కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణ, రౌస్ బౌల్ ఆఫ్ తెలంగాణగా కరీంనగర్: మంత్రి ఈటెల

|
Google Oneindia TeluguNews

కరీంనగర్ సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణ, రౌస్ బౌల్ ఆఫ్ తెలంగాణగా మారబోతుందని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మిడ్‌ మానేర్‌ కింద గల 77 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. మొక్కజోన్న స్థానంలో కంది పంట వేయాలని నిర్ణయించామని తెలిపారు. ఇదివరకు కాకతీయ కాలువ నుంచి చెరువు నింపుకోవాలని ప్రయత్నిస్తే రైతుల మీద కేసులు పెట్టిన సందర్భాన్ని మంత్రి గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణగా మారబోతుందని తెలిపారు. బుధవారం కరీంనగర్‌లో వ్యవసాయంపై సమీక్ష నిర్వహించారు.

57% కేసులు మహారాష్ట్ర నుంచే, 6 రోజుల్లో 237 మందికి వైరస్, కర్ణాటకలో కరోనా వైరస్ కలవరం..57% కేసులు మహారాష్ట్ర నుంచే, 6 రోజుల్లో 237 మందికి వైరస్, కర్ణాటకలో కరోనా వైరస్ కలవరం..

ఎస్‌ఆర్‌ఎస్పీ వరద కాలువతో చివరి భూములకు నీరు అందేలా ఇరువైపులా చెరువులు/ కుంటలు నింపాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. ఎల్ఎండి ఎగువన గల ఎస్‌ఆర్‌ఎస్పీ కాకతీయ కాలువ నుంచి చెరువులు నింపేలా తూములు ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ అంగీకరించారని వివరించారు. ఎల్ఎండీ దిగువన కాకతీయ కాలువకు తూములు పెట్టి చెరువులను నింపుతామ‌న్నారు. దీంతో భూగర్భ జలాలు పెరిగి ఎండాకాలంలో సాగు, తాగునీటికి కొరత ఉండదని భరోసాగా చెప్పారు.

77 thousand acres will be cultivate in mid manair..

రూ.వెయ్యి కోట్లతో ఎస్‌ఆర్‌ఎస్పీ కాలువకు మరమ్మతులు చేసి 6 వేల క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచామ‌ని మంత్రి ఈటల రాజేందర్ గుర్తుచేశారు. వేసవిలో పారుతున్న వాగులపై చెక్ డ్యాంలు నిర్మిస్తున్నామ‌ని , ఈ ప్రక్రియ ఆరునెలల్లో పూర్తవుతోందని తెలిపారు. ఆయకట్టు చివరి ఎకరానికి నీరివ్వాలన్నదే త‌మ ప్రభుత్వ లక్ష్యమని ఈటల రాజేందర్ తెలిపారు.

English summary
77 thousand acres will be cultivated in mid manair minister etela rajendar said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X