హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

80 సీట్లు గెలుస్తాం.. మేయర్ పీఠం మాదే..?, గ్రేటర్ ఎన్నికలపై బీజేపీ ధీమా

|
Google Oneindia TeluguNews

గ్రేటర్ ఎన్నికల సమయం ఆస్నమవుతోంది. నవంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలతో ఇటీవల మంత్రి కేటీఆర్ సమావేశమైన సంగతి తెలిసిందే. ఇటు బీజేపీ కూడా ఎన్నికలపై కసరత్తు చేస్తోంది. అయితే మేయర్ పీఠంపై ప్రధాన పార్టీలు ఫోకస్ చేశాయి. తామంటే తాము మెజార్టీ స్థానాలు గెలుస్తామనే ధీమాతో టీఆర్ఎస్, బీజేపీ ఉన్నాయి.

గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ విజయదుందుబి మోగిస్తోందని ఆ పార్టీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ధీమాతో ఉన్నారు. తమ పార్టీ 80 సీట్లలో గెలుస్తోందని చెప్పారు. సర్వేలు ఇదే అంశాన్ని చెబుతున్నాయని పేర్కొన్నారు. ఇదివరకు విజయం సాధించిన కార్పొరేటర్ల మీద ప్రజలకు మంచి అభిప్రాయం లేదని చెప్పారు. అందుకోసమే ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు చేస్తున్నాయని తెలిపారు.

80 seats will win in ghmc elections: bjp

గత ఐదేళ్లలో టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్‌కు చేసిందేమీ లేదని రామచంద్రరావు విమర్శించారు. అభివృద్ధి పేరుతో రూ.60 వేల కోట్లు మెక్కారని ఆయన ఆరోపించారు. చిన్న వర్షం కురిస్తే చాలు హైదరాబాద్ అస్తవ్యస్తం అవుతుందని తెలిపారు. గత పాలకులు ఏం చేయలేరు అని కామెంట్స్ చేసి కాలం వెళ్లారని మండిపడ్డారు. డెవలప్ మెంట్‌పై మంత్రులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు.

15 మంది కార్పొరేటర్ల పనితీరు బాగోలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. నిర్లక్ష్యం తగదని హెచ్చరించారు. సమస్యలు ఉంటే.. ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. కానీ మిన్నకుండిపోవడం సరికాదన్నారు. కరోనా వైరస్, ఆర్థిక మాంద్యంతో ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలు మాత్రం ఆగడం లేదు అని కేటీఆర్ తెలిపారు. ఇవే అంశాలను ప్రజలకు వివరించాలని కోరారు. మంత్రులు, ఎమ్మెల్యేల జీతాల్లో కోతలు విధించామని చెప్పారు. సంక్షోభాన్ని అలా నెట్టుకొస్తున్నామని తెలిపారు.

English summary
80 seats will win in ghmc elections bjp mlc ramachandra rao said. he slams ministers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X