హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

9 వేల 248 పోలింగ్ కేంద్రాలు..21వ తేదీన ప్రకటన.. 2 వేలకు పైగా పెరిగిన సెంటర్స్.. ఎందుకంటే..

|
Google Oneindia TeluguNews

బల్దియా పోరుకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. రేపటినుంచి నామినేషన్ల ఘట్టం ప్రారంభమవబోతోంది. ఇక పోలింగ్ కేంద్రాలపై ఎన్నికల సంఘం దృష్టిసారించింది. కరోనా వైరస్ వల్ల బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. భౌతిక దూరం నేపథ్యంలో.. తక్కువ వయోజనులతో పోలింగ్ కేంద్రాలు కూడా పెరిగి అవకాశం ఉంది. గతంతో పోలిస్తే దాదాపు 2 వేలకు పైగా పోలింగ్ స్టేషన్లు పెరిగే ఛాన్స్ ఉంది.

2016 ఎన్నికల్లో 6,900 పోలింగ్‌ కేంద్రాలతో ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి 9,248 కేంద్రాలను గుర్తించారు. దీనికి సంబంధించి ముసాయిదా జాబితాను జీహెచ్‌ఎంసీ ప్రకటించింది. గతంలో 1,400 మంది ఓటర్లకు ఒక పోలింగ్‌ కేంద్రం ఉండగా.. ఈ సారి వెయ్యి మందికి పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ ముసాయిదాపై అభ్యంతరాలు, ఫిర్యాదులు, సలహాలు స్వీకరిస్తారు. 18వ తేదీన అభ్యంతరాలు, ఫిర్యాదుల పరిశీలన పూర్తి చేసి.. 19వ తేదీన తుది జాబితాను ఎన్నికల అధికారికి పంపిస్తారు.

9248 polling centres in ghmc elections

ఈ నెల 21వ తేదీన వార్డులవారీగా తుది జాబితా ప్రకటిస్తారు. 70 వేల మంది ఓటర్లు ఉన్న కొండాపూర్‌ వార్డులో అత్యధికంగా 99 పోలింగ్ కేంద్రాలు ఉంటాయి. 27 వేలకు పైగా ఓటర్లు మాత్రమే ఉన్న ఆర్‌సీపురంలో 33 పోలింగ్‌ కేంద్రాలు ఉండే అవకాశం ఉంది.

Recommended Video

భారత్‌పై Barack Obama ప్రశంసలు.. 'A Promised Land' పుస్తకంలో ఆసక్తికర విషయాలు ప్రస్తావన!

వీటితోపాటు కాప్రా-312, ఉప్పల్‌-203, హయత్‌నగర్‌-290, ఎల్‌బీనగర్‌-218, సరూర్‌నగర్‌-338, మలక్ పేట్-443, సంతోష్ నగర్‌ -383, చాంద్రాయణగుట్ట-371, చార్మినార్‌-291 ఫలక్ నూమా-291, రాజేంద్రనగర్‌-316, మెహిదీపట్నం-429, కార్వాన్‌-342, గోషామహల్‌-329, ముషీరాబాద్‌-430, అంబర్‌పేట-370, ఖైరతాబాద్‌-254 జూబ్లీహిల్స్‌-267, యూసుఫ్ గూడ-330, శేరిలింగంపల్లి-265, చందానగర్‌-350, ఆర్‌సీపురం, పటాన్‌చెరు-120, మూసాపేట-361, కూకట్‌పల్లి-465, కుత్బుల్లాపుర్‌-245, గాజుల రామారం-203, అల్వాల్‌-160, మల్కాజ్‌గిరి-319, సికింద్రాబాద్‌-289, బేగంపేట-256లో పోలింగ్ కేంద్రాలు ఉండనున్నాయి.

English summary
9248 polling centres in ghmc elections official indicates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X