హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ ఇంటర్వ్యూలో తీన్మార్ మల్లన్న అన్ని హద్దులు దాటాడు.. డీజీపికి న్యాయవాది ఫిర్యాదు...

|
Google Oneindia TeluguNews

ప్రముఖ జర్నలిస్ట్,క్యూ న్యూస్ మీడియా అధినేత నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై ఓ న్యాయవాది డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఇటీవల ఓ అత్యాచార బాధితురాలిని తన యూట్యూబ్ చానెల్‌లో ఇంటర్వ్యూ చేసిన మల్లన్న... అందులో అన్ని రకాలుగా హద్దు మీరి మాట్లాడాడని పేర్కొన్నారు. మల్లన్నపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తూడి అరుణ కుమారి అనే న్యాయవాది ఈ ఫిర్యాదు చేశారు.

సైకోలా మల్లన్న.. : తూడి అరుణకుమారి

సైకోలా మల్లన్న.. : తూడి అరుణకుమారి

ఆ ఇంటర్వ్యూలో బాధితురాలిని మల్లన్న అడిగిన కొన్ని ప్రశ్నలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. 139 మంది నిందితులను ఎన్‌కౌంటర్ చేసేందుకు 139 బుల్లెట్లు సిద్దం చేసుకోవాలని కమిషనర్‌ను మల్లన్న సవాల్ చేయడమేంటని ప్రశ్నించారు. మల్లన్న ఓ సైకోలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. అలాగే 'దిశ' ఎన్‌కౌంటర్ ఫేక్ అని మల్లన్న వ్యాఖ్యానించడం సుప్రీంకోర్టుతో పాటు నిర్భయ చట్టాన్ని అతిక్రమించడమేనని ఆరోపించారు. మల్లన్నపై డీజీపీ మహేందర్ రెడ్డి చర్యలు తీసుకోవాలని కోరారు.

అత్యాచార కేసు....

అత్యాచార కేసు....


కొద్దిరోజుల క్రితం వెలుగుచూసిన యువతిపై 139 మంది అత్యాచారం కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో బాధితురాలి ఫిర్యాదుతో ఈ కేసు వెలుగుచూసింది. అయితే తనపై 139 మంది అత్యాచారానికి పాల్పడలేదని... రాజా శ్రీకర్ రెడ్డి అనే వ్యక్తి బలవంతం వల్లే తాను అంతమంది పేర్లు చెప్పాల్సి వచ్చిందని బాధితురాలు తర్వాత వివరణ ఇచ్చుకుంది. పలు ప్రజా సంఘాలు,సామాజిక కార్యకర్తలతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించిన బాధితురాలు తనపై 36 మంది అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపింది. మిగతావాళ్లలో కొంతమంది వేధింపులకు పాల్పడగా... కొంతమందికి అసలు కేసుతో సంబంధం లేదని స్పష్టం చేసింది.

Recommended Video

Sneha Belcin సమాజంలో జరుగుతున్న సంఘటనలపై స్నేహ బెల్సిన్ వీడియోస్ ! || Oneindia Telugu
ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో మల్లన్న...

ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో మల్లన్న...

ఇదిలా ఉంటే,త్వరలో జరగబోయే వరంగల్,ఖమ్మం,నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న పోటీ చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన యూట్యూబ్ చానెల్ ద్వారా వెల్లడించారు. గతంలోనూ ఓసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన మల్లన్న ఓటమిపాలైన సంగతి తెలిసిందే. గత ఏడాది జరిగిన హుజూర్ నగర్ ఉపఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి ఓటమిపాలయ్యారు. అయితే ఎప్పటికైనా చట్ట సభల్లోకి అడుగుపెట్టాలన్న లక్ష్యంతో ఉన్న మల్లన్న మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

English summary
Aruna Kumar,a Hyderabadi lawyer lodged a complaint against Naveen Kumar alias Teenmar Mallanna who is working as a journalist through his own youtube channel. She mentioned that in his recent interview with a rape victim he was crossed all the limits,she demanded to take action against him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X