• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

షాకింగ్:Hyderabad Zoo Parkలో పానిక్ -8సింహాలకు Covid పాజిటివ్ -దేశంలో తొలిసారి -మనుషుల నుంచే సోకిందా

|

దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి ఉధృతంగా సాగుతూ వేల మంది బలైపోతుండగా, ఇప్పుడు జంతువులు సైతం ముప్పు ముంగిట నిలిచాయి. భారత్‌లో తొలిసారిగా జంతువులకూ కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడం కలకలం రేపుతున్నది. అది కూడా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లోనే వెలుగులోకి రావడం ఆందోళనను రెట్టింపు చేసింది. హైదరాబాద్ లోని ప్రఖ్యాత నెహ్రూ జూలాజికల్ పార్క్ అధికారులు, సిటీ కేంద్రంగా పనిచేసే సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) వర్గాల ద్వారా వెల్లడైన షాకింగ్ వివరాలివి..

భారత్‌లో ఫైజర్ వ్యాక్సిన్: సంచలన అడుగు -అతిపెద్ద కొవిడ్ సాయం -మోదీ సర్కార్ తాత్సారం, ఎవరికోసం?భారత్‌లో ఫైజర్ వ్యాక్సిన్: సంచలన అడుగు -అతిపెద్ద కొవిడ్ సాయం -మోదీ సర్కార్ తాత్సారం, ఎవరికోసం?

8 సింహాలకు కరోనా పాజిటివ్

8 సింహాలకు కరోనా పాజిటివ్

హైదరాబాద్ లోని నెహ్రూ జులాజికల్ పార్కు సఫారీలో ఉన్న 8 సింహాలకు కరోనా వైరస్ సోకింది. కొద్ది రోజులుగా కొవిడ్ వ్యాధి లక్షణాలైన దగ్గు, జలుబు, నీరసంతో బాధపడుతోన్న సింహాలకు టెస్టులు చేయించగా ఈ విషయం బయటపడింది. సింహాల నుంచి స్వాబ్ సేకరించి, ఆర్టీ-పీసీఆర్ విధానంలో పరీక్షలు చేయగా పాజిటివ్ రిపోర్టు వచ్చింది. వణ్యప్రాణులు వైరస్ కాటుకు గురైనట్లు వెల్లడి కావడం దేశంలో ఇదే తొలిసారి కావడంతో యంత్రాంగమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హైదరాబాద్ జూపార్కులో అధికారులు పానిక్ అలారం మోగించగా, అసలు సింహాలకు ఇన్ఫెక్షన్ ఎలా సోకిందనే విషయాన్ని సీసీఎంబీ పరిశోధిస్తున్నది..

కేసీఆర్‌..చావునైనా భరిస్తా, నిన్ను క్షమించ -వైఎస్సార్‌కే భయపడలే, రాజీనామా చేస్తా -గుట్టు విప్పిన ఈటల రాజేందర్కేసీఆర్‌..చావునైనా భరిస్తా, నిన్ను క్షమించ -వైఎస్సార్‌కే భయపడలే, రాజీనామా చేస్తా -గుట్టు విప్పిన ఈటల రాజేందర్

దేశంలో తొలిసారి జంతువులకు..

దేశంలో తొలిసారి జంతువులకు..

కరోనా వైరస్ తొలి వేవ్ సందర్భంలో గతేడాది అమెరికా(న్యూయార్క్)లోని బ్రోంక్స్ జూపార్కులో ఎనిమిది పులులు, సింహాలు వైరస్ కాటుకు గురయ్యాయి. అదే సమయంలో హాంకాంగ్ లో కుక్కలు, పిల్లుల వంటి పెంపుడు జంతువులు కూడా ఇన్ఫెక్ట్ అయినట్లు రిపోర్టులు వచ్చాయి. అయితే, భారత్ లో మాత్రం ఇంత పెద్ద సంఖ్యలో జంతువులు ఒకేసారి కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ కావడం ఇదే తొలిసారి. ఏప్రిల్ 24న సింహాల నమూనాలను టెస్టులకు పంపగా, పాజిటివ్ రిపోర్టు వచ్చిందని, అప్పటి నుంచి జాతీయ స్థాయిలో వివిధ సంస్థల మధ్య దీనిపై తీవ్ర చర్చోపచర్చలు జరుగుతున్నాయని నెహ్రూ జూపార్క్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆ సింహాల ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రమాదకర పరిస్థితులేవీ లేవని అధికారులు చెప్పారు. అయితే,

మనుషుల ద్వారా సింహాలకు సోకిందా?

మనుషుల ద్వారా సింహాలకు సోకిందా?

కరోనా వైరస్ గాలి ద్వారానూ వ్యాప్తి చెందుతోందనడానికి ఇటీవల రుజువులు కూడా లభించిన దరిమిలా హైదరాబాద్ జూ పార్క్ లోని సింహాలకు కరోనా వైరస్ ఎలా సోకిందనే విషయాన్ని సీసీఎంబీ శాస్త్రవేత్తలు పరిశోధిస్తున్నారు. నెహ్రూ జూపార్క్ సిబ్బందిలో 25 మందికి ఇటీవలే కరోనా సోకినట్లు తెలియడంతో, ఏమరుపాటుగానే వారి ద్వారా జంతువులకు వైరస్ సోకిందా అనే కోణంలో శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు. సిహాలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన తర్వాత కేంద్ర పర్యావరణ, అటవీ సంరక్షణ శాఖ, సెంట్రల్ జూ అథారిటీ, సీసీఎంబీలు రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. ఒకవేళ మనుషుల ద్వారానే జంతువులకు వైరస్ సోకినట్లు నిర్ధారణ అయితేగనుక జనావాసాల మధ్యలో ఉన్న హైదరాబాద్ జూపార్కుకు మరిన్ని ఇబ్బందులు తప్పవు. కొవిడ్ ఉధృతి నేపథ్యంలో నెహ్రూ జూపార్క్ సహా రాష్ట్రంలోని అన్ని జూ పార్క్ లు, పులుల అభయారణ్యాలు, జాతీయ ఉద్యాన వనాలను మూసివేస్తున్నట్లు తెలంగాణ అటవీ శాఖ మే1న ఉత్తర్వులిచ్చింది.

English summary
In perhaps the first such case in the country, eight Asiatic lions at the Nehru Zoological Park (NZP) in Hyderabad have tested positive for Covid-19. it is learned that the Centre for Cellular and Molecular Biology (CCMB) orally told NZP officials that the RT-PCR tests of these lions were positive. CCMB scientists will do genome sequencing to find out whether this strain of the virus has come to the animals from human beings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X