హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సెలబ్రిటీ ఐఏఎస్ ఆమ్రపాలి కుటుంబానికి 1210 గజాల స్థలం

|
Google Oneindia TeluguNews

అమ్రపాలి కాటా ... ఐఏఎస్ లు ఎంతోమంది ఉన్నా ఆమెకు మాత్రం ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది. వరంగల్ కలెక్టర్ గా పని చేసిన సమయంలో ఆమె ఎప్పుడూ వార్తల్లోనే ఉండేది . మహిళా ఐఏఎస్ అధికారుల్లో సెలబ్రిటీ స్టేటస్ సొంతం చేసుకున్న అధికారిణి అమ్రపాలి . ట్రైనీగా తెలంగాణాకు వచ్చి తెలంగాణా రాష్ట్రంలో వివిధ పదవుల్లో పని చేసిన ఆమె ఇప్పుడు కేంద్ర సర్వీసులలో ఉన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో సుపరిచితమైన ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రపాలి కాటా గతంలో వరంగల్ కలెక్టర్ గా పనిచేసి, ప్రస్తుతం కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి వద్ద ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా పనిచేస్తున్న ఐఏఎస్‌ అధికారి ఆమ్రపాలి కాటా ఫ్యామిలీకి 1,210 గజాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. తెలంగాణలోని, వికారాబాద్‌ జిల్లా కొత్రేపల్లిలో ఆమ్రపాలి తల్లి పద్మావతి పేరిట 4.27 ఎకరాల స్థలం ఉంది. అయితే ఆమ్రపాలి కాటా ఈ స్థలానికి అప్రోచ్ రోడ్డు లేదని, అప్రోచ్ రోడ్డు కోసం తనకు స్థలం కావాలని కోరారు. ఈ నేపథ్యంలో ఆమె కోరిక మేరకు 1210 గజాల స్థలాన్ని నాలుగు లక్షల రూపాయలకు కేటాయిస్తూ రెవిన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తుంది.

1210 yards land for Celebrity IAS Amrapali family

గతంలో క్యాంప్ ఆఫీస్ మూసివేసి విమర్శలు ఎదుర్కోవటం , జీన్స్ వేసుకుని గుడికి వెళ్ళటం , కేటీఆర్ వచ్చినప్పుడు ఆమె ప్రవర్తనా తీరు ,ఆమె బస చేసిన కలెక్టర్ బంగ్లాలో దెయ్యం ఉందని చెప్పటం , రాత్రిళ్లు పడుకోవాలంటే భయంగా ఉంటుందన్న వ్యాఖ్య చెయటం ఇలా ఒకటేంటి అనేక రకాల కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అయారు ఆమ్రపాలి కాటా . మీడియాలో సెలబ్రిటీ అయిన ఆమ్రపాలి కాటాకు ఆమె అడిగిన మేరకు ప్రభుత్వం స్థలం కేటాయించటంపై ప్రతిపక్ష పార్టీలు ఈ అంశాన్ని ఎలా తీసుకుంటాయో చూడాలి .

English summary
The government has allotted 1,210 yards of land to the Amrapali Kata family who was formerly Warangal Collector and currently serving as Officer on Special Duty (OSD) at the Union Home Ministry. Amrorapali's mother, Padmavathi has land a 4.27-acre in Kotrepalli, Vikarabad district of Telangana, asked for Approach Road. Revenue Department Special Chief Secretary Somesh Kumar has issued an order for the allocation of 1210 yards with 4 lakhs worth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X