హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణా బీజేపీకి కలిసొచ్చిన 2020: బండి సంజయ్ సారధ్యంలో బలమైన రాజకీయ పార్టీగా ముద్ర

|
Google Oneindia TeluguNews

ప్రపంచమంతా 2020 సంవత్సరం అత్యంత భయానకమైన సంవత్సరం, దారుణమైన సంవత్సరమని భావిస్తుంటే 2020 సంవత్సరం మాత్రం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి కలిసొచ్చిన సంవత్సరంగా చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ 2020 సంవత్సరం లో అనూహ్యంగా బలపడింది. గత అసెంబ్లీ ఎన్నికలలో కేవలం ఒక్క స్థానానికి పరిమితమై తీవ్ర ప్రభావానికి గురైన బిజెపి, ఈ సంవత్సరం క్రమంగా కోలుకుంది. ఈ సంవత్సరం భారతీయ జనతా పార్టీకి నాయకత్వ మార్పు బాగా కలిసి వచ్చినట్లు గా కనిపిస్తుంది.

బీజేపీ రాష్ట్ర బాధ్యతలు బండి చేతికి .. దూకుడు చూపిస్తున్న బీజేపీ సైన్యం

బీజేపీ రాష్ట్ర బాధ్యతలు బండి చేతికి .. దూకుడు చూపిస్తున్న బీజేపీ సైన్యం

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడుగా పగ్గాలు అప్పజెప్పిన నాటినుండి దూకుడుగా భారతీయ జనతా పార్టీ ముందుకు వెళుతుంది. గత ఎంపీ ఎన్నికలలో విజయం సాధించిన బండి సంజయ్, నిజామాబాద్ నియోజకవర్గంలో కవితను ఓడించిన ధర్మపురి అరవింద్ లు తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ పై దూకుడుగా ముందుకు వెళ్లారు .దక్షిణాది రాష్ట్రాలలో ఒక్కటైన తెలంగాణ రాష్ట్రంలో పాగా వేయాలని బిజెపి అధినాయకత్వం దృష్టిసారించడం, కిషన్ రెడ్డికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించడం, కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీ లోకి వచ్చిన డీకే అరుణ వంటి నాయకులకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలు బీజేపీకి లభించాయి.

క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చెయ్యటంపై దృష్టి ,సీఎం కేసీఆర్ టార్గెట్ గా వ్యూహాలు

క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చెయ్యటంపై దృష్టి ,సీఎం కేసీఆర్ టార్గెట్ గా వ్యూహాలు

బండి సంజయ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై, అలాగే రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ తీసుకున్న నిర్ణయాలను, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టడం పై దృష్టి సారించారు. సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా బలమైన నినాదాన్ని వినిపించారు. దాడులకు, అరెస్టులకు వెరవకుండా తాను ముందుకు వెళ్ళడమే కాకుండా, బిజెపి సైన్యాన్ని ముందుకు నడిపించారు. బండి సంజయ్ రాకతో బీజేపీలో స్ట్రాటజీ మారిపోయింది. వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లడం, ప్రజాక్షేత్రంలో ప్రజల్లోకి బలమైన అంశాలను తీసుకెళ్లడంలో బిజెపి గతంతో పోలిస్తే చాలా మెరుగైంది.

బీజేపీ బలాన్ని పరీక్షించుకోవటానికి దుబ్బాక ఉపఎన్నిక వేదిక .. బీజేపీ అభ్యర్థి విజయంతో జోష్

బీజేపీ బలాన్ని పరీక్షించుకోవటానికి దుబ్బాక ఉపఎన్నిక వేదిక .. బీజేపీ అభ్యర్థి విజయంతో జోష్

బండి సంజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో అనుకోకుండా వచ్చిన దుబ్బాక ఉప ఎన్నిక బిజెపి బలాన్ని పరీక్షించుకోవడానికి వేదిక అయింది. కేసీఆర్ మేనల్లుడు, మంత్రి హరీష్ రావు వ్యూహాత్మకంగా ప్రచారం చేసిన, బీజేపీని ఓడించడానికి ఎత్తుగడలు రచించినా వాటినన్నింటినీ నిర్వీర్యం చేస్తూ బిజెపి నుంచి ఎన్నికల బరిలోకి దిగిన రఘునందన్ రావు విజయం సాధించారు. ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీకి బిజెపి నేతలు చెమటలు పట్టించారు. తమ బలమైన గళాన్ని వినిపించారు. ఎక్కడా దాడులకు భయపడలేదు. కేసులకు వెనకాడలేదు.

