హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మళ్లీ కరోనా విజృంభణ.. 2 వేల మార్క్ దాటిన పాజిటివ్ కేసులు..

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నిన్న 13 వందల పైచిలుకు కేసులు రాగా.. ఇవాళ 2 వేల మార్క్ దాటింది. గత 24 గంటల్లో 2 వేల 72 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఒక్క రోజులోనే కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దాదాపు 700కు పైగా కేసులు రావడంతో వైరస్ వేగంగా విస్తరిస్తోందని భయాందోళన నెలకొంది.

లక్షా 87 వేలు దాటిన కరోనా కేసులు.. 24 గంటల్లో 1378 మందికి పాజిటివ్..లక్షా 87 వేలు దాటిన కరోనా కేసులు.. 24 గంటల్లో 1378 మందికి పాజిటివ్..

2,072 కేసులతో కలిపి మొత్తం కరోనా కేసులు లక్ష 89 వేల 283కి చేరింది. గత 24 గంటల్లో 2 వేల 259 మంది కోలుకున్నారు. దీంతో వైరస్ తగ్గిన వారి సంఖ్య కూడా లక్ష 58వేల 690కి చేరింది. రాష్ట్రంలో వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్నా.. రికవరీ కూడా అదేస్థాయిలో ఉండటం కాస్త సానుకూలంగా మారింది. గత 24 గంటల్లో తొమ్మిది మంది కరోనా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,116కు చేరింది. ప్రస్తుతం 29 వేల 477 మంది కరోనా వైరస్ కోసం చికిత్స తీసుకుంటున్నారు. వీరిలో చాలా మంది హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు.

2072 corona cases register in telangana

జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 283, రంగారెడ్డి జిల్లాలో 161 కేసులు వచ్చాయి. కరీంనగర్ 105, మేడ్చల్ మల్కాజిగిరి 160, నల్గొండ 130, రంగారెడ్డిలో 160 కేసుల చొప్పున వచ్చాయి. నిన్న మాత్రం రాష్ట్రవ్యాప్తంగా 1378 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

2072 corona cases register in telangana

ఇటు వ్యాక్సిన్ ప్రయోగాలు రెండు, మూడు దశల్లో ఉండటంతో మరికొద్ది నెలల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఆ లోపు వైరస్ సోకిన వారందరూ దాదాపుగా కోలుకునే పరిస్థితి ఉంది. కానీ ఇతర వ్యాధులు ఉన్నవారు తప్పా.. మిగతావారు వేగంగా క్యూర్ అవకాశాలే మెరుగ్గా ఉన్నాయి. దేశంలో వ్యాక్సిన్ ఉచితంగా అందరికీ పంపిణీ చేయాలంటే రూ.80 వేల కోట్ల వ్యయం అవుతోంది.

English summary
2072 corona cases register in telangana state. total cases reach one lakh 89 thousand 283.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X