హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొడుకు, కోడలు గెంటేశారు.. కోర్టులో అమ్మ విజయం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : వృద్ధాప్యంలో అండగా ఉండాల్సిన కొడుకు కాదు పొమ్మన్నాడు. అత్తలో అమ్మను చూసుకుని సేవ చేయాల్సిన కోడలు నిర్లక్ష్యం ప్రదర్శించింది. అంతేకాదు వృద్ధురాలని చూడకుండా ఇంటి నుంచి గెంటేశారు కొడుకు కోడలు. పెంచి పెద్ద చేసి కొడుకు భవిష్యత్తుకు బాటలు వేసిన ఆ కన్నతల్లి.. ఇప్పుడు అదే కొడుకు తన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే చూస్తూ ఊరుకోలేదు. న్యాయపోరాటానికి దిగడంతో కన్నకొడుకు మెట్టు దిగాడు. ఇకపై అమ్మను మంచిగా చూసుకుంటానంటూ అభయమిచ్చాడు.

బీజేపీ నేతకు శఠగోపం.. 75 లక్షలకు స్వామీజీ ఎసరుబీజేపీ నేతకు శఠగోపం.. 75 లక్షలకు స్వామీజీ ఎసరు

కోర్టు మెట్లెక్కిన అమ్మ.. దిగొచ్చిన కొడుకు

కోర్టు మెట్లెక్కిన అమ్మ.. దిగొచ్చిన కొడుకు

కేపీహెచ్‌బీ పరిధిలోని అడ్డగుట్టలోని శ్రీనిలయం అపార్టుమెంటులో వి.శివలక్ష్మి అనే వృద్ధురాలు కొడుకుతో కలిసి నివాసముంటున్నారు. అయితే తనను కొడుకు, కోడలు ఇంట్లోంచి గెంటివేయడమే కాకుండా చంపేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ గతేడాది అక్టోబరులో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. ఆ మేరకు కేపీహెచ్‌బీ పోలీసులపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

 అమ్మను ఆదరించండి : న్యాయస్థానం

అమ్మను ఆదరించండి : న్యాయస్థానం

శివలక్ష్మి పిటిషన్ పై న్యాయమూర్తి జస్టిస్‌ పి.నవీన్‌రావు విచారణ జరిపారు. ఆమె తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.
ఆ వృద్ధురాలు కొడుకు, కోడలిపై ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదుచేసి దర్యాప్తు జరపాలని పోలీసులను ఆదేశించింది న్యాయస్థానం. రోడ్డునపడ్డ ఆ అమ్మను తిరిగి కొడుకు చెంతకు చేర్చాలని, అదేవిధంగా ఆమెకు తగిన రక్షణ కల్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు.

ఇకపై జాగ్రత్తగా చూసుకుంటా..!

ఇకపై జాగ్రత్తగా చూసుకుంటా..!

ఈ కేసు సందర్భంగా కొడుకు తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. తండ్రి కొనుగోలు చేసిన స్థలాన్ని బిల్డరుకు అప్పగించడంతో అపార్టుమెంట్ నిర్మించారని.. అందులో వీరి కుటుంబానికి ఆరు ఫ్లాట్లు వచ్చాయని కోర్టుకు తెలిపారు. అయితే అందులో 2 ఫ్లాట్లు అమ్మి సొమ్ము చేసుకోగా.. మిగతా 4 ఫ్లాట్లు ఉమ్మడి ఆస్థిగా తల్లి, కొడుకుల పేర్లపై ఉన్నాయని చెప్పారు. తన క్లైంట్ ఇకపై తల్లిని జాగ్రత్తగా చూసుకుంటారని న్యాయమూర్తికి వివరించారు.

పోలీసుల తరపు న్యాయవాది కూడా వాదనలు వినిపించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు గతేడాది నవంబర్ 24న కేసు నమోదు చేశారనే విషయం కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అదలావుంటే అందరి వాదనలు విన్న న్యాయమూర్తి.. తల్లిని జాగ్రత్తగా చూసుకుంటామనే కొడుకు నిర్ణయాన్ని స్వాగతించారు. ఉమ్మడి కుటుంబానికి చెందిన ఆస్తి వివాదం కాబట్టి సంబంధిత న్యాయస్థానంలో తేల్చుకుంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

English summary
A Mother Won a case against her son in kphb colony, hyderabad. She filed a petition in highcourt regarding her son not seeing well and thrown out from home. At last her son accepted his mistake and promised about take care of his mother.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X