హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ రెండు దేశాల నుంచి హైదరాబాద్ చేరుకున్న 312 మంది భారతీయులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: 'వందేభారత్'లో భాగంగా కరోనా లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తిరిగి తీసుకువస్తున్న విషయం తెలిసిందే. అమెరికా, ఫిలిప్పీన్స్ దేశాల్లో చిక్కుకుపోయిన పలువురు భారతీయులు గురువారం హైదరాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు.

కరోనావైరస్: ప్రపంచంలో మిలియన్ జనాభాలో ఎంత మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారో తెలుసా?కరోనావైరస్: ప్రపంచంలో మిలియన్ జనాభాలో ఎంత మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారో తెలుసా?

మనీలా, వాషింగ్టన్ నుంచి..

మనీలా, వాషింగ్టన్ నుంచి..

గురువారం తెల్లవారుజామున మనీలా(ఫిలిప్పీన్స్) నుంచి ఢిల్లీ మీదుగా ఒక విమానం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుంది. 149 మంది భారతీయులు ఈ ఏఐ 1612 విమానంలో శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. ఇక వాషింగ్టన్(అమెరికా) నుంచి ఢిల్లీ మీదుగా వచ్చిన మరో విమానం ఏఐ 104 గురువారం తెల్లవారుజామున 8.22గంటల సమయంలో హైదరాబాద్ విమానాశ్రయం చేరుకుంది. ఈ విమానంలో 163 మంది భారతీయులు వచ్చారు.

 కరోనా జాగ్రత్తలు తీసుకుంటూనే..

కరోనా జాగ్రత్తలు తీసుకుంటూనే..

కాగా, పూర్తిగా శానిటైజ్ చేసిన తర్వాతే ప్రయాణికులను విమానాశ్రయం నుంచి బయటికి పంపించారు. విదేశాల నుంచి వచ్చినవారిని ఎయిరో బ్రిడ్జి నుంచి అరైవల్స్ ర్యాంప్ వరకు పూర్తిగా శానిటైజ్, ఫ్యూమిగేషన్ చేస్తున్నారు.
విమానాశ్రయంలోకి 20-25 మంది ప్రయాణికులను ఒక బృందంగా చేసి
పూర్తిగా శానిటైజ్ చేసి తీసుకువచ్చారు. ఇమ్మిగ్రేషన్ నిబంధనలను పూర్తి చేయడానికి ముందు ఎయిర్ పోర్టు హెల్త్ అధికారులు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మార్గదర్శకాల ప్రకారం ప్రతి ప్రయాణికుడికి థర్మల్ కెమెరాల ద్వారా స్క్రీనింగ్ నిర్వహించారు.

14 రోజుల క్వారంటైన్..

14 రోజుల క్వారంటైన్..

అంతేగాక, విమానాశ్రయంలోని వాష్రూంలు, కుర్చీలు, కౌంటర్లు, రెయిలింగులు, ట్రాలీలు, లిఫ్టులు, ఎస్కలేటర్లు మొదలైన వాటిని కూడా శానిటైజ్ చేశారు. ఇక కస్టమ్స్ క్లియరెన్స్ పూర్తయిన తర్వాత టెర్మినల్ బిల్డింగ్ నుంచి బయటికి వెళ్లడానికి ముందు, ప్రయాణికులకు కాంప్లిమెంటరీ ఆహార పొట్లాలను అందించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 14 రోజులపాటు క్వారంటైన్ చేస్తున్నారు. ఇక విమానాశ్రయాలను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తూ కరోనాను దూరం చేసే చర్యలు చేపడుతున్నారు.

తెలంగాణలో కరోనా..

తెలంగాణలో కరోనా..


తెలంగాణలో ఇప్పటి వరకు 1367 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 939 మంది కోలుకున్నారు. 394 మంది కరోనా బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా కారణంగా మొత్తం 34 మంది మృతి చెందారు. ఎక్కువగా హైదరాబాద్ నగరంలోనే కరోనా కేసులు నమోదవుతుండటం గమనార్హం.

English summary
312 indians reached hyderabad from manila and washington.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X