హిందూపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎంపీ గోరంట్ల మాధవ్ గుర్రపు స్వారీ ... గోరంట్ల గట్స్ పై కామెంట్స్ .. వైరల్ గా మారిన వీడియో ..

|
Google Oneindia TeluguNews

గోరంట్ల మాధవ్... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పేరు తెలియని వారుండరు. అనంతపురం రాజకీయాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం కీలక నేతగా, హిందూపురం ఎంపీగా ఉన్న గోరంట్ల మాధవ్ ఎంతోకాలంగా అనంతపురం రాజకీయాలను శాసించిన జెసి దివాకర్ రెడ్డి పై మీసం మెలేసి, తొడగొట్టిన ఒకప్పటి పోలీస్ ఆఫీసర్. జెసి దివాకర్ రెడ్డి పై ధిక్కార స్వరాన్ని వినిపించిన గోరంట్ల మాధవ్ అప్పటినుండి ఇప్పటివరకు ఏది చేసినా ఒక సంచలనమే.

ఎమ్మెల్యే శ్రీదేవిపై కుల వివక్ష వ్యాఖ్యల ఎపిసోడ్ లో ట్విస్ట్ .. ఆమె ఎమ్మెల్యే సీటుకే ఎసరుఎమ్మెల్యే శ్రీదేవిపై కుల వివక్ష వ్యాఖ్యల ఎపిసోడ్ లో ట్విస్ట్ .. ఆమె ఎమ్మెల్యే సీటుకే ఎసరు

సంచలనాలకు కేర్ ఆఫ్ గా మారుతున్న గోరంట్ల మాధవ్ ..

సంచలనాలకు కేర్ ఆఫ్ గా మారుతున్న గోరంట్ల మాధవ్ ..


రాజకీయాల్లో అలా అడుగు పెట్టగానే ఎంపీగా తిరుగులేని నాయకుడిగా పార్లమెంట్లో కాలు పెట్టారు. ఇక పార్లమెంటులోనూ అనంతపురం జిల్లాలో కరువు పరిస్థితుల పైన మాట్లాడిన గోరంట్ల మాధవ్ విధిలేని పరిస్థితుల్లో అక్కడి మహిళలు వ్యభిచార రొంపిలోకి దిగుతున్నారని, కరువు నివారణ చర్యలు చేపట్టాలని తన గళాన్ని గట్టిగా వినిపించారు. ఇక కియా మేడ్ ఇన్ ఏపీ మొదటి కారు ఆవిష్కరణకు వెళ్ళిన మాధవ్ అక్కడ హల్ చల్ చేశారు.కియా తొలి కారు ఆవిష్కరణకు హాజరైన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఆ సంస్థ యాజమాన్యంపైన మండి పడ్డారు. కియా యాజమాన్యం ఇప్పటికీ చంద్రబాబు మత్తులోనే ఉన్నట్లుగా ఉందని.. ఆయన దర్శకత్వంలోనే నడుస్తున్నట్లు కనిపిస్తోందంటూ వ్యాఖ్యానించారు. కారు ఆవిష్కరణ కార్యక్రమంలో కొత్త కారు పైన కియ కార్ రోల్ అవుట్..బట్ అవర్ యంగ్ అండ్ డైనమిక్ యూత్ ఈజ్ రూల్డ్ అవుట్ అని రాసి సంతకం చేసారు. దీనితో ఆయన తీరు మరోమారు చర్చనీయాంశం అయ్యింది.

 మంచి వేగంతో గుర్రపు స్వారీ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన ఎంపీ ..

మంచి వేగంతో గుర్రపు స్వారీ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన ఎంపీ ..


ఇక అలాంటి గోరంట్ల మాధవ్ కు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హిందూపురం నియోజకవర్గంలో పర్యటించిన ఆయన గుర్రపు స్వారీ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. సుధాకర్ అనే వ్యక్తికి చెందిన గుర్రాన్ని ఒక రెండు కిలోమీటర్ల మేర స్వారీ చేసి అందరిని విస్మయపరిచారు .మొదటినుంచి దూకుడు చూపించే గోరంట్ల మాధవ్ గుర్రపు స్వారీ లోనూ అంతే దూకుడుగా ముందుకు వెళ్లారు. గుర్రపు స్వారీ చేస్తున్న ఆయన వేగం చూసి అక్కడి వాళ్ళు అందరూ అవాక్కయ్యారు. నల్లపురెడ్డి పల్లి నుండి నల్లగొండ వారి పల్లి మలుపు వరకు గుర్రంపై స్వారీ చేస్తూ వెళ్లిన గోరంట్ల మాధవ్ ను ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు మగధీర అంటూ కొనియాడుతున్నారు.

మగధీర అని కొనియాడుతున్న నెటిజన్లు ... గోరంట్ల మాధవ్ గట్స్ పై కామెంట్స్

మగధీర అని కొనియాడుతున్న నెటిజన్లు ... గోరంట్ల మాధవ్ గట్స్ పై కామెంట్స్

ముందు గుర్రం మీద గోరంట్ల మాధవ్ ఆయన వెనుకనే కాన్వాయ్ , కార్యకర్తలు, అభిమానులు ఆయనతో కలిసి సాగారు. ఇక ఈ దృశ్యం చూసిన వారంతా ఏదో సినిమా షూటింగ్ జరుగుతున్నట్టు ఫీల్ అయ్యారు. ఇక కొందరు దీనిని చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కొద్దిసేపట్లోనే ఈ వీడియో వైరల్ గా మారింది. హార్స్ రైడింగ్ లో తన చాకచక్యంతో, నైపుణ్యాన్ని ప్రదర్శించిన గోరంట్ల మాధవ్ గట్స్ ను నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు. ఆయన ఏది చేసినా సంచలనమే అంటూ ఎంపీ గోరంట్ల మాధవ్ హార్స్ రైడింగ్ కి కితాబిస్తున్నారు

English summary
People may be remembering Horse race scene in Magadheera movie. Once again such scene has surfaced. It is not a sequel to the movie scene. YSRCP MP Gorantla Madhav has traveled in his constituency and he rode on horseback from Nalapparedipalli to Nallagondavaripally. He covered almost two kilometers. The owner of the horse is Sudhakar, who offered Horse to MP for some time after suggesting some tips. The moment the said video was uploaded on social media, it went viral within no time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X