• search
 • Live TV
హిందూపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

బాలయ్య ఇప్పుడైనా ఫుల్ టైమ్ పాలిటిక్స్ చేస్తారా .. సినిమాలపై శ్రద్ధ పెడతారా ?

|
  బాలయ్య పూర్తి స్థాయి రాజకీయాలు చేయాలంటున్నటీడీపీ | Balakrishna To Focus On Full Time Politics

  హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇక యాక్టింగ్ లేదు ఓన్లీ పొలిటికల్ ఫైటింగ్ అని చెప్తారని తెలుగు తమ్ముళ్లు తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత ఎన్నికల్లో ఊహించని విధంగా చావుదెబ్బ తిన్న టీడీపీకి కొత్త జవసత్వాలు బాలయ్య ద్వారా నిండుతాయని ఆశపడుతున్నారు. ఫుల్ టైమ్ రాజకీయాల్లోకి బాలకృష్ణ ఎంట్రీ ఇస్తే మళ్లీ పార్టీ క్యాడర్లో మళ్లీ ఉత్సాహం నిండుతోందని క్యాడర్ గట్టిగా నమ్ముతోంది. రాయలసీమ పూర్తి బాధ్యతలను బాలకృష్ణ చేపట్టి రాయలసీమలో పార్టీని పటిష్టం చేయాలని టిడిపి నేతలు భావిస్తున్నారు. కానీ బాలకృష్ణ పూర్తిస్థాయి రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్నారా అంటే అనుమానమే అనే భావన వ్యక్తమవుతోంది.

   ఫుల్ టైమ్ పాలిటిక్స్ లోకి బాలయ్య రావాలని కోరుతున్న తెలుగుతమ్ముళ్ళు .. సినిమాలపై బాలయ్య ఆసక్తి

  ఫుల్ టైమ్ పాలిటిక్స్ లోకి బాలయ్య రావాలని కోరుతున్న తెలుగుతమ్ముళ్ళు .. సినిమాలపై బాలయ్య ఆసక్తి

  హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ ను పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా చూడాలని, టీడీపీని బలోపేతం చేసే దిశగా ప్రస్తుతం ఉన్న తరుణంలో ఆయన పనిచేయాలని పార్టీ నేతలు, కేడర్ భావిస్తున్నా, బాలయ్య మాత్రం సినిమాల వైపు మొగ్గు చూపిస్తూ స్టార్ట్.. కెమెరా.. యాక్షన్ అంటూ సిల్వర్ స్క్రీన్ మీద తన టాలెంట్ చూపించాలనుకుంటున్నారు. ఒకపక్కన టిడిపి తనను తాను రక్షించుకునే క్రమంలో నానా అవస్థలు పడుతుంటే, బాలయ్య మాత్రం తాను గతంలో ఎలా ఉన్నారో అలానే ఉన్నారు. టిడిపి కార్యకర్తల ఆవేదనని బాలయ్య పట్టించుకోవటం లేదనే భావన ప్రస్తుతం వ్యక్తం అవుతుంది.

  ఏపీ బడ్జెట్ .. కొత్త సీసాలో పాత సారాలా వుంది అన్నటీడీపీ నేత కళా వెంకట్రావు

  టీడీపీలో నూతనోత్సాహం నిండాలంటే చంద్రబాబుకు బాలయ్య బాసట అవసరం

  టీడీపీలో నూతనోత్సాహం నిండాలంటే చంద్రబాబుకు బాలయ్య బాసట అవసరం

  చరిత్రలోనే ఎరుగని ఓటమి ఒకవైపు, ఎప్పుడు ఎవరు గోడ దూకుతారో ఆందోళన ఇంకోవైపు, ఇక అధికార వైసీపీ దూకుడు మరోవైపు ..ఇక ఈ పరిస్థితుల్లో టీడీపీలో జోష్అ నింపటానికి చంద్రబాబుకు తోడందించే సరైన లీడర్ బాలయ్య బాబేనని టిడిపి క్యాడర్ గట్టిగా భావిస్తుంది. 2014లో హిందూపురం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయినప్పటికీ బాలయ్య సినిమాలు కూడా చేస్తూనే వచ్చారు. కానీ ఇప్పుడు పార్టీ ఉన్న పరిస్థితులను బట్టి సినిమాలను వదిలిపెట్టి బాలయ్య ఫుల్ టైం పాలిటిక్స్ చేస్తే బాగుంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కానీ టాలీవుడ్ లో పరిస్థితి మాత్రం వేరేలా ఉంది.

  బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారని తెలుస్తోంది.

  సినిమాలలో బిజీ అవుతున్న బాలయ్య .. పార్టీ పరిస్థితిపై తెలుగు తమ్ముళ్ళ ఆందోళన

  సినిమాలలో బిజీ అవుతున్న బాలయ్య .. పార్టీ పరిస్థితిపై తెలుగు తమ్ముళ్ళ ఆందోళన

  కేఎస్ రవికుమార్ తో ఒక చిత్రం ఓకే చేస్తారని టాక్ వినిపిస్తుంది. అలాగే బోయపాటి కూడా బాలయ్య కోసం ఒక స్క్రిప్ట్ రెడీ చేశారని తెలుస్తోంది. అంతే కాదు వి.వి.వినాయక్ డైరెక్షన్లో బాలయ్య ఒక సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అనిల్ రావిపూడి స్క్రిప్టుతో వివి వినాయక్ డైరెక్షన్లో త్వరలోనే బాలయ్య సినిమా ప్రారంభం కాబోతోందని ప్రచారం జరుగుతోంది. ఇక వరుస సినిమాలతో బాలయ్య బిజీ కాబోతున్నారన్న వార్తల నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లు కాస్త అసహనంతో ఉన్నట్లుగా తెలుస్తుంది.

  రాయలసీమ పార్టీ బాధ్యతలు బాలయ్య చేపట్టాలని క్యాడర్ డిమాండ్ .

  రాయలసీమ పార్టీ బాధ్యతలు బాలయ్య చేపట్టాలని క్యాడర్ డిమాండ్ .

  ఇక టీడీపీలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో రాయలసీమ పార్టీ క్యాడర్ అంతా రాయలసీమ పార్టీ బాధ్యతలన్నింటినీ బాలకృష్ణకు అప్పగించాలని, అప్పుడే పార్టీ బలోపేతం అవుతుందని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఇక బాలయ్య మాత్రం ఫుల్ టైమ్ సినిమాలతో బిజీ కాబోతున్నారనే చర్చ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లోను కొనసాగుతోంది. బాలకృష్ణ పార్టీ బాధ్యతలు స్వీకరించి పార్టీ కోసం గట్టిగా ప్రయత్నం చేస్తేనే ప్రస్తుతం ఉన్న గడ్డు పరిస్థితుల నుండి టిడిపి గట్టెక్కే అవకాశం ఉంటుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. కానీ బాలయ్య మాత్రం ఫుల్ టైమ్ పాలిటిక్స్ కంటే, పార్ట్ టైం పాలిటిక్స్ పైనే దృష్టి పెడుతున్నట్లుగా , ఇంకా సినిమాల పైనే ఎక్కువ దృష్టి సారించినట్లుగా కనిపిస్తుంది.

  టీడీపీ కోసం రెండు పడవల మీద కాళ్ళు పెట్టొద్దు అంటున్న టీడీపీ నేతలు .. బాలయ్య ఏం నిర్ణయం తీసుకుంటారో

  టీడీపీ కోసం రెండు పడవల మీద కాళ్ళు పెట్టొద్దు అంటున్న టీడీపీ నేతలు .. బాలయ్య ఏం నిర్ణయం తీసుకుంటారో

  భవిష్యత్తులో టిడిపి నిలబడాలంటే ఇప్పటికైనా బాలయ్య రెండు పడవల మీద కాళ్లు పెట్టడం మానేయాలని, రాజకీయాల మీద దృష్టి సారించాలని తెలుగు తమ్ముళ్లు కోరుతున్నారు. మరి ఇకనైనా బాలయ్య సినిమాలను చకచకా పూర్తి చేసి, భవిష్యత్తు రాజకీయాలలోనైనా పూర్తిస్థాయి సమయాన్ని పార్టీ కోసం కేటాయిస్తే రాయలసీమలో పార్టీకి కొత్త ఉత్సాహం వస్తుంది అని తెలుగు తమ్ముళ్ళు ఆశిస్తున్నారు . మరి భవిష్యత్తులో బాలయ్య ఏం చేస్తారో వేచి చూడాల్సిందే.

  .

  English summary
  After the utter defeat of TDP in the recent election, the party cadre including the party activists wanted actor turned politician Balakrishna to focus on politics full time. Party cadre is of the opinion that sailing in two boats at the same time will affect the image of the party further. However, Film Nagar talk is that Balakrishna is against the concept of full-time politics. Balakrishna has a series of movies now and he has already started some of the projects with top most directors.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X