8 వేల మంది రైతుల ఆత్మ బలిదానం: గట్టు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలు కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్ టీపీ రాష్ట్ర నేత గట్టు రామచంద్రరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏడున్నరేళ్లలో సుమారు 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఫైరయ్యారు. వ్యవసాయరంగం కుదేలైన సమయంలోనే ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతాయని.. రైతును ఆదుకోవాల్సిన, భద్రత కల్పించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనని చెప్పారు. కానీ అవి పట్టించుకోవడం లేదని ఫైరయ్యారు.
దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాట ఆడుతున్నాయని మండిపడ్డారు. రైతులు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని.. మీకు అండగా వైఎస్సార్ టీపీ అండగా ఉందని చెప్పారు. కలిసి పోరాడుదాం అని భరోసాను ఇచ్చారు. ప్రభుత్వం వరి వద్దని చెబుతోంది. రైతుకు ప్రత్యామ్నాయ పంటలపై మాత్రం అవగాహన కల్పించడంలేదన్నారు. రైతు బీమా, రైతు బంధు అందరికీ అందడంలేదని ఆరోపణలు చేశారు.

రైతులకు
భరోసా
కల్పించేందుకు
రైతు
ఆవేదన
యాత్ర
చేపడుదామంటే
కొవిడ్
నిబంధనల
పేరుతో
అడ్డుకంటున్నారని
మండిపడ్డారు.
ఈ
నిబంధనలు
కొందరికే
వర్తిస్తాయని
రాష్ట్ర
ప్రభుత్వంపై
మండిపడ్డారు.
రైతులు
ధాన్యం
కుప్పలపైనే
ప్రాణాలు
ఒదులుతున్నారని
చెప్పారు.
కౌలురైతులు
తీవ్ర
ఇబ్బందులు
పడుతున్నారని..
ప్రజలకు
న్యాయం
చేస్తే
ప్రభుత్వానికే
మంచి
పేరు
వస్తుంది
కదా?
మరి
ఎందుకు
చేయడం
లేదన్నారు.
కౌలు రైతులకు కూడా రైతుబంధు, రైతు బీమా, 15 రోజులు దాటకుండానే రైతుబీమా డబ్బులు కౌలు రైతుకు కూడా పడాలని కోరారు. 59 ఏండ్లు దాటిన రైతులకు బీమా ఇవ్వడం లేదన్నారు. వారికి ఇవ్వాల్సిన బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించాలని సూచించారు. 11 మంది రైతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా అందించాలని కోరారు. ఇండ్లు లేని వారికి డబుల్ ఇండ్లు కట్టించాలని సూచించారు. పురుగు మందు పురుగును చంపట్లేదు.. మనుషుల్ని మాత్రం చంపుతోంది. నకిలీ విత్తనాల వల్ల చెట్లు ఏపుగా పెరుగుతాయి కానీ గింజ కూడా రాదన్నారు. ప్రభుత్వం ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.