హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఘట్‌కేసర్ కిడ్నాఫ్ డ్రామా కేసు: బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యపై హెచ్ఆర్సీకి ఫిర్యాదు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఘట్‌కేసర్ బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై హైకోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ బుధవారం మానవ హక్కుల సంఘం(హెచ్ఆర్సీ)కి ఫిర్యాదు చేశారు. బుధవారం ఉదయం నిద్ర మాత్రలు, షుగర్ మాత్రలు వేసుకుని భీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

కిడ్నాప్, రేప్ డ్రామా ఆడిన బీ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య: మానసిక ఒత్తిడే కారణమా?కిడ్నాప్, రేప్ డ్రామా ఆడిన బీ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య: మానసిక ఒత్తిడే కారణమా?

అందుకే విద్యార్థిని మానసికంగా కృంగిపోయింది..

అందుకే విద్యార్థిని మానసికంగా కృంగిపోయింది..


ఈ క్రమంలో హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. అమ్మాయి జీవించే హక్కును కోల్పోయేలా పోలీసులు ప్రవర్తించారన్నారు. కిడ్నాప్ ఘటనలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి, ప్రెస్‌మీట్‌లు పెట్టడం వల్ల విద్యార్థిని మానసికంగా కృంగిపోయిందని తెలిపారు.

ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి..

ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి..


బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకుని, విద్యార్థిని కుటుంబానికి ఆర్థిక సాయం ఇవ్వాలని హెచ్ఆర్సీని అరుణ్ కుమార్ కోరారు. రాచకొండ పోలీసులపై చర్యలు తీసుకోవాలని హెచ్ఆర్సీని ఆశ్రయించినట్లు చెప్పారు. పోలీసుల తొందరపాటు చర్యల వల్ల విద్యార్థిని జీవించే హక్కును కోల్పోయిందని తెలిపారు.

ట్రోల్స్ భరించలేక..

ట్రోల్స్ భరించలేక..

ముద్దాయిలు అని పోలీసులే చెప్పి.. వారికి బహిరంగంగా క్షమాపణలు చెప్పడం ఏంటని ప్రశ్నించారు. పోలీసులు కేసు వివరాలు చెప్పడంతో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అస్తున్నాయని, వాటిని చూసి భరించలేక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. విద్యార్థిన బలవన్మరణానికి కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు.

విద్యార్థిని ఆత్మహత్య మరో కోణం

విద్యార్థిని ఆత్మహత్య మరో కోణం

కిడ్నాప్, రేప్ యత్నం డ్రామాతో సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం వారి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. మొదట మంగళవారం మొదట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది యువతి. అయితే, వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. వైద్యం అందించిన అనంతరం ఆమెను ఇంటికి పంపించారు వైద్యులు. ఇంటికి వచ్చిన యువతి మంగళవారం రాత్రి మరోసారి షుగర్ ట్యాబ్లెట్లు మింగింది. దీంతో ఘట్ కేసర్ ప్రభుత్వా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించారు. పోలీసు శాఖను తప్పుదోవ పట్టించినందుకు గానూ ఆమెకు శిక్ష పడే అవకాశముంది. కిడ్నాప్ కేసులో తనను పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయం, నలుగురిలో తాను అభాసు పాలయ్యాననే భావనతో ఆమె మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

English summary
A lawyer complains to HRC on B pharmacy girl suidie.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X