హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లిక్కర్ హోం డెలివరీ కావాలి: 100 శాతం హైదరాబాదీల మాట ఇదీ, అధ్యయనం

|
Google Oneindia TeluguNews

లిక్కర్ తాగేవారి శాతం రోజురోజుకు పెరిగిపోతుంది. వైన్ షాపు ఓపెన్ చేసినప్పటీ నుంచి మూసివేసే వరకు రష్‌గా ఉంటుంది. వైన్ షాపులు వద్ద మద్యం రద్దీ తగ్గించేందుకు మద్యం హోం డెలివరీ చేయాలనే ప్రతిపాదన వచ్చింది. దీనిపై పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. హోం డెలివరీ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇటీవల అధ్యయనం చేసింది.

8 రాష్ట్రాల్లో అధ్యయనం చేయగా.. 100% మంది హైదరాబాదీలు మాత్రమే మద్యం హోం డెలివరీ చేయాలని కోరుకుంటున్నట్లు వెల్లడైంది. ప్రముఖ నగరాలలో సగటున 70% మంది నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, సంగారెడ్డి, నల్గొండ వంటి తెలంగాణలోని ఇతర ప్రాంతాలలో హోమ్ డెలివరీకి డిమాండ్ పెరుగుతున్నట్లు సర్వేలో గమనించారు.

మేఘాలయ, పంజాబ్‌, పుదుచ్చేరి, ఢిల్లీ, అసోం, పశ్చిమబెంగాల్‌, మహారాష్ట్ర, ఒడిశాలో మద్యం హోం డెలివరీ చేస్తుండగా.. మరిన్ని రాష్ట్రాలు కూడా మద్యం హోండెలివరీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. మద్యం హోం డెలివరీపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకొనేందుకు సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో తెలంగాణకు సంబంధించి 7 వేల 500 మంది అభిప్రాయాలను సేకరించింది. ఈ సర్వేలో వంద శాతం మంది మద్యం హోమ్ డెలివరీకి సపోర్ట్ చేస్తున్నట్లు చెప్పారు.

 100 percent hyderabadis want liquor home delivery

ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసి డబ్బును చెల్లిస్తే సమీపంలోని వైన్‌షాపు నుంచి మద్యం సరఫరా జరిగేలా ఏర్పాట్లు చెయ్యాలని చాలామంది మద్యం ప్రియులు కోరుతున్నారు. సర్వేలో మద్యం తాగేవారి నుంచి తీసుకున్న వివరాల ప్రకారం 100 శాతం మంది మద్యం హోం డెలివరీకి సపోర్ట్ చేయగా.. వారిలో, దాదాపు 60% మంది సౌలభ్యం కోసం హోమ్ డెలివరీ బాగుంటుందని, 40% మంది సామాజిక దూరం మరియు భద్రత కోసం సపోర్ట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Recommended Video

Telangana Lockdown : జాతరను మరిపించిన వైన్ షాపులు.. గంటలకొద్దీ క్యూలైన్ లో

50% ప్రతి హోం డెలివరీ చేసినందుకు రూ.50 నుంచి రూ .100 వరకు ఫీజును ఇచ్చేందుకు ఇష్టపడగా.. మిగిలిన వారు ఆర్డర్ విలువలో 5% నుంచి 10% వరకు ఫీజు ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నారు. మరికొంత మంది హోం డెలివరీ వల్ల మద్యం ధరల్లో పారదర్శకత వస్తుందని, నాణ్యమైన మద్యం లభిస్తుంది 63 శాతం మంది అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉన్న ఈ కామర్స్‌ యాప్‌ ద్వారానే హోం డెలివరీ చేస్తే బాగుంటుందని 60 శాతం మంది అభిప్రాయపడ్డారు. కల్తీని అరికట్టవచ్చునని 37శాతం మంది చెప్పారు.

English summary
100 percent hyderabadis want liquor home delivery international spirits and wines association of india said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X