గ్రేటర్ లో నాలుగు స్థానాల నుండి 48 స్థానాలకు ఎదిగిన బీజేపీ .. కాంగ్రెస్ ను పక్కకు నెట్టిన కాషాయదండు

గ్రేటర్ లో నాలుగు స్థానాల నుండి 48 స్థానాలకు ఎదిగిన బీజేపీ .. కాంగ్రెస్ ను పక్కకు నెట్టిన కాషాయదండు

దుబ్బాక ఎన్నికల ఊపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ బీజేపీకి కొండంత బలాన్ని ఇచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని, ఎంఐఎం పార్టీని టార్గెట్ చేసి, హిందుత్వ భావజాలాన్ని ప్రచారం చేసి బిజెపి సక్సెస్ సాధించింది అనే చెప్పాలి. గతంలో నాలుగు స్థానాలకు పరిమితం అయిన బీజేపీ, ఈసారి ఏకంగా 48 స్థానాలకు ఎగబాకింది అంటే బీజేపీ ఎంత బలోపేతం అయిందో అర్థమవుతుంది. ఒకపక్క అధికార పార్టీకి చెమటలు పట్టిస్తూనే, మరో పక్క కాంగ్రెస్ పార్టీ ఉనికిని ప్రశ్నార్ధకం చేసే పనిలో బిజెపి సక్సెస్ అయింది.

తెలంగాణాలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ నే అన్న బలమైన సంకేతం

తెలంగాణాలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ నే అన్న బలమైన సంకేతం

దుబ్బాక ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు బిజెపికి బూస్ట్ లా పనిచేస్తున్నాయి. ప్రస్తుతం భవిష్యత్ ఎన్నికల్లో కూడా విజయం సాధించేలా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా టాప్ టు ప్లేస్ లో బిజెపి తన స్థానాన్ని ఏర్పరచుకుంది. రానున్న ఎన్నికలలో కూడా కాషాయ జెండాను ఎగురవేసి, 2023 లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో బీజేపీ శ్రేణులు పని చేస్తున్నాయి.

Recommended Video

2020 Benefits Telangana BJP తెలంగాణాలో TRS కు ప్రత్యామ్నాయం బీజేపీనే Congress ను పక్కకు నెట్టి!!
2023 అసెంబ్లీ ఎన్నికలు టార్గెట్ గా బీజేపీ పావులు .. తెలంగాణా బీజేపీ నేతలకు అగ్రనాయకుల అండదండలు

2023 అసెంబ్లీ ఎన్నికలు టార్గెట్ గా బీజేపీ పావులు .. తెలంగాణా బీజేపీ నేతలకు అగ్రనాయకుల అండదండలు

అందుకు కావాల్సిన అండదండలతో బిజెపి అగ్రనాయకత్వం అందించడం అడుగడుగున కనిపిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారానికి బీజేపీ అగ్రనాయకులు వచ్చి ప్రచారం చెయ్యటం అందుకు నిదర్శనం . మొత్తానికి 2020 మిగతా రాజకీయ పార్టీల కంటే బిజెపికి బాగా కలిసొచ్చిందని చెప్పొచ్చు. అందునా తెలుగు రాష్ట్రాలలో ఒకటైన తెలంగాణ రాష్ట్రంలో బిజెపి బాగా బలపడింది. కేంద్రంలోని అగ్రనాయకత్వం కూడా తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పాగా వేయాలని బలమైన సంకేతాలు పంపుతున్న తరుణంలో తెలంగాణ బిజెపి పర్ఫామెన్స్ ప్రస్తుతానికైతే తృప్తినిస్తుంది. ముందు ముందు తెలంగాణ బిజెపి ఏం చెయ్యబోతుందో ? తెలంగాణలో ఏ స్థానంలో బిజెపి నిలువబోతుందో వేచి చూడాల్సిందే.

English summary
2020 is a good year for Telangana BJP and the party bacame strong in this year. The results of the Dubba elections and the Greater Hyderabad elections under the leadership of Bandi Sanjay are working as a boost for the BJP to bring the BJP to power in 2023.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X