హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఇలా .. ప్రగతి భవన్ లో కేసీఆర్ , సిరిసిల్లలో కేటీఆర్

|
Google Oneindia TeluguNews

74 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈసారి కరోనావ్యక్తి నేపథ్యంలో, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ రాష్ట్రంలో నిరాడంబరంగా జరిగాయి. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో జాతీయ పతాక ఆవిష్కరణ గావించి గౌరవ వందనం చేశారు.మహనీయుల చిత్రపటం వద్ద నివాళులర్పించిన కేసీఆర్, దేశం కోసం వారు చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సి ఎస్ సోమేష్ కుమార్, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ , డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Recommended Video

AP CM Jagan, CM KCR, Pawan Kalyan's #IndependenceDay2020 Celebrations || Oneindia Telugu

నిరాడంబరంగా స్వాతంత్ర్య వేడుకలు ..ప్రగతి భవన్ లో కేసీఆర్ ..

సిరిసిల్లలో కేటీఆర్ ప్రగతి భవన్ లో కేసీఆర్ పతాకావిష్కరణ గావిస్తే సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ 74 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.కరోనా మహమ్మారి నేపద్యంలో ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్న, కరోనా బాధితులకు సేవలందిస్తున్న వైద్యులను, వైద్య సిబ్బందిని గుర్తించాలని ఆయన పేర్కొన్నారు . కరోనా కారణంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిరాడంబరంగా జరుపుకోవాల్సి వస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు కేటీఆర్ .

జగిత్యాలలో కొప్పుల , నిర్మల్ లో అల్లోల .. మెదక్ లో తలసాని

జగిత్యాలలో కొప్పుల , నిర్మల్ లో అల్లోల .. మెదక్ లో తలసాని

జగిత్యాల లో మంత్రి కొప్పుల ఈశ్వర్ జెండా ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు నిర్మల్ కలెక్టరేట్ కార్యాలయంలో రాష్ట్ర అటవీ ,పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి జెండాను ఆవిష్కరించారు.

ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ 74 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు .మెదక్ జిల్లాలో జిల్లాలో 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్‌ కార్యాలయంలో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జాతీయజెండా ఆవిష్కరించారు . సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ సంక్షేమం, అభివృద్ధి దిశగా వెళ్తోంది. గత పాలకులు తెలంగాణ అభివృద్ధి నిర్లక్ష్యం చేశారని ఆయన అన్నారు .

ఖమ్మంలో పువ్వాడ ... అందరి నోటా తెలంగాణా పాలనపై కితాబు

ఖమ్మంలో పువ్వాడ ... అందరి నోటా తెలంగాణా పాలనపై కితాబు

రాష్ట్ర ఆవిర్భావంతో పల్లెలు ప్రగతి పథంలో ముందుకు నడుస్తున్నాయి అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ ప్రకటన చూస్తే అనేక రాష్ట్రాలు ముఖ్యమంత్రి కెసిఆర్ పథకాలు కాపీ కొడుతున్నారని ఆయన మాట్లాడారు .ఒకప్పుడు తెలంగాణ పరిస్థితి ప్రస్తుత తెలంగాణ పరిస్థితి మధ్య చాలా వ్యత్యాసం ఉందన్న మంత్రి అజయ్ కుమార్ తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్నారని పేర్కొన్నారు.

English summary
The 74th Independence Day celebrations were held modestly in the state of Telangana due to corona and heavy rains . CM KCR paid homage at the unveiling of the national flag at Pragati Bhavan. KCR paid tributes at the portrait of the freedom fighters and remembered the sacrifices they made for the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X