హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బీసీ రిజర్వేషన్లు పదిలం కాదు.. 23 శాతానికే సర్కార్ సై.. బీసీలకు దెబ్బ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 34 శాతమంటూ హడావిడి జరిగింది. శనివారం నాడు ఉత్కంఠ పరిణామాలు నెలకొన్నాయి. ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడంతో 34 శాతం బీసీ రిజర్వేషన్లకు ప్రభుత్వం ఫిక్స్ అయిందని చాలామంది భావించారు. కానీ మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించొద్దన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

శనివారం నాడు హడావిడిగా ఆర్డినెన్స్ తీసుకురావడంతో 34 శాతం బీసీ రిజర్వేషన్లకు డోకా లేదనే వార్తలొచ్చాయి. తీరా చూస్తే అది 23 శాతానికే పరిమితం కానుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండొద్దని ఇటీవలే సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రిజర్వేషన్ల పెంపు జోలికి వెళ్లకుండా సుప్రీంకోర్టు చెప్పినట్లు వెళితేనే పంచాయతీ ఎన్నికలకు ఆటంకాలు ఉండవని ప్రభుత్వం భావించినట్లు సమాచారం.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే..!

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే..!

పంచాయతీ ఎన్నికలు జనవరి 10 లోగా నిర్వహించాలని హైకోర్టు కూడా ఆదేశాలివ్వడంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. దానికి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేస్తోంది. అందులోభాగంగా శనివారం నాడు శాసనమండలిని ప్రొరోగ్ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. అయితే ఆరోజు మధ్యాహ్నం వరకు కూడా దీనిపై ఎలాంటి సందడి కనిపించలేదు. తీరా సాయంత్రం చూస్తే అప్పటికప్పుడు ఆర్డినెన్స్ ఫైలుపై సీఎం, హెంమినిస్టర్ సంతాకలు చేయడం, గవర్నర్ ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. దీంతో చాలామంది 34 శాతం బీసీ రిజర్వేషన్ల కోసమే ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చారని భావించారు. అయితే 50 శాతం రిజర్వేషన్లు మించొద్దని సుప్రీంకోర్టు చెప్పినదాని ప్రకారమే ప్రభుత్వం నడుచుకుంది. అదే విధంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.

బీసీ రిజర్వేషన్లు పదిలం.. 34 శాతానికి సై.. కోర్టుల్లో ప్రభుత్వం గట్టేక్కేనా? <br /> బీసీ రిజర్వేషన్లు పదిలం.. 34 శాతానికి సై.. కోర్టుల్లో ప్రభుత్వం గట్టేక్కేనా?

బీసీలకు 34 కాదు.. 23 శాతమే

బీసీలకు 34 కాదు.. 23 శాతమే

పంచాయతీ ఎన్నికల కోసం బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుందనే వార్త శనివారం రాత్రికల్లా దావానంలా వ్యాపించింది. సాయంత్రం హడావిడిగా మొదలైన ఆర్డినెన్స్ ప్రక్రియ రాత్రికల్లా తుదిరూపు దాల్చుకుంది. గవర్నర్ సంతకం చేయడంతో ఆమోదం పొందినట్లైంది. అయితే ప్రభుత్వం ఆర్డినెన్స్ తేబోతుందని అక్కడి వర్గాలు లీకు చేయడంతోనే కొంత గందరగోళం నెలకొన్నట్లు కనిపిస్తోంది. అప్పటికప్పుడు ఆర్డినెన్స్ తేవడంతో 34 శాతం బీసీ రిజర్వేషన్లు పదిలం అంటూ అందరూ భావించారు. తీరా చూస్తే సీన్ రివర్స్. 50 శాతం రిజర్వేషన్లు మించకుండా పోతే.. బీసీలకు 23శాతం మాత్రమే కోటా లభిస్తుంది. అయితే ఓటరు గణన ప్రకారం బీసీల జనాభా 54 శాతంగా తేలింది. ఇది ఆర్నెల్ల కిందటి ముచ్చట. ఇప్పుడైతే కొత్త ఓటర్ల నమోదు తదితర అంశాలతో ఆ శాతం మరికొంత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. దీంతో బీసీలకు 23శాతం కోటా సరిపోదనే వాదన బలంగా వినిపిస్తోంది.

రిజర్వేషన్ల కిరికిరి.. ఎన్నికలు జరిగేనా?

రిజర్వేషన్ల కిరికిరి.. ఎన్నికలు జరిగేనా?

వాయిదాల మీద వాయిదాలు పడ్డ పంచాయతీ ఎన్నికలకు ఇప్పుడైనా మోక్షం లభించేనా అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ట్యాప్ 50 శాతాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఆమేరకు ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎలక్షన్ ప్రక్రియ స్పీడప్ చేస్తోంది. అయితే 2013 ఎన్నికల్లో అప్పటి పరిస్థితుల నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లు 34 శాతం అమలయ్యాయి. ఈసారి సుప్రీంకోర్టు ఆదేశాలు లెక్కలోకి తీసుకోవడంతో అది కాస్తా 23 శాతానికి పడిపోనుంది. వాస్తవానికి బీసీ ఓటర్లు 54 శాతం ఉండటంతో జనాబా దమాషా ప్రకారం 23 శాతం సరిపోదనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఈనేపథ్యంలో కొందరు కోర్టులకు వెళతామంటున్నారు. ఈనేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు ఇప్పటికైనా సజావుగా జరుగుతాయా? లేదా అన్నది హాట్ టాపిక్ గా మారింది.

English summary
The government is ready for panchayat elections. Reservations are being implemented as per the Supreme Court orders. BC's would have a quota of 34% rather than a 23% quota. Some are getting ready to take up the courts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X