హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓ గజదొంగ ప్రేమ కథ : రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు.. ప్రియురాలి కోసం చోరీలు చేశాడు

|
Google Oneindia TeluguNews

అమీర్‌పేట : ప్రేమ కోసం జీవితాన్ని పణంగా పెట్టాడు. ప్రేమికురాలి కోసం ఏదైనా చేయడానికి సిద్ధమయ్యాడు. ఆమెనే సర్వసంగా భావించాడు. ఆమె సంతోషం కోసం ఆరాటపడ్డాడు. ఆమె కళ్లల్లో ఆనందం చూడటానికి అతడి జీవితంలో చీకట్లు నింపుకున్నాడు. ఇదంతా ఓ గజదొంగ ప్రేమ కథ. ప్రేమించిన అమ్మాయి కోసం దొంగలా అవతారమెత్తి గజదొంగ స్థాయికి చేరాడు. ఉన్నతమైన కుటుంబం.. డబ్బుకు లోటు లేదు.. కానీ ప్రేమించిన అమ్మాయి కోసం జీవితం నాశనం చేసుకున్నాడు.

<strong>వారు పేదలే కాని మత సామరస్యానికి పెద్దలు.. ! ముస్లీం యువతి పెళ్లి కార్డుపై సీతారాములు</strong>వారు పేదలే కాని మత సామరస్యానికి పెద్దలు.. ! ముస్లీం యువతి పెళ్లి కార్డుపై సీతారాములు

 ప్రేయసి కోసం చోరీల బాట

ప్రేయసి కోసం చోరీల బాట

ప్రేమించడంలో తప్పు లేకపోవచ్చు. ప్రేమికురాలిని బాగా చూసుకోవడంలో తప్పు లేకపోవచ్చు. కానీ ప్రేమించిన అమ్మాయి కోసం దొంగలా మారడం మాత్రం ముమ్మాటికీ తప్పే. అతడి వ్యక్తిత్వాన్ని ప్రేమించిందా.. లేదంటే అతడిచ్చే కానుకల కోసం ప్రేమించిందా?.. ఇదంతా హైదరాబాద్ లో పోలీసులకు చిక్కిన గజదొంగ ప్రేమకథలో ట్విస్ట్.

ఉన్నతకుటుంబానికి చెందిన బల్వీర్ సింగ్ అలియాస్ బల్లు (27సం.).. ప్రియురాలి కోసం దొంగలా మారాడు. అతడికి లెక్కలేనన్ని ఆస్తిపాస్తులున్నాయి. అంతేకాదు బీకాం కంప్యూటర్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. చదువుంది, డబ్బులున్నాయి.. జీవితానికి ఇంకేం కావాలి. కానీ ప్రేమికురాలి కోసం దారి తప్పాడు. ఆమెను సంతోషపెట్టడానికి చోరీలు చేయడం మొదలుపెట్టాడు.

ప్రియురాలి కళ్లల్లో ఆనందం చూడటానికే..!

ప్రియురాలి కళ్లల్లో ఆనందం చూడటానికే..!

సుల్తాన్‌బజార్‌లోని బడీచౌడి చౌదరిబాగ్‌ ప్రాంతానికి చెందిన బల్వీర్‌ సింగ్‌ కుటుంబ సభ్యులు ఆర్థికంగా బాగానే స్థిరపడ్డారు. కాచిగూడలో వీరికి చెందిన భవనాల ద్వారా నెలనెలా లక్షల రూపాయల్లో అద్దెలు వస్తాయి. అయితే ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన బల్వీర్ సింగ్.. జల్సాలకు అలవాటుపడ్డాడు.

డబ్బు దుబారాగా ఖర్చు చేయడంతో చాలాసార్లు కుటుంబ సభ్యులు వద్దని వారించారు. వినకపోవడంతో అతడిని దూరంగా పెట్టారు. అయితే ఇతర రాష్ట్రంలో ఎంబీఏ చదువుతున్న ఓ యువతితో ప్రేమలో పడ్డాడట. ఆమెను సంతోషపెట్టడానికి ఎక్కడి డబ్బులు సరిపోలేదట. చివరకు అప్పులు కూడా చేసినట్లు తెలుస్తోంది. అలా ఆ యువతి కారణంగా డబ్బుల అవసరం పెరిగి దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు.

చోరోంకా ప్యార్ కహానీ

చోరోంకా ప్యార్ కహానీ

ప్రేమికురాలు ఇతర రాష్ట్రంలో చదువుకుంటుండటంతో ఆమెకు అన్నీ తానై వ్యవహరించాడు బల్వీర్ సింగ్. ఆమెకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించాడు. దొంగతనాలు చేయడం ద్వారా వచ్చిన డబ్బులతో ప్రేమికురాలికి ఏ లోటు రాకుండా చూసుకున్నాడు. చివరకు పోలీసులకు చిక్కి ఊచలు లెక్కిస్తున్నాడు.

ఈనెల 9వ తేదీన అమీర్ పేట సమీపంలోని బల్కంపేటలో ఓ ఇంట్లో 30 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎస్ఆర్ నగర్ పోలీసులు సీసీటీవి ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. చోరీ జరిగిన ఇంటి సమీపంలో బల్వీర్ సింగ్ తచ్చాడిన విజువల్స్ రికార్డయ్యాయి. దాంతో అతడి ఆచూకీ పసిగట్టి సుల్తాన్ బజార్ లో అరెస్ట్ చేశారు. ఎస్ఆర్ నగర్ లో 3 చోరీలు, రాయదుర్గంలో ఒకటి, పేట్‌బషీరాబాద్‌లో మరొక చోరీ చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. అతడి నుంచి దాదాపు 15 లక్షల రూపాయల విలువ చేసే అర కిలో బంగారం, హోండా యాక్టివా, ఇనుప రాడ్ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

English summary
A Rich Family Young Man Turned as Thief named balvir singh in Hyderabad. For his lover happiness, he made thefts in city. SR Nagar police were arrested balvir singh and collected half kg gold from him and sent to remand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X