హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షైన్‌ ప్రమాదంపై నివేదిక... అడుగడుగున ఆసుపత్రి నిర్లక్ష్యం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌లో చిన్నారుల ప్రాణాలను ఫణంగా పెట్టిన షైన్ ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యధోరణి అడుగడుగునా కనిపిస్తోంది. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో సోమవారం తెల్లవారు జామున సంఘనలో ఒక శిశువు మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పోందుతున్న మరో అయిదుగురు పిల్లలు ప్రాణాపాయం నుండి బయటపడ్డ విషయం తెలిసిందే...

 షైన్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం .. ఒక పసికందు మృతి, 5గురు చిన్నారుల పరిస్థితి విషమం షైన్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం .. ఒక పసికందు మృతి, 5గురు చిన్నారుల పరిస్థితి విషమం

ఆసుపత్రిలో జరిగిన సంఘటనపై విచారణ జరిపేందుకు ముగ్గురు సభ్యుల ఉన్నతాధికారుల బృందాన్ని ప్రభుత్వం నియమించింది. దీంతో నిపుణుల బృందం ఆసుపత్రిని సందర్శించి సంఘటనకు సంబంధించి పేషంట్లు, వారి బంధువులతో విచారణ జరుపింది.. ఆసుపత్రి వ్యవహరించిన తీరుపై విచారణ బృందం నివేదిక తాయారు చేసింది..కాగా పూర్తి వివరాలను వైద్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి శాంతాకుమారికి అందజేయనున్నారు. కాగా ఇలాంటీ ఆసుపత్రులకు ఇప్పటికే 1600 ఆసుపత్రులకు వైద్యశాఖ నోటీసులు జారీ చేయగా వాటిని రేపటి నుండి తనిఖీలు చేసేందుకు అధికారులు సిద్దమవుతున్నట్టు తెలిపారు.

 a report was prepared on Shine hospital incident

విచారణలో భాగంగా ,విస్మయం కల్గించే విషయాలు బయటకు వచ్చాయి. ఆసుపత్రి యాజమాన్యం నిబంధనల ప్రకారం ఆసుపత్రి నడిపేందుకు అనుమతి కూడ తీసుకోలేదని తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో అనుమతి ముగియనుండగా , తిరిగి అనుమతి కోసం మూడు నెలల ముందుగానే అనుమతులు తీసుకోవాల్సి ఉంది. కాని నేటివరకు కూడ ఆసుపత్రి యాజమాన్యం ఎలాంటీ ధరఖాస్తులు చేయలేదని సమాచారం.మరోవైపు 150 గజాల్లో కేవలం రెండు అంతస్థుల భవనాన్ని నిర్మించాల్సి ఉండగా నిబంధనలు అతిక్రమించి నాలుగు అంతస్తుల భవనాన్ని నిర్మించారు.

English summary
Government officials have finally prepared a report on Shine hospital incident. three men committee will hand over to the government
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X