హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పెట్రోల్ బాటిల్ తో కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ వద్ద వ్యక్తి కలకలం.. రీజన్ ఇదే

|
Google Oneindia TeluguNews

తెలంగాణ సీఎం కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ ప్రగతిభవన్ వద్ద ఓ వ్యక్తి పెట్రోల్ బాటిల్ తో హల్ చల్ చేశారు. తన సమస్యను ఎవరూ పట్టించుకోలేదని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. రవీందర్ అనే వ్యక్తి సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద పెట్రోల్ బాటిల్ తో హల్చల్ చేయడంతో అప్రమత్తమైన పోలీసులు అతనిని అరెస్ట్ చేసి వివరాలు సేకరిస్తున్నారు.

ఆర్టీసీ కార్మికులు మెట్టు దిగారు.. సీఎం కేసీఆర్ కనికరిస్తారా ?ఆర్టీసీ కార్మికులు మెట్టు దిగారు.. సీఎం కేసీఆర్ కనికరిస్తారా ?

ఇక అసలు విషయం ఏంటంటే ప్రగతి భవన్ ముందు పెట్రోల్ పార్టీతో కలకలం సృష్టించిన రవీందర్ అనే వ్యక్తి మంచిర్యాల జిల్లా కు చెందిన వాడు. 2001 నుండి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్న రవీందర్ సీఎం కేసీఆర్ పై అభిమానంతో ఆయనకు గుడి కూడా కట్టాడు. అక్కడ ఆయన ఒకవైపు నెట్వర్క్ నడుపుతున్నాడు. అయితే దానిని కొందరు వ్యక్తులు ఆక్రమించారని ఆవేదన చెందిన రవీందర్ ఈ విషయంపై ఎంపీ, ఎమ్మెల్యేకు సైతం తన గోడు వెళ్లబోసుకున్నానని చెప్పుకొచ్చారు.

A man created tension with a petrol bottle at KCR camp office ...

తన కేబుల్ టీవీ నెట్వర్క్ ని ఆక్రమించింది ఓ రౌడీ షీటర్ అని చెబుతున్న ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని పేర్కొన్నారు. దీంతో ప్రగతి భవన్ కు వచ్చి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకోవాలని భావించానని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఈ మధ్యకాలంలో తమ పనులు కాకున్నా, తమ సమస్యలు పరిష్కారం కాకుండా ఎక్కడపడితే అక్కడ పెట్రోల్ బాటిల్ లో చేత పడుతున్న నేపథ్యంలో, ప్రగతి భవన్ ముందు పెట్రోల్ బాటిల్ తో కనిపించిన వ్యక్తి పై అప్రమత్తమైన సెక్యూరిటీ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సదరు రవీందర్ ను అరెస్ట్ చేశారు.

English summary
At the Telangana CM KCR Camp Office Pragatibhavan, a man created tension with a petrol bottle. he threatened to commit suicide at the camp office as no one cared about his cable network problem. some of the persons occupied illegally in his cable network and nobody taking complaint . he decided to commit suicide near pragathi bhavan . Ravinder was arrested at the CM camp office .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X