హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విషాదం: గో కార్టింగ్ ప్రమాదంలో బీటెక్ విద్యార్తిని మృతి, అర్ధరాత్రి ఆటలా?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గో కార్టింగ్ సరదా ఓ బీటెక్ విద్యార్థిని బలితీసుకుంది. ఈ ఘటన నగర శివారులోని గుర్రంగూడలో చోటు చేసుకుంది. తన స్నేహితులతో కలిసి గోకార్టింగ్ ప్లే జోన్‌కి వెళ్లింది బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని శ్రీ వర్షిణి . తన స్నేహితులతో కలిసి షికారు చేద్దామనుకుంది.

స్నేహితులతో సరాదా గో కార్టింగ్..

స్నేహితులతో సరాదా గో కార్టింగ్..

తన స్నేహితుడు కారు డ్రైవింగ్ చేస్తుండగా.. శ్రీ వర్షిణి పక్కనే కూర్చుంది. కాగా, కాస్త దూరం వెళ్లిన కారు ఒక్కసారిగా అదుపుతప్పి శ్రీ వర్షిణి కి తీవ్రగాయాలయ్యాయి. దీంతో తన స్నేహితులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెలితే.. మీర్‌పేటకు చెందిన శ్రీ వర్షిణి తన స్నేహితులతో కలిసి గో కార్టింగ్ వెళ్లింది. తన స్నేహితుడితో కలిసి కారులో కూర్చుని ట్రాక్‌లో ప్రయాణం ప్రారంభించారు. ఒక్కసారిగా కారు ప్రమాదానికి గురైంది.

తల వెంట్రుకలు కారు టైరుకు చుట్టుకోవడంతో..

తల వెంట్రుకలు కారు టైరుకు చుట్టుకోవడంతో..


శ్రీ వర్షిణి తల వెంట్రుకలు కారు చక్రంలో చుట్టుకుపోవడంతో హెల్మెట్ ఒక్కసారిగా పడిపోయింది. ఆ తర్వాత అమ్మాయి కూడా కింపడింది. దీంతో శ్రీవర్షిణికి తలకు బలమైన గాయాలు అయ్యాయి. వెంటనే ఆమెను స్నేహితులు ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.

Recommended Video

Sonu Sood Helps A Tribal Girl In Chhatisgarh
ప్రాణాలు కోల్పోయిన శ్రీవర్షిణి.. అర్ధరాత్రి ఆటలా?

ప్రాణాలు కోల్పోయిన శ్రీవర్షిణి.. అర్ధరాత్రి ఆటలా?

ఈ క్రమంలో చికిత్స పొందుతూ శ్రీ వర్షిణి ప్రాణాలు కోల్పోయింది. శ్రీవర్షిణి తల్లిదండ్రులు గోకార్టింగ్ నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి సమయంలో గోకార్టింగ్‌కు అనుమతివ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కో కార్టింగ్ నిర్వాహకులపై నిర్లక్ష్యం వల్లనే తమ కూతురు చనిపోయిందంటూ శ్రీవర్షిణి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు దర్యాప్తు చేస్తున్నారు.

English summary
A B-tech student died in an accident at go-karting in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X