హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

43 నుంచి 45 డిగ్రీలు: భానుడి భగభగలు, మరో 3 రోజులు ఇలానే, వర్షసూచన లేదు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. 43 నుంచి 45 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. మరో మూడురోజులపాటు టెంపరేచర్ ఇలాగే ఉండనుంది. మూడురోజుల్లో వర్షం కురవదని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారి నాగరత్నం తెలిపారు. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నందున ఉష్ణోగ్రతలు పెరిగితేనే మేలు అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వాయవ్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయని.. వాతావరణంలో తేమ తగ్గడం వల్లే ఉష్ణోగ్రతలు పెరిగాయని నాగరత్నం తెలిపారు. మూడు రోజుల వరకు ఉష్ణోగ్రతలు ఇదేవిధంగా కొనసాగుతాయని పేర్కొన్నారు. 3 రోజుల్లో వర్షం కురవదని తెలిపారు. ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు నమోదవుతోంది. వడగాలులు వీస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎప్పటికప్పుడు మంచినీరు తాగుతూ.. మజ్జిగ, చలువచేసే ద్రవ పదార్థాలు తీసుకోవాలని కోరారు.

43 to 45 degree temperature recorded in telangana

Recommended Video

Telangana, Andhra Likely To Experience Heatwave Conditions: IMD

రాష్ట్రంలో, దేశంలో కూడా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రత ఉంటే వైరస్ ప్రభావం తక్కువగా ఉంటుందని.. మరికొద్దిరోజుల్లో వర్షకాలం వస్తోన్నందున ఆందోళన నెలకొంది. వర్షం కురవడంతో.. వాతావరణం చల్లబడుతోంది. దీంతో వైరస్ మరింత వేగంగా వ్యాపించే అవకాశం ఉంది. వీలైనంత మేర వేసవిలోనే కేసులు తగ్గితే బాగుంటుందని అనుకొన్నారు. కానీ క్రమేణా కేసులు పెరగడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది.

English summary
another three days 43 to 45 degree temperature will be record in telangana state weather officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X