• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వావ్.. సర్కార్ బడుల్లోకి 1.25 లక్షల మంది విద్యార్థులు.. ఎక్కడ అంటే

|

కరోనా వల్ల పరిస్థితులు మారిపోతున్నాయి. కేసులు తగ్గుతోన్న.. ప్రజల జీవన ప్రమాణ స్థాయిపై తీవ్రంగా ప్రభావం పడింది. ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయి. ఇటు
తెలంగాణ‌ రాష్ట్రంలో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌కు పూర్వ‌ వైభ‌వం వ‌చ్చింది. ఇన్నాళ్లు ప్రైవేటు పాఠ‌శాల‌ల్లో విద్య‌ను అభ్య‌సించిన విద్యార్థులు తిరిగి ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల వైపు వస్తున్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో నాణ్య‌మైన విద్య‌ను అందించ‌డమే విద్యార్థుల పున‌రాగ‌మ‌నానికి నిద‌ర్శ‌నం అయ్యిందనే వాదన కూడా ఉంది. దీంతోపాటు కరోనా వల్ల.. ప్రైవేట్ ఫీజులు చెల్లించలేని పరిస్థితి కూడా ఉంది.

ఇలా మొగ్గు..

ఇలా మొగ్గు..

నాణ్య‌మైన‌, పటిష్ట‌మైన విద్య‌ విద్యార్థుల‌కు అందివ్వ‌డంతో మంచి ఫ‌లితాల‌ను సాధిస్తున్నారు. దీంతో ప్రైవేటు పాఠ‌శాల‌ల్లో చ‌దువుతున్న విద్యార్థులు కూడా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల వైపు మొగ్గు చూస్తున్నారు. త‌మ పిల్ల‌ల‌ను ప్రైవేటుకు కాకుండా స‌ర్కార్ బ‌డికి పంపేందుకు త‌ల్లిదండ్రులు సైతం ఆస‌క్తి చూపుతున్నారు. 2021-22 విద్యా సంవ‌త్స‌రంలో ప్రైవేటు పాఠ‌శాల‌ల్లో చ‌దువుతున్న 1.25 ల‌క్ష‌ల మంది విద్యార్థులు.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో చేరారు. దీంతో గ‌త విద్యా సంవ‌త్స‌రంతో పోలిస్తే ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో విద్యార్థుల సంఖ్య 40 శాతం పెరిగింది. ఒక‌టో త‌ర‌గ‌తి నుంచి 12వ త‌ర‌గ‌తి మ‌ధ్య‌లోనే ఈ సంఖ్య పెరిగిన‌ట్లు విద్యాశాఖ అధికారులు స్ప‌ష్టం చేశారు.

ఫీజు బాదుడు

ఫీజు బాదుడు

ప్రైవేటు పాఠ‌శాల‌లు అధికంగా ఫీజులు పెంచ‌డంతో పేదలు.. ఆ డ‌బ్బు చెల్లించే ప‌రిస్థితుల్లో లేరు. ఉపాధి అవ‌కాశాలు కూడా స‌రిగా లేక‌పోవ‌డంతో ప‌లు కుటుంబాల ప‌రిస్థితి దారుణంగా ఉంది. ప్రైవేటు పాఠ‌శాల‌ల కంటే ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లోనే నాణ్య‌మైన విద్య‌ను అందిస్తున్నార‌ని త‌ల్లిదండ్రులు భావిస్తున్నారు. దీంతో త‌మ పిల్ల‌ల‌ను స‌ర్కార్ బ‌డికి పంపుతున్నారు. విద్యార్థుల పెరుగుద‌ల కేవ‌లం ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లోనే అధికంగా న‌మోదైంది. రెసిడెన్షియ‌ల్, సోష‌ల్ వెల్ఫేర్ స్కూళ్ల‌లో ప్రైవేటు పాఠ‌శాల‌ల పిల్ల‌లు చేర‌లేదు. రాష్ట్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న గ‌వ‌ర్న‌మెంట్ డే స్కూల్స్‌లోనే 40 శాతం అధికంగా విద్యార్థులు చేరిన‌ట్లు అధికారులు తెలిపారు.

85 వేల విద్యార్థులు

85 వేల విద్యార్థులు

విద్యా శాఖ అధికారుల లెక్క‌ల ప్ర‌కారం.. 2020 ఏడాదిలో 85 వేల ప్రైవేటు పాఠ‌శాల‌ల విద్యార్థులు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో చేరిన‌ట్లు తేలింది. అంత‌కుముందు ఏడాదితో పోలిస్తే 40 శాతం పెరిగిన‌ట్లు పేర్కొన్నారు. క‌రోనా కంటే ముందు ఈ సంఖ్య అతి త‌క్కువ‌గా ఉంద‌న్నారు. క‌రోనా ఎఫెక్ట్ త‌ర్వాత‌నే ఏడాదికి ఏడాది ఈ సంఖ్య పెరిగిపోతోంద‌ని అధికారులు స్ప‌ష్టం చేశారు. 2018 విద్యా సంవ‌త్స‌రాన్ని ప‌రిశీలిస్తే విద్యార్థుల న‌మోదు అతి త‌క్కువ‌గా ఉంది. 50 శాతం కంటే త‌క్కువే అని చెప్పొచ్చు. ఒకవేళ విద్యార్థుల న‌మోదు పెరిగినా అది కేవ‌లం 10 నుంచి 15 శాతం మాత్ర‌మే అని అధికారులు పేర్కొన్నారు.

వైరస్ ఇంఫెక్ట్

వైరస్ ఇంఫెక్ట్

ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

టీకాయే శ్రీ రామరక్ష

టీకాయే శ్రీ రామరక్ష


వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు.

  వినాయక విగ్రహాల ధరలతో బెంబేలెత్తుతున్న భక్తులు!!
  వేరియంట్స్ ఆందోళన

  వేరియంట్స్ ఆందోళన


  ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. మాస్క్ ధరించి.. శాని టైజర్ రాసుకొని కాలం వెళ్లదీయాల్సిందేనని నిపుణులు సజెస్ట్ చేస్తున్నారు.

  English summary
  1.25 lakh students join government schools in telangana state education officials said
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X