హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బైక్‌ నుండి పడిన యువకుడు, కారణం జీహెచ్‌ఎమ్‌సీ అధికారులంటూ... కేసు నమోదు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ జీహచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యంపై కేసు నమోదు అయింది. నగరంలో బైక్‌పై వెళుతున్న ఓ యువకుడు క్రిందపడి కాలు విరిగిపోవంతో అందుకు భాద్యత నగరపాలక సంస్థ అధికారులదే అంటూ ఫిర్యాదు చేశాడు. పంజాతాన్ కాలనీకి చెందిన సయిద్ అజ్మత్ హుస్సెన్ ఈనెల 6న రాత్రిపూట బైక్‌పై నూర్‌ఖాన్ బజార్‌ నుండి బాల్‌షెట్టి ఖేట్‌కు వెళ్తుండగా రోడ్డుపై ఉన్న గుంతలో టూవీలర్ ఒక్కసారిగా దిగబడింది. హుస్సెన్ బైక్‌పై నుండి జారీ క్రిందపడ్డాడు. దీంతో కుడికాలుకు ఎముక విరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటున్నాడు.

ఇటివల హైదరాబాద్‌లో కురిసిన వర్షాలకు ఎక్కడికక్కడ రోడ్లన్ని జలమయం కావడంతో, పలు రోడ్లు నీళ్లలో కొట్టుకుపోయి అధ్యాన్నంగా తాయారయ్యాయి.దీంతో ప్రయాణికులకు నరకం చూపిస్తున్నాయి. దీంతో టూ వీలర్‌తో పాటు, ఇతర వాహానాదారులు కూడ నరకం చూస్తున్నారు. వర్షాలు పడిన తర్వాత రోడ్లు గుంతలమయంగా మారినా వాటిని అధికారులు పట్టించుకుని పరిస్థితి. దీంతో పౌరులు తమ ప్రయాణాల్లో ఇబ్బందులకు గురి కావడంతో పాటు ప్రమాదాల భారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే హుస్సెన్ జీహెచ్‌ఎంసీ అధికారులపై స్థానిక డబీర్‌పుర పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భాదితుడి ఫిర్యాదును తీసుకున్న పోలీసులు జీహెచ్‌ఎంసీపై కేసును నమోదు చేశారు.

a case was filed against GHMC officials,of their negligence

హుస్సెన్‌కు జీహెచ్‌ఎంసీ నుండి సరైన న్యాయం జరిగే అవకాశం లేకున్నా.. నగర రోడ్ల స్థితిపై అధికారులు స్పందించే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఇందుకోసమే తనకు జరిగిన అన్యాయంతో పాటు ఇతరలకు ఈ పరిస్థితి రాకుండా తన పోరాటం కొననసాగుతుందని ఆయన చెప్పారు.

English summary
a case was filed against GHMC officials,of their negligence for road damage in dabeerpura complaint by a citizen, who fell in pothole and injured.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X