్రం తేస్తానని హామీ

  యంత్రాంగంలో ప్రతిపక్షం కూడా భాగమే

  యంత్రాంగంలో ప్రతిపక్షం కూడా భాగమే

  వైసీపీ ప్రభుత్వం రైతులకు ఏమీ చేయడం లేదని మండిపడ్డ బాలయ్య.. ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరి అధికారంలోకి వచ్చాక అరాచకాలు చేస్తున్నారని, 8 లక్షల రేషన్ కార్డులు తొలగించారని, ఉచిత ఇసుక తొలగించారని, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దగా ఉంటుందన్నారు. అధికారంలో ఎవరున్నప్పటికీ, యంత్రాంగాన్ని నడపడంలో ప్రతిపక్షాలు కూడా ఒక భాగమని, విపక్ష పార్టీలు ఇచ్చే సూచనలను ప్రభుత్వం పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుందని, జగన్ మాత్రం ఇష్టారీతిగా, ఏకపక్షంగా, రాక్షసత్వంతో వ్యవహరిస్తున్నారని బాలకృష్ణ ఫైరయ్యారు.

  తండ్రి అక్రమ సంబంధంతో కూతుళ్ల విరక్తి -భర్తను రూ.1.5కోట్లకు అమ్మేసిన భార్య -ప్రేయసికి షాక్తండ్రి అక్రమ సంబంధంతో కూతుళ్ల విరక్తి -భర్తను రూ.1.5కోట్లకు అమ్మేసిన భార్య -ప్రేయసికి షాక్

  రెచ్చగొడతే దబిడి దిబిడే..

  రెచ్చగొడతే దబిడి దిబిడే..

  జగన్ సర్కారు అనుసరిస్తోన్న ప్రజావ్యతిరేక విధానాలను ఎత్తి చూపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోన్న కారణంగా టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేయడాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ ఖండించారు. ‘‘ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ఉంది. ఎవరు ఏదైనా మాట్లాడొచ్చు. చెప్పుకోవచ్చు. అలా కాదని అక్రమంగా కేసులు పెట్టి రెచ్చగొడితే చూస్తూ ఊరుకోం.. మేమేమీ గాజులు తొడక్కుని కూర్చోలేదిక్కడ.. ఎవరికీ భయపడేది లేదు..'' అని బాలయ్య ఫైరయ్యారు. ఇక పేకాట క్లబ్బుల వివాదాన్ని ప్రస్తావిస్తూ..

  కొడాలి నానికి బాలయ్య వార్నింగ్..

  కొడాలి నానికి బాలయ్య వార్నింగ్..

  వ్యవస్థలో చట్టాలున్నాయని, న్యాయమంటూ ఒకటుందన్న లెక్క లేకుండా కొందరు అనుచితంగా మాట్లాడుతున్నారని బాలయ్య మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకోవడం మంచిది కాదన్నారు. ‘‘మొన్న ఒకాయన తమ్ముడు పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుపడితే.. ఆ ఘటనను చిన్నదిగా చూపుతూ, ఆ.. పేకాటలో దొరికితే ఏమవుతుంది? మహా అయితే జైలుకు వెళతారు లేదంటే పదివేల జరిమానా కడతాడు అని ఆ వ్యక్తి అనడం ఎంత దారుణం?'' అంటూ పరోక్షంగా మంత్రి కొడాలి నానిని బాలయ్య టార్గెట్ చేశారు. టీడీపీ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. ‘‘నా సహనాన్ని పరీక్షించొద్దు. ఊరికే నోరు పారేసుకోవడానికి నేను వట్టి మాటల మనిషినే కాదు.. అవసరమైతే చేతలు కూడా చూపిస్తా. తస్మాత్ జాగ్రత్త..'' అని బాలయ్య అన్నారు.

  ఆలయాలపై దాడులు.. అన్ని మతాలకూ..

  ఆలయాలపై దాడులు.. అన్ని మతాలకూ..

  ఏపీలో హిందూ ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతుండటంపై టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు. దాడుల పరంపరను ఆయన ఖండించారు. ఆలయాలపై దాడులు ఒక్క హిందువులనే కాదు.. అన్ని మతాల వాళ్లనూ ఆవేదనకు గురి చేస్తున్నాయని చెప్పారు.విగ్రాహాలను ధ్వంసం చేస్తున్న వారి చేతులు ఖండించాలన్నారు. ఇప్పటి వరకు సుమారు రాష్ట్రంలోని 127 గుళ్లపై అనేక రకాల దాడులు జరిగాయన్నారు. ఆలయాలపై దాడుల వివాదంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య తీవ్ర వాగ్వాదాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. మూడు రోజుల పర్యటన కోసం బుధవారం హిందూపురం వచ్చిన బాలయ్య.. గురువారం లేపాక్షికి వెళ్లనున్నారు. శుక్రవారం కోటిపి సమీపంలోని టిడ్కో ఇళ్ల వద్ద లబ్దిదారులతో మాట్లాడుతారు.

  English summary
  hindupuram tdp mla nandamuri balakrishna warns ysrcp minister kodali nani for making serease of crotisations on tdp and chandrababu. speaking to media at hindupur on wednesday, balakrishna also slams cm jagan.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X