హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

2 రోజుల్లో 1.10 లక్షల లడ్డూల విక్రయం, శ్రీవారి ప్రసాదం కోసం క్యూ లైన్‌లో జనం బారులు...

|
Google Oneindia TeluguNews

తిరుపతి లడ్డూకు ఉన్న క్రేజే వేరు. ఏ లడ్డూకి లేని టేస్ట్ లడ్డూ సొంతం. తిరుపతి లడ్డూ పేరు చెబితనే నోటిలో ఊరిలు వస్తుంటాయి. ఆ మధురమైన స్వామివారి ప్రసాదానికి భారీగా డిమాండ్ ఉంది. అయితే లాక్ డౌన్ వల్ల తిరుమల ఆలయం మూసివేసిన సంగతి తెలిసిందే. దీంతో లడ్డూ ప్రసాదం కూడా ఉత్పత్తి నిలిచిపోయింది. దాదాపు రెండు నెలల తర్వాత మళ్లీ ప్రసాదం ఉత్తత్తి ప్రారంభించారు. దీంతో భక్తులు కొనుగోలు చేసేందుకు ఎగబాకారు.

తిరుపతి లడ్డూ, అద్దె గదులు.. మద్యం ధర కూడా పెంచారు.. అంతా జే ట్యాక్స్ మాయ...తిరుపతి లడ్డూ, అద్దె గదులు.. మద్యం ధర కూడా పెంచారు.. అంతా జే ట్యాక్స్ మాయ...

తిరుపతిలోనే గాక లడ్డూలను హైదరాబాద్‌లో ఉన్న టీటీడీ ఆలయానికి పంపించారు. లక్ష 35 వేల లడ్డూలను పంపించగా.. రెండురోజుల్లోనే లక్ష పదివేల లడ్డూలను కొనుగోలు చేశారు. వాస్తవానికి లడ్డూ ధర రూ.50 కాగా.. లడ్డూలను రూ.25కి సబ్సిడీకి అందజేశారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో కూడా సబ్సిడీకి లడ్డూలను అందజేస్తోంది. ఏపీలో గతనెల 25వ తేదీ నుంచి లడ్డూలను విక్రయిస్తోంది.

1 lakh Tirupati laddus sold in two days in Hyderabad..

హైదరాబాద్ హిమాయత్ నగర్‌లో గల టీటీడీ ఆలయం వద్ద లడ్డూల కోసం జనం బారులుతీరారు అయితే లడ్డూ కొనుగోలు చేశామని.. కానీ స్వామివారి దర్శనం కాలేదని భక్తులు అంటున్నారు. ఉన్న ప్రసాదం అయిపోతే మరిన్ని లడ్డూలు కూడా వస్తాయని అధికారులు తెలిపారు. కానీ క్యూలైన్ వద్ద భౌతికదూరం పాటిస్తూ, మాస్క్ ధరించాలని అధికారులు కోరుతున్నారు. విధిగా శానిటైజర్ తమ వద్ద ఉంచుకోవాలని.. గ్లౌజ్ కూడా వేసుకోవాలని కోరారు.

English summary
tremendous response from devotees in Hyderabad to subsidised sales of the famous 'Tirupati laddu', considered the sacred prasadam of the Sri Venkateswara temple in Tirumala in Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X