7.3 కిలోల బంగారం.. అక్కడ పెట్టుకొని స్మగ్లింగ్.. చివరికీ దొరికి..
శంషాబాద్ ఎయిర్ పోర్టు గోల్డెన్ డెన్‌గా మారుతోంది. ఇటీవల తరచుగా అక్కడ బంగారం పట్టుబడుతుంది. ఇవాళ మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన నలుగురు సుడాన్ వాసుల నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకొన్నారు. గోల్డ్ బార్స్, పేస్ట్ రూపంలో బంగారాన్ని తీసుకొచ్చినట్లు అధికారులు గుర్తించారు.

వీరి నుంచి రూ.3.60 కోట్లు విలువైన 7.3 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఇద్దరు మహిళలు ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసిన కస్టమ్స్ అధికారులు నిందితులను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు మహిళలు కాగా.. మరో ఇద్దరు పురుషులు.. అయితే వీరు బంగారు కడ్డీలను పురీష భాగంలో తీసుకొచ్చారు. స్కాన్ చేసే సమయంలో సౌండ్ రావడంతో బయటపడింది. ఇంత మొత్తంలో బంగారం తీసుకొచ్చి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
ఇదే కాదు చాలా సందర్భాల్లో ఇలానే జరిగింది. బంగారం అక్రమ రవాణా యధేచ్చగా జరుగుతుంది. అక్టోబర్‌లో 6 కిలోల బంగారం కూడా పట్టుబడింది. అంతకుముందు కూడా సుడాన్‌కు చెందిన మహిళ ప్రయాణికురాలితో 1200 గ్రాముల బంగారం కూడా సీజ్ చేశారు. చెన్నైలో కూడా 810 గ్రాముల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు.