హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

99శాతం మంది సేఫ్: రెండు డోసులే శ్రీ రామరక్ష: డీహెచ్

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ ఉధృతి కాస్త తగ్గింది. వేసవిలోనే ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ 3 కోట్లకు చేరువలో ఉందని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 99 శాతం సేఫ్ జోన్ లో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో 36 లక్షల మంది ఇంకా రెండో డోస్ తీసుకోవాల్సి ఉందన్నారు. మొదటి డోస్ 70 శాతానికి పైగా పూర్తైందన్నారు. సెకండ్ డోస్ 39 శాతం పూర్తైందని తెలిపారు. మరోవైపు 0.7 శాతం పాజిటివిటీ రేట్ నమోదవుతోందని చెప్పారు. వ్యాక్సిన్ తీసుకోని వారిలో 60 శాతం మంది కరోనా బారిన పడుతున్నారని వెల్లడించారు. ఒక డోస్ తీసుకున్న వారిలో 30శాతం మంది కరోనా బారిన పడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు నమోదవుతున్న కేసుల్లో సింగిల్ డోస్ తీసుకున్న వారే ఎక్కువ ఉన్నారని తెలిపారు.

ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. వైరస్‌ను జయించేందుకు రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు. దీనిపై ప్రకటన రాలేదు.

99 percent people are safe who take 2 doses vaccine

Recommended Video

Germany: Pilots Return To Work To Cover Tourism Demand

ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు డిసెంబర్ వరకు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. జనవరి నుంచి ఏప్రిల్ వరకు థర్డ్ వేవ్ ఇంపాక్ట్ ఉంటుందని హెచ్చరిస్తున్నారు. దానిని దాటేస్తే గానీ.. పరిస్థితి ఏంటో చెప్పలేమని ఒకవిధంగా వార్నింగ్ ఇస్తున్నారు.

English summary
99 percent people are safe who take 2 doses vaccine dh srinivasa rao said in the statement
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X