హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణాలో 6 రెడ్ జోన్, 18 ఆరెంజ్ , 9 గ్రీన్ జోన్ జిల్లాలు .. కేంద్రం ఆంక్షలు, సడలింపులు ఇవే

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తుంది. తీరని ప్రాణ, ఆర్ధిక నష్టాన్ని కలిగిస్తున్న మొదట కరోనా దెబ్బకు విలవిలలాడిన ఇండియా క్రమంగా తట్టుకుని నిలబడే స్థితికి చేరుకుంది. ఇప్పటికే నెల రోజులకు పైగా విధించిన లాక్ డౌన్ తో ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బ తింటన్నాయని భావించిన కేంద్ర సర్కార్ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తుంది. అన్ని రాష్ట్రాలలోని కరోనా ప్రభావిత ప్రాతాలను రెడ్ జోన్స్ గా, కాస్త ప్రభావం ఉన్న ప్రాంతాలను ఆరెంజ్ జోన్స్ గా,అలాగే కరోనా ప్రభావం లేని ప్రాంతాలను గ్రీన్ జోన్స్ గా విభజించి వారికి కొన్ని సడలింపులు, ఆంక్షలు విధించింది కేంద్ర సర్కార్. ఇక తెలంగాణా రాష్ట్రం విషయానికి వస్తే

 రెడ్ జోన్ జిల్లాలు ఇవే ... కొనసాగుతున్న ఆంక్షలు

రెడ్ జోన్ జిల్లాలు ఇవే ... కొనసాగుతున్న ఆంక్షలు

రెడ్ జోన్ లో .. హైదరాబాద్‌, వికారాబాద్‌,రంగారెడ్డి, మేడ్చల్‌, సూర్యాపేట,వరంగల్‌ అర్బన్‌ జిల్లాలు ఉన్నాయి. ఇక కేంద్రం తాజా మార్గ దర్శకాల ప్రకారం రెడ్ జోన్ లలో సైకిల్‌ రిక్షాలు, ఆటో రిక్షాలు, టాక్సీలు, క్యాబ్‌లకు అనుమతి లేదని పేర్కొంది. జిల్లాలోపలగానీ, జిల్లా బయటకుగానీ బస్సులు తిరగకూడదని పేర్కొంది. సెలూన్లు, స్పాలు మూసేయాలని నిర్దేశించింది . రెడ్‌ జోన్‌లలో సడలింపుల విషయానికి వస్తే అత్యవసరాలకు మాత్రమే అనుమతి ఇస్తారు .

 రెడ్ జోన్స్ లో సడలింపులు ఇవే

రెడ్ జోన్స్ లో సడలింపులు ఇవే


మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలోని అన్ని మాల్స్‌ మూసివెయ్యాలి. కానీ అత్యవసర సరుకులను అమ్ముకునే షాపుల వరకు అనుమతి ఉంటుంది .అత్యవసరాలకు మాత్రమే ఈ కామర్స్ సంస్థలకు అనుమతి ఉంటుంది. కార్లు కేవలం ఇద్దరు వ్యక్తులతో తిరగొచ్చు, బైక్‌ పై ఒక్కరే ప్రయాణించాలి. 33శాతం సిబ్బందితో ప్రైవేటు ఆఫీసుల నిర్వహించుకోవచ్చు. ప్రభుత్వ ఆఫీసులన్నీ కేవలం 33 శాతం సిబ్బందితో పనిచేయవచ్చు అని రెడ్ జోన్స్ లో కొన్ని పరిమితులను పేర్కొంటూ కొన్ని సడలింపులు ఇచ్చింది కేంద్రం .

ఆరెంజ్ జోన్ లో 18 జిల్లాలు ... ఆంక్షలు , సడలింపులు

ఆరెంజ్ జోన్ లో 18 జిల్లాలు ... ఆంక్షలు , సడలింపులు

ఆరెంజ్‌ జోన్‌లో.. సంగారెడ్డి, కామారెడ్డి, ఆసిఫాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, నిజామాబాద్‌, గద్వాల్ , నిర్మల్‌, నల్లగొండ, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాల్‌పల్లి, మెదక్‌, జనగాం, నారాయణ్‌పేట్‌, మంచిర్యాల జిల్లాలు ఉన్నాయి. ఇక ఇక్కడ కూడా కొన్ని పరిమితులు విధించింది కేంద్ర సర్కార్ . ఆరెంజ్ జోన్ లలో ఉన్న జిల్లాల లోపల, జిల్లాల బయటకు బస్సుల ప్రయాణాలపై నిషేధం విధించింది . ఒక డ్రైవర్, ఇద్దరు ప్రయాణికులతో మాత్రమే క్యాబ్‌లను అనుమతిస్తారు. ఇక జిల్లాల్లో వాహనాలు తిరిగేందుకు పర్మిషన్ ఉన్న వాటిని మాత్రమే అనుమతిస్తారు . అత్యవసరాలకు మాత్రమే అనుమతి ఇస్తారు.

గ్రీన్ జోన్ లో 9 జిల్లాలు , సడలింపులు ఇవే

గ్రీన్ జోన్ లో 9 జిల్లాలు , సడలింపులు ఇవే

ఇక గ్రీన్‌ జోన్‌లో..వరంగల్‌ రూరల్‌, పెద్దపల్లి, నాగర్‌కర్నూల్‌, మహబూబాబాద్‌, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట ,యాదాద్రి భువనగిరి, వనపర్తి జిల్లాలు ఉన్నాయి. రెడ్ జోన్స్ , ఆరెంజ్ జోన్స్ కు అతీతంగా ఇక్కడ సడలింపులు ఉన్నాయి. జోన్లకు అతీతంగా కేంద్రం విధించిన నియమాలు తప్ప మిగతా వాటికి అనుమతి ఉంటుంది.
50 శాతం సీట్ల సామర్థ్యంతో బస్సులు ప్రయాణించవచ్చు. బస్సు డిపోలు 50శాతం సిబ్బందితో బస్సులు కూడా నడుపుకోవచ్చు.

కేంద్రం ఇచ్చిన మార్గ దర్శకాలపై స్థానిక పరిస్థితి బట్టే తెలంగాణా నిర్ణయం

కేంద్రం ఇచ్చిన మార్గ దర్శకాలపై స్థానిక పరిస్థితి బట్టే తెలంగాణా నిర్ణయం

కేంద్రం రెడ్ జోన్లు, ఆరెంజ్ జోన్లు, గ్రీన్ జోన్లు గా విభజించి పరిమితులు విధించి , అలాగే సడలింపులను కూడా ప్రకటించింది. అయితే కేంద్రం ఇచ్చిన మార్దార్శకాలను, విబ్దిహ రాష్ట్రాలు అక్కడ తాజా పరిస్థితిని బట్టి ఆయా రాష్ట్రాల విచక్షణాధికారం మేరకు పరిమితులు, సడలింపులపై నిర్ణయం తీసుకునే వెసులు బాటు ఉంది. ఇక ఈ నేపధ్యంలో కేంద్రం ప్రకటించిన జాబితా విషయంలో , అలాగే పరిమితులు, సడలింపుల విషయంలో తెలంగాణా సర్కార్ ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి .

English summary
With the lockdown already imposed for more than a month, the central government, which is expected to hurt people's living standards, is stepping up to key decisions. The Central Sarkar has imposed some relaxation and sanctions on those states by dividing the corona-affected areas in all states into Red Zones, Orange Zones, as well as Green Zones. When it comes to the state of Telangana center announced 6 Red Zone , 18 Orange and 9 Green Zones and also given the restrictions and relaxations .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X