హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సికింద్రాబాద్ లో 10టన్నుల వెండి పట్టివేత ... విలువ 40 కోట్లట..

|
Google Oneindia TeluguNews

సికింద్రాబాద్ పోలీసులు టన్నుల కొద్దీ వెండిని తరలిస్తున్న కంటైనర్‌ను పట్టుకున్నారు. బోయినపల్లి పోలీసులు జరిపిన వాహన తనిఖీల్లో చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన కంటైనర్‌లో భారీగా వెండిని గుర్తించారు అధికారులు. దాదాపు 10 టన్నుల వెండిని గుర్తించిన అధికారులు వెండికి సంబంధించి పత్రాలు లేకపోవటంతో ఇది అక్రమ రవాణా గా భావిస్తూ వాహనాన్ని సీజ్ చేశారు.

పోలీసులకు వెండి రవాణాపై వచ్చిన సమాచారంతోనే బోయినపల్లి పోలీసులు అప్రమత్తం అయ్యారు. కంటైనర్‌ను అదుపులోకి తీసుకొని బోయినపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.అయితే ఈ వెండిని లండన్ నుంచి చెన్నైకు తరలించినట్లు తెలుస్తోంది. ఇక ఇది చెన్నై నుండి హైదరాబాద్ కు వస్తున్న క్రమంలో పోలీసులు పట్టుకున్నారు.

 10 tonnes of silver seized in hyderabad .. value around Rs 40 crores

దీని విలువ రూ. 40 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కంటైనర్‌లో సుమారుగా 9వేలకు పైగా వెండీ కడ్డీలు ఉన్నట్లు తెలుస్తుంది. కంటైనర్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. వాహనాన్ని నడుపుతున్న ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చెప్పాట్టారు.

వెండికి సంబంధించిన ఎలాంటి డాక్యుమెంట్లు లేకపోవడంతో వాహనాన్ని సీజ్ చేసి, వాహనంలోని వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని అన్నికోణాల నుండి దర్యాప్తు చేస్తున్నారు. . ఈ కంటైనర్‌కు సెక్యూరిటీ సిబ్బందిగా ఉన్నవారి దగ్గర ఎలాంటి పత్రాలు కూడా దొరకలేదు. దీంతో ఈ వెండి ఎవరికి సంబంధించినది? ఎక్కడ నుండి తెస్తున్నారు? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అంటూ పోలీసులు విచారణ చేస్తున్నారు. నగరంలో పలు జ్యువెలరీ షాపులకు ఈ వెండి సరఫరా అవుతుందని పోలీసులు అనుమానిస్తున్నారు .

గత కొద్ది కాలంగా ఈ దందా అక్రమంగా కొనసాగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. వెండికి సంబంధించిన సరైన పత్రాలు లభిస్తే వాటిని యజమానులకు తిరిగి అప్పగించాలని పోలీసులు భావిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఈ వెండికి సంబంధించి ఎవరూ పత్రాలతో పోలీసుల వద్దకు రాలేదు. మొత్తానికి ఇంత భారీ మొత్తంలో వెండి దొరకటం రాష్ట్రంలో సంచలనంగా మారింది .

English summary
The North Zone Bowenpally police on Monday busted an illegal transportation of Silver in the city. They intercepted a container and did searches in which found about 10 tonnes of Silver. The container was coming from Chennai to Hyderabad. They are estimating the cost of it around Rs 40 crore. By taking two drivers into custody police are investigating.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X