హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

3 కిలోల బంగారం తరలిస్తున్న 11 మంది అరెస్ట్: వందేభారత్ విమానాల్లో వచ్చి..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అక్రమంగా బంగారం తరలిస్తున్న 11 మందిని శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. గురువారం డామన్ నుంచి హైదరాబాద్ వచ్చిన వందేభారత్ మిషన్ ప్రత్యేక విమానంలో 11 మంది ప్రయాణికుల నుంచి 3.11 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

ప్యాంట్ల లోపలివైపు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ప్యాకెట్లలో బంగారం దాచుకుని తెస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ. 1.66 కోట్లు ఉంటుందని వెల్లడించారు. 11 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

11 passengers held for smuggling gold worth Rs. 1.66 cr. in Vande Bharat Mission flight

గతవారం కూడా అధికారులు రూ. 3.5లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తి నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకుని, అతడ్ని అరెస్ట్ చేశారు. నిందితుడు తన చేతివాచీలోనే బంగారాన్ని దాచడం గమనార్హం. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వందేభారత్ మిషన్ కింద విమానాలను నడుపుతున్న విషయం తెలిసిందే.

English summary
Customs enforcers of the Air Intelligence Unit on Thursday night arrested 11 passengers at Rajiv Gandhi International Airport, Hyderabad, for smuggling in 3.11 kg of gold from Dammam, Saudi Arabia.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X