హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Crime News: 35 డైమండ్లు ఉన్న బ్యాగ్ పోయింది.. కానీ దాన్ని ఎవరూ తీయలేదు..

|
Google Oneindia TeluguNews

ఓ వ్యాపారి భార్యతో పాటు హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్లో తిగాడు.. కానీ అక్కడికి టీమిండియా ఆటగాళ్లు వచ్చారు. దీంతో హోటల్ సిబ్బంది మిగతా వారికి సరిగా సర్వీస్ చేయలేదు. దీంతో వారు హోటల్ నుంచి మరో హోటల్ కు వెళ్లారు. వారు మరో హోటల్ కు వెళ్లి చూసేసరికి వారి వద్ద ఉన్న అభరణాలు ఉన్న ఉన్న బ్యాగ్ పోయినట్లు గుర్తించారు.

వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా బ్యాగ్ దొరగ లేదు. కానీ కొద్ది రోజుల తర్వాత బ్యాగ్ దొరికింది. అయితే ఈ ఘటనలో హోటల్ తీరు అనుమానాస్పదంగా ఉంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ముంబైకి చెందిన అహ్మద్‌ బేగ్‌ అనే ఓ వ్యాపారి గత నెల 22న భార్యతో కలిసి హైదరాబాద్ వచ్చారు. వారు బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.2లోని పార్క్‌హయత్‌ హోటల్‌లో దిగారు.

A bag of gold jewelry found at Park Hyatt Hotel after 10 days

గత నెల 24వ తేదీన ఇదే హోటల్‌లో ఇండియన్‌ క్రికెట్‌ ఆటగాళ్లు బస చేశారు. దీంతో అక్కడున్న మిగతా వారికి సరైన సేవలు అందకపోవడంతో బేగ్ దంపతులు అక్కడ నుంచి వచ్చి సోమాజిగూడలోని పార్క్‌ హోటల్‌కు వెళ్లారు. ఈ క్రమంలో వారి వద్ద ఉన్న బంగారు అభరణాలు బ్యాగ్ కనిపించకుండా పోయింది. వెంటనే బేగ్‌ బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బ్యాగులో డైమండ్‌ బ్రాస్‌లైట్, 35 డైమండ్లు, డైమండ్‌ రింగ్, మంగళసూత్రం ఫిర్యాదులో పేర్కొన్నారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేశారు. అయినా బ్యాగ్ అచూకీ లభించలేదు. మరోవైపు పంజాగుట్టు పోలీసులు కూడా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇది ఇలా ఉండగా మంగళవారం బంజారాహిల్స్‌ క్రైం పోలీసలు మరోసారి పార్క్‌హయత్‌ హోటల్‌లో తనిఖీలు చేపట్టగా.. బ్యాగ్ దొరికింది. ఈ వ్యవహరంలో హోటల్ తీరు అనుమానాస్పదంగా ఉంది.

English summary
A bag of gold jewelry found at Park Hyatt Hotel. It was surprising to find the bag in the same hotel after almost 10 days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X