హిందూపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో నలుగురు మంత్రుల మాఫియా నడుస్తుంది .. ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే బాలకృష్ణ ధ్వజం

|
Google Oneindia TeluguNews

తెలుగుదేశం పార్టీ నేత, హిందూపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అభ్యర్థులతో కలిసి ప్రచారం చేస్తున్న బాలకృష్ణ వైసీపీ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో దోపిడీ కొనసాగుతోందని దుయ్యబట్టారు. వైసిపి పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందని బాలకృష్ణ అభిప్రాయపడ్డారు.

హిందూపూర్ మున్సిపాలిటీపై బాలయ్య ఫోకస్ .. నేటినుండి ఎమ్మెల్యే బాలకృష్ణ ఎన్నికల ప్రచారంహిందూపూర్ మున్సిపాలిటీపై బాలయ్య ఫోకస్ .. నేటినుండి ఎమ్మెల్యే బాలకృష్ణ ఎన్నికల ప్రచారం

 ఏపీలో మంత్రులు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని బాలయ్య విమర్శలు

ఏపీలో మంత్రులు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని బాలయ్య విమర్శలు

రాష్ట్రంలో ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా రాజ్యమేలుతున్నాయని మండిపడిన బాలయ్య ఏపీలో నలుగురు మంత్రుల మాఫియా నడుస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారన్నారు . రాష్ట్రంలో యువత భవిష్యత్తును అంధకారమయం చేశారని మండిపడ్డారు. ఒక్క ఛాన్స్ అని అడిగి, రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశారని బాలయ్య అసహనం వ్యక్తం చేశారు. అందుకే మున్సిపల్ ఎన్నికలలో అయినా జవాబుదారీతనం ఉన్న పార్టీని ఎంచుకొని ఓటేయాలని బాలయ్య ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

వైసీపీ చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చెయ్యాలని డిమాండ్

వైసీపీ చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చెయ్యాలని డిమాండ్

హిందూపురం నియోజకవర్గం లో గతంలో టిడిపి హయాంలోనే అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని పేర్కొన్న బాలకృష్ణ, వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఎలాంటి అభివృద్ధి జరగలేదని పేర్కొన్నారు.
హిందూపురంలో రెండేళ్ల కాలంలో వైసీపీ చేసిన అభివృద్ధి ఏమిటో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసిన బాలకృష్ణ, హిందూపురం నియోజకవర్గంలో వైసీపీ నాయకులకు ఎవరు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

వైసీపీ అధికారంలో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలూ నిర్వీర్యం

వైసీపీ అధికారంలో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలూ నిర్వీర్యం


రాష్ట్రంలో టిడిపి హయాంలో మట్కా, అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేశామని చెప్పిన బాలకృష్ణ, వైసిపి హయాంలో తిరిగి అవన్నీ కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యులకు అందుబాటులో లేవని, సామాన్యులు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని బాలకృష్ణ మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు.

ఏపీలో నలుగురు మంత్రుల మాఫియా .. బాలయ్య ఫైర్

ఏపీలో నలుగురు మంత్రుల మాఫియా .. బాలయ్య ఫైర్

ఏపీలో నలుగురు మంత్రుల మాఫియా కొనసాగుతుందని నిప్పులు చెరిగిన బాలకృష్ణ ఒకరు చంద్రబాబుని తిట్టడానికి పనిచేస్తున్నారని, మరొకరు ఇసుక మాఫియా, ఇంకొకరు లిక్కర్ మాఫియా, నాలుగవ మంత్రి మైనింగ్ మాఫియా అంటూ విమర్శలు గుప్పించారు. అన్నింటినీ ప్రైవేటు పరం చేస్తూ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని బాలకృష్ణ విమర్శించారు. గతంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు గౌరవంగా ఉండే వారిని, వైసిపి హయాంలో వారి పరిస్థితి మారిపోయింది అని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.

వైసిపి నాయకులు రెండేళ్లలో ఏం చేశారో చూపించాలని బాలయ్య సవాల్


తనపై విమర్శలు గుప్పిస్తున్న వైసిపి నాయకులు రెండేళ్లలో ఏం చేశారో చూపించాలని బాలయ్య సవాల్ విసిరారు. బెదిరింపులు ,దౌర్జన్యాలకు పాల్పడే ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజు వస్తుందని బాలయ్య అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈసారి మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. టీడీపీ నుండి బరిలోకి దిగిన అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజాక్షేత్రంలో వైసీపీ అక్రమాలను ఎండగడుతున్నారు.

English summary
Hindupur MLA Nandamuri Balakrishna has launched the municipal election campaign. Balakrishna, who is campaigning with the candidates, has set fire to the YCP government. lamented that exploitation has been going on in the state since the YSR Congress party came to power. Balakrishna opined that the state of Andhra Pradesh had gone back 20 years under the YCP rule. Balakrishna criticized the four ministers mafia in AP destructing the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X