హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వామ్మో 657 ఓట్లు గల్లంతు.. ఓటేసేందుకు వచ్చి వెనుదిరిగిన జనం.. ఎక్కడంటే..

|
Google Oneindia TeluguNews

గ్రేటర్ పోలింగ్ జరుగుతోంది. అయితే చాలా చోట్ల పోలింగ్ మందకోడిగా సాగుతోంది. ఇక జియాగూడలో అయితే భారీ సంఖ్యలో ఓట్లు గల్లంతయ్యాయి. ఇటు ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసే కూకట్ పల్లిలో కూడా వయోజనులు లేక పోలింగ్ స్టేషన్లు మూగబోయి కనిపిస్తున్నాయి. అక్కడ పోలీసులు, సిబ్బంది మాత్రమే కెమెరాలకు చిక్కారు. ఓటర్లు మాత్రం భూతద్దం పెట్టి చూసిన కానరావడం లేదు.

ఓటేసేందుకు వస్తే..

ఓటేసేందుకు వస్తే..

జియాగూడలో విచిత్ర పరిస్థితి నెలకొంది. సిటీలో జనాలు ఓటు వేసేందుకు రావడం లేదు. కానీ 38వ పోలింగ్ బూత్ వద్దకు భారీగా ఓటర్లు వచ్చారు. కానీ ఏం లాభం.. వారి ఓట్లు లేవు. బూత్‌లో 914 ఓట్లు ఉన్నాయి. దానికి సంబంధించి అందరికీ ఓటర్ స్లిప్ కూడా పంచారు. అవీ పట్టుకొని రెండు కాలనీలకు చెందినవారు వచ్చారు. అయితే 657 మంది ఓట్లు లేవు. దీంతో నోరెళ్లబెట్టడం వారి వంతయిపోయింది. తమ ఓటు ఎందుకు లేదు అని వారు అడిగారు.

257 మందికే ఓటు..

257 మందికే ఓటు..

తమకు ఓటర్ స్లిప్పులు కూడా ఇచ్చారని చూపించారు. కానీ తుది జాబితాలో మాత్రం పేర్లు లేదు. దీంతో ఓటు వేసేందుకు అధికారులు అనుమతించలేదు. అంటే కేవలం 257 మందిని మాత్రమే అనుమతించబోతున్నారు. ఈ స్థాయిలో ఓట్లు గల్లంతవడం ఆందోళన కలిగిస్తోంది. ఆడపా దడపా పది పరక ఓట్లయితే.. గల్లంతవుతాయి.. కానీ ఓకే పోలింగ్ స్టేషన్ వద్ద వందల ఓట్లు గల్లంతవడం ఇదే తొలిసారి.

Recommended Video

GHMC Elections 2020: KTR Casts His Vote ! Oneindia Telugu
మరో 30 ఓట్లు కూడా

మరో 30 ఓట్లు కూడా

దీంతోపాటు మూసాపేట్, జనతానగర్, కూకట్ పల్లిలో కూడా 30 వరకు ఓట్లు గల్లంతయ్యాయి. ఇటు కూకట్ పల్లి బాలాజీ నగర్ పోలింగ్ స్టేషన్ వద్ద విచిత్ర పరిస్థితి నెలకొంది. తొలి మూడు గంటల్లో కేవలం 100 మంది లోపు ఓటు హక్కు వినయోగించుకున్నారు. భాగ్యనగర వాసులు బద్దకం వీడటం లేదు అనే ఆరోపణలు వస్తున్నాయి. కేవలం 4.2 శాతం మాత్రమే పోలింగ్ జరిగింది. గతంలో కూకట్ పల్లిలో మొత్తంగా 75 శాతం పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే.

English summary
657 votes missing in ziaguda division range. only 257 voters names are officials shown.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